ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? ప్రచారకులు సాధ్యమైతే మొదటిసారి కలిసినప్పుడే ఈ పుస్తకాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించాలి. గృహస్థులు దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించడానికి అప్పటికప్పుడు క్లుప్తంగా అధ్యయనం చేసి చూపించండి. అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన ప్రజలకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని చూపించి దాన్ని చర్చించండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఆ కరపత్రం ఉంటే, బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రచారకులు ప్రయత్నించాలి. నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే 1995కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా అందించవచ్చు. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్నపిల్లలుంటే నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి.
▪ 2010 సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసమైన ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2010 ఏప్రిల్ 12వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఇవ్వబడుతుంది. ఆ ప్రసంగ శీర్షిక తర్వాత ప్రకటించబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనంగానీ సమావేశంగానీ ఉండే సంఘాలకు ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలోనూ ఏప్రిల్ 12కు ముందు ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వకూడదు.
▪ ‘మెలకువగా ఉండండి!’ అనే జిల్లా సమావేశానికి హాజరవడానికి వీలుగా కూటాల పట్టికలో మార్పులు చేయాలి. సమావేశానికి హాజరవడానికి ముందు జరిగే చివరి సేవా కూటంలో స్థానికంగా అన్వయించే ఉపదేశం, జ్ఞాపికలను సమీక్షించాలి. సమావేశం ముగిసిన ఒకటి రెండు నెలల తర్వాత, ప్రచారకులు సమావేశంలో నేర్చుకున్న విషయాలు వారికి పరిచర్యలో సహాయకరంగా ఉన్నట్లు వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను స్థానిక అవసరాలు అనే భాగంలో సమీక్షించాలి.