ప్రకటనలు
▪ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించిన చోట, బైబిలు అధ్యయనాలను ప్రారంభించాలనే ఉద్దేశంతో మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇచ్చి దానిని చర్చించండి. నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం. గృహస్థులకు పిల్లలుంటే నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి. జనవరిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఆ పుస్తకం అప్పటికే ఉంటే, ప్రచారకులు 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1992కు ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు.
▪ నవంబరు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
▪ సంఘ పైవిచారణకర్తకు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తకు గమనిక: సంఘకూటపు కొత్త ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం, 2008 డిసెంబరు 29తో ప్రారంభమయ్యేవారం నుండి మొదలవుతుంది. ఈ సవరించబడిన కార్యక్రమం గురించి డిసెంబరు 2008, మన రాజ్య పరిచర్యలో సూచించబడుతుంది. ఆ వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష నిర్వహిస్తున్నప్పుడు, 2009 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష క్రింద ఇచ్చిన సూచనలను పాటించండి. ఆ కూటంలో ప్రసంగ లక్షణాన్ని పరిశీలించడం జరగదు.
▪ జనవరి సేవా కూటంలో రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియో గురించి చర్చ జరుగుతుంది. ఆ వీడియో లేకపోతే, వీలైనంత త్వరగా దాని కోసం సంఘం ద్వారా రిక్వెస్టు చేసుకోవాలి.