ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఈ పుస్తకాన్ని తీసుకున్నవారితో లేదా అప్పటికే తమ ఇంట్లో ఈ పుస్తకం ఉన్నవారితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించాలి. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తిగలవారిని లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివారిని తిరిగి కలుసుకుంటున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వండి. ఈ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఇంటివారి దగ్గర అప్పటికే ఆ పుస్తకం ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1995కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు.
▪ కావలికోట పత్రికలు అందిన వెంటనే ప్రచారకులకు ఇవ్వాలి. అప్పుడు వాళ్లు క్షేత్ర సేవలో ఇవ్వడానికి ముందే వాటిల్లో ఏముందో తెలుసుకోగలుగుతారు.
▪ జ్ఞాపకార్థ ఆచరణ 2010, మార్చి 30, మంగళవారం రోజున జరుగుతుంది. ఒకవేళ మీ సంఘం మంగళవారం రోజున కూటం జరుపుకుంటున్నట్లయితే దాన్ని ఆ వారంలో వేరే రోజున జరుపుకోవడానికి ప్రయత్నించాలి. మీ రాజ్య మందిరంలో ఎక్కువ సంఘాలు కూటాలు జరుపుకోవడంవల్ల మీ కూటాన్ని వేరే రోజుకు మార్చుకోలేకపోతే దాన్ని రద్దుచేయవచ్చు. ఆ సేవా కూటంలో ప్రత్యేకంగా మీ సంఘానికి అవసరమైన అంశాలేమైనావుంటే వాటిని మరో సేవా కూటంలో చేర్చవచ్చు.
▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ —మరాఠి
యెహోవాకు కీర్తనలు పాడదాం—పదకూర్పు మాత్రమే (55 పాటలు) —నేపాలీ
▪ మళ్లీ అందుబాటులో ఉన్న ప్రచురణలు:
సర్వమానవాళి కొరకైన గ్రంథం —ఆంగ్లం, తెలుగు, మలయాళం, హిందీ
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము —మలయాళం, హిందీ
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? —ఆంగ్లం, హిందీ