ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఫిబ్రవరి: అందుబాటులో ఉంటే, కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) లేదా బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) ఇవ్వవచ్చు. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఈ పుస్తకాన్ని తీసుకున్నవారితో లేదా అప్పటికే తమ ఇంట్లో ఈ పుస్తకం ఉన్నవారితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించాలి. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తిగలవారిని లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివారిని తిరిగి కలుసుకుంటున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వండి. ఈ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.
▪ ‘మెలకువగా ఉండండి!’ జిల్లా సమావేశాలు, ఇండియాలో 14 భాషల్లో జరిగాయి. ఆసక్తికరంగా, ఈ సమావేశాల్లో 964 మంది బాప్తిస్మం తీసుకుని తాము సమర్పించుకున్నట్లు బహిరంగంగా తెలియజేశారు. జరిగిన 27 సమావేశాలకు మొత్తం 48,669 మంది హాజరయ్యారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9 శాతం కన్నా ఎక్కువ.
▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ —కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మలయాళం, హిందీ
▪ అందుబాటులో ఉన్న కొత్త డీవీడీలు:
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ —అమెరికన్ సంజ్ఞా భాష
▪ మళ్లీ అందుబాటులో ఉన్న ప్రచురణలు:
లేఖనాలనుండి తర్కించడం —తమిళం