కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/09 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 10/09 పేజీ 4

ప్రకటనలు

▪ అందించాల్సిన ప్రచురణలు అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన ప్రజలకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని చూపించి దాన్ని చర్చించండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఆ కరపత్రం ఉంటే, బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రచారకులు ప్రయత్నించాలి. నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఇంటివారి దగ్గర అప్పటికే ఆ పుస్తకం ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1995కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్నపిల్లలుంటే నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ఇంటివారి దగ్గర అప్పటికే ఆ పుస్తకం ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1995కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు.

▪ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వార్షిక పట్టిక ఇక మీదట మన రాజ్య పరిచర్యలో ఇన్‌సర్ట్‌గా ఇవ్వబడదు. ఇప్పటినుండి ప్రతి సంఘానికి వార్షిక పట్టిక వస్తుంది, ఒక కాపీని రాజ్య మందిరంలోని సమాచార బోర్డు మీద పెట్టాలి. మరో కాపీ పాఠశాల పైవిచారణకర్త ఉపయోగించుకోవడం కోసం ఆయన దగ్గర ఉంటుంది. ప్రచారకులకు ఎప్పటిలాగే ప్రతీనెలా తలా ఒక మన రాజ్య పరిచర్య పంపించబడుతుంది. దానిలో ఆయా వారాల సంఘ బైబిలు అధ్యయనం, దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటాల పట్టిక ఉంటుంది.

▪ 2010 జనవరి 4తో ప్రారంభమయ్యే వారం నుండి సంఘ బైబిలు అధ్యయనంలో ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకాన్ని ఉపయోగిస్తాం. ఈ పుస్తక ప్రతులు కావాలనుకునే సంఘాలు తమ తర్వాతి సాహిత్య రిక్వెస్టులో అవి కావాలని కోరాలి.

▪ బాప్తిస్మం తీసుకుని కనీసం సంవత్సరం పూర్తయి, సంఘంలో మంచి పేరున్న యెహోవాసాక్షులు బెతెల్‌ సేవ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలో మాట్లాడే ఏ భాషలోనైనా అనువాదకులుగా శిక్షణ పొందే సామర్థ్యమున్న స్వచ్ఛంద సేవకుల అవసరం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. బ్రాంచి కార్యాలయం వద్ద లేదా జిల్లా సమావేశంలో ఏర్పాటు చేసే బెతెల్‌ కూటంలో దరఖాస్తులు లభిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి