దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
పునఃసమీక్ష 2008 అక్టోబరు 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2008 సెప్టెంబరు 1 నుండి అక్టోబరు 27 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
ప్రసంగ లక్షణాలు
1. ప్రజలు నమ్ముతున్నదానికి కారణమేమిటో మనమెలా తెలుసుకోవచ్చు? [be-TU 259వ పేజీ, 2, 3 పేరాలు]
2. ఒక వ్యక్తి తన హృదయంలో నుండి దురభిమానాన్ని లేక ద్వేషాన్ని తొలగించుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? [be-TU 260వ పేజీ, 2వ పేరా]
3. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండేందుకు మన విద్యార్థులు తమ హృదయాలను పరీక్షించుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? [be-TU 261వ పేజీ, 3వ పేరా]
4. మనం మన శ్రోతల హృదయాన్ని చేరడానికి కృషిచేస్తున్నప్పుడు ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి? [be-TU 262వ పేజీ, 5వ పేరా]
5. సంఘకూటాల్లో మనం సమయాన్ని పాటించడానికి ఎందుకు అవధానాన్నివ్వాలి? [be-TU 263వ పేజీ, 1, 3 పేరాలు, బాక్సు]
ఉపదేశ ప్రసంగం
6. పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రికను ఎందుకు రాశాడు? [bsi08-1-TU 21వ పేజీ, 3వ పేరా]
7. పౌలు కొరింథీయులకు తన రెండవ పత్రికను రాయడానికి కొన్ని కారణాలు ఏమిటి? [bsi08-1-TU 23, 24 పేజీలు, 1, 2 పేరాలు]
8. క్రైస్తవులు పరిచర్యను ఎలా దృష్టించాలి? [bsi08-1-TU 24వ పేజీ, 18వ పేరా]
9. ఫిలిప్పీలోని సహోదరుల్లాగే నేడు మనమెలా దేవుని ఆమోదాన్ని పొంది, మన సహోదరుల ఆనందానికి కారకులం కావచ్చు? [bsi08-1-TU 16వ పేజీ, 12వ పేరా]
10. పౌలు, ఆయన తోటి పరిచారకులు థెస్సలొనీకలోని సంఘంపై ఎలాంటి అనుకూలమైన ప్రభావాలను చూపించారు? [bsi08-2-TU 3వ పేజీ, 13వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. ‘ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై [దుష్టుణ్ణి] సాతానుకు అప్పగించడం’ అంటే అర్థం ఏమిటి? (1 కొరిం. 5: 4, 5) [w08-TU 7/15 “యెహోవా వాక్యము సజీవమైనది—కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు”]
12. యేసు మరణాన్ని ఎంత తరచుగా, ఎప్పటి “వరకు” జ్ఞాపకం చేసుకోవాలి? (1 కొరిం. 11:26) [w08-TU 7/15 “యెహోవా వాక్యము సజీవమైనది—కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు”]
13. రెండవ కొరింథీయులు 12:2-4 ఏ దర్శనాన్ని ప్రస్తావిస్తున్నాయి, ఆ దర్శనాన్ని ఎవరు పొందివుండవచ్చు? [w04 10/15 8వ పేజీ 4వ పేరా, 10వ పేజీ 9వ పేరా]
14. మోషే ధర్మశాస్త్రాన్ని ‘క్రీస్తు వద్దకు నడిపించే బాలశిక్షకునితో’ పౌలు ఎందుకు పోల్చాడు? (గల. 3:24) [w03-TU 3/15 21వ పేజీ]
15. ‘సహోదరులైన మీ ఆత్మయు, జీవమును శరీరమును కాపాడబడును గాక’ అని ప్రార్థించినప్పుడు పౌలు ఉద్దేశమేమిటి? (1 థెస్స. 5:23) [w08-TU 9/15 “యెహోవా వాక్యము సజీవమైనది—థెస్సలొనీకయులకు, తిమోతికి రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు”]