ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు, సర్వమానవాళి కొరకైన గ్రంథం. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? సాధ్యమైతే మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రచారకులు ప్రయత్నిస్తారు. గృహస్థులు దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించడానికి అప్పుడే క్లుప్తంగా అధ్యయనం చేసి చూపించండి. అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన ప్రజలకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని చూపించి దాన్ని చర్చించండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఆ కరపత్రం ఉంటే, బైబిలు అధ్యయనం మొదలు పెట్టడానికి ప్రచారకులు ప్రయత్నించాలి.
▪ ఆగస్టు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
▪ అందుబాటులో ఉన్న కొత్త డీవిడీ
మృతుల ఆత్మలు—అవి మీకు సహాయంపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? —అమెరికన్ సంజ్ఞా భాష
▪ మళ్లీ లభ్యమౌతున్న ప్రచురణలు
అప్రమత్తంగా ఉండండి! —ఉర్దూ