కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/09 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 6/09 పేజీ 4

ప్రకటనలు

▪ అందించాల్సిన ప్రచురణలు జూన్‌లో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల పాత పుస్తకాలను గానీ లేదా 1992కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? సాధ్యమైన ప్రతీచోట మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రచారకులు ప్రయత్నిస్తారు. గృహస్థులు దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించడానికి అప్పుడే క్లుప్తంగా అధ్యయనం చేసి చూపించండి.

▪ కొంతకాలంగా మన ప్రచురణల్లో మనం ఉపయోగించిన కొన్ని పదాల్లో మార్పులు చేయడం అవసరమైంది. ఈ మార్పులవల్ల మరింత ఖచ్చితంగా అనువదించడం వీలౌతుంది. ఉదాహరణకు, కొన్ని భారతీయ భాషల్లో, “పరిశుద్ధాత్మ” అనే పదం ఇకపై “దేవుని చురుకైన శక్తి” అని అనువదించబడుతుంది. మనం ఉపయోగించే పదాల్లోని ఇలాంటి మార్పులుగానీ మరితర మార్పులుగానీ పరిపాలక సభ ఆమోదంతోనే చేస్తున్నామని హామీనిస్తున్నాం.

▪ 2009 జిల్లా సమావేశాలు జరిగే హాళ్ల, సమావేశపు ముఖ్య కార్యాలయాల చిరునామాలు మన రాజ్య పరిచర్య రాబోయే సంచికల్లో ఇవ్వబడతాయి.

▪ ఇటీవలి సేవా సంవత్సరపు నివేదికలో పేరుతో సూచించబడని దేశాలకు లేదా వార్షిక పుస్తకంలోని (ఆంగ్లం) చివరి పేజీలో ఇవ్వబడని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించాల్సిన ప్రత్యేకమైన సూచనల గురించి తెలుసుకోవడానికి మీ బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి. మీరు వెళ్ళే ఆ ప్రాంతంలో రాజ్య ప్రకటనా పనిపై కొన్ని నిషేధాలు విధించబడి ఉండవచ్చు. (మత్త. 10:16) కొన్ని దేశాల్లో సందర్శకులుగా వెళ్ళినవాళ్ళు అక్కడి సహోదరులను లేదా సంఘాలను సంప్రదించడం సబబు కాకపోవచ్చు. అనియత సాక్ష్యం ఇవ్వడం, మీతోపాటు సాహిత్యాలు తీసుకువెళ్ళడం వంటి విషయాల్లో కావల్సిన నిర్దేశాలను మీరు పొందవచ్చు. ఈ విషయంలో ఇవ్వబడే నిర్దేశాలు పాటిస్తే మీకే కాదు రాజ్య ప్రకటనా పనికి కూడా అనవసరమైన సమస్యలు రాకుండా ఉంటాయి.—1 కొరిం. 14:33, 39, 40.

▪ లభ్యమౌతున్న కొత్త ప్రచురణలు

క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం —కన్నడ, తమిళం, మలయాళం, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి