కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/09 పేజీ 2
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 1/09 పేజీ 2

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు జనవరిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1992కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: అందుబాటులో ఉంటే ఈ సాహిత్యాలు అందించండి, మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము, బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం). మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. ఏప్రిల్‌, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇంకా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారిని, ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇవ్వడంపై దృష్టినిలపండి. ఆ పుస్తకం నుండి బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో అందించాలి.

▪ మార్చి మొదటివారం నుండి ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే కొత్త బహిరంగ ప్రసంగాంశం “లోక భ్రమలను త్యజించి, రాజ్య వాస్తవాలను వెంబడించండి.”

▪ ఈ సంవత్సరం ఏప్రిల్‌9 గురువారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతీ సంఘం సొంతగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు ప్రయత్నించాలి. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకు కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాం.

▪ జనవరి 26తో ప్రారంభమయ్యేవారంలో జరిగే సేవాకూటంలో నిర్వహించబడే చర్చకు సిద్ధపడడంలో భాగంగా రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియోను చూడమని సహోదరులకు గుర్తుచేయండి.

▪ సంఘ బైబిలు అధ్యయనంలో నా బైబిలు కథల పుస్తకము అధ్యయనం చేయడం కోసం, అదనపు ప్రశ్నలకు ముందు ఇవ్వబడిన లేఖనాలను అందరూ పుస్తక అధ్యయనం కోసం సిద్ధపడుతున్నప్పుడే చదువుకుని రావాలి. సంఘ బైబిలు అధ్యయనం నియమించబడిన పరిమిత సమయంలో ముగిసేలా ఈ సూచనను పాటించమని అందరినీ ప్రోత్సహిస్తున్నాము.

▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:

‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ —ఆంగ్లం

యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు, 2వ సంపుటి —ఆంగ్లం

▪ అందుబాటులో ఉన్న కొత్త డీవీడీ:

గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి —అమెరికన్‌సంజ్ఞా భాష

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి