ప్రకటనలు
▪ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం. గృహస్థులకు పిల్లలుంటే నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1992కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: అందుబాటులో ఉంటే ఈ సాహిత్యాలు అందించండి, మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము, బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం)
▪ జనవరి 1, 2009 నుండి “సంఘ పైవిచారణకర్త” అనే పదబంధం ఉపయోగంలో ఉండదు. ఈ బాధ్యతను నిర్వర్తించే సహోదరుడు, “పెద్దల సభ సమన్వయకర్త” అని పిలవబడతాడు.