దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2009 ఫిబ్రవరి 23వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2009 జనవరి 5 నుండి ఫిబ్రవరి 23 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. నాలుగవ దినము వరకూ జ్యోతులు చేయబడకపోతే, మొదటి రోజునే దేవుడు వెలుగును ఎలా రప్పించగలిగాడు? (ఆది. 1:3, 16) [w04 1/1 28వ పేజీ, 5వ పేరా]
2. నోవహు కనానును ఎందుకు శపించాడు? (ఆది. 9:20-25) [w04 1/1 31వ పేజీ, 2వ పేరా]
3. అబ్రాహాము నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అది ఎప్పటివరకు అమల్లోవుంటుంది? (ఆది. 12:1-4) [w04 1/15 27వ పేజీ, 1వ పేరా; w01 8/15 17వ పేజీ, 13వ పేరా]
4. నిమ్రోదు, అతని నాయకత్వాన్ని అనుసరించినవాళ్ళు, “పేరు సంపాదించు”కోవాలని చేసిన ప్రయత్నాల్లో విఫలమయ్యారని ఏది రుజువు చేస్తుంది? (ఆది. 11:4) [w98 3/15 25వ పేజీ]
5. రెండవ పేతురు 2:7లో లోతు “నీతిమంతుడు” అని పిలవబడ్డాడు కదా అలాంటప్పుడు ఆయన తన కుమార్తెలను అల్లరిమూకకు అప్పగించడానికి ఎందుకు ప్రయత్నించాడు? (ఆది. 19:8) [w05 2/1 26వ పేజీ, 15-16 పేరాలు; w04 1/15 27వ పేజీ, 4వ పేరా]
6. ఇష్మాయేలు విషయంలో హాగరుకు, శారాకు వచ్చిన వివాదాన్ని అబ్రాహాము పరిష్కరించిన విధానం నుండి దంపతులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ఆది. 21:10-14; 1 థెస్స. 2:13) [w06 4/15 6వ పేజీ, 5-8 పేరాలు]
7. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడని చూపించే లేఖన ఉదాహరణను ఇవ్వండి. (ఆది. 24:12-14, 67) [w08 2/15 3వ పేజీ, 4వ పేరా]
8. దేవదూతలు ఒక ‘నిచ్చెనమీద ఎక్కుతూ దిగుతూ’ ఉన్నట్లు యాకోబు చూసిన కల భావమేమిటి? (ఆది. 28:10-13) [w04 1/15 28వ పేజీ, 1వ పేరా]
9. లేయా కుమారుని నుండి రాహేలు పుత్రదాతవృక్షపు పండ్లను ఎందుకు ఆశించింది? (ఆది. 30:14, 15) [w04 1/15 28వ పేజీ, 7వ పేరా]
10. ప్రమాదపుటంచుల వరకు వెళ్ళడం అపాయకరమని దీనా ఉదాహరణ ఎలా వివరిస్తోంది? (ఆది. 34:1, 2, 19) [w04 10/15 21వ పేజీ, 6వ పేరా, 22వ పేజీ, 4వ పేరా]