కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/08 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • జూలై 14తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 21తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 28తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 7/08 పేజీ 2

సేవా కూటాల పట్టిక

గమనిక: సమావేశం జరిగే నెలల్లో ప్రతీవారం కోసం, మన రాజ్య పరిచర్యలో ఒక సేవా కూటం పట్టిక వేయబడుతుంది. “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా సంఘాలు తగిన మార్పులు చేసుకోవచ్చు. సముచితమైన చోట, జిల్లా సమావేశానికి హాజరవడానికి ముందు జరిగే సేవా కూటంలో, ఈ నెల మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీల్లోవున్న స్థానికంగా అన్వయించే సలహాలను, జ్ఞాపికలను మరోసారి గుర్తుచేయడానికి 15 నిమిషాలు వెచ్చించండి. సమావేశం ముగిసిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత ఒక సేవా కూటంలో (బహుశా స్థానిక అవసరాలు భాగాన్ని నిర్వహించే బదులు) ప్రచారకులకు పరిచర్యలో సహాయకరమనిపించిన సమావేశ అంశాలను పునఃసమీక్షించడానికి 15 నుండి 20 నిమిషాలను కేటాయించండి. సమీక్షను సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. ఆ సమాచారాన్ని తమ పరిచర్యలో ఎలా అన్వయించుకుంటున్నారో లేదా ఎలా అన్వయించుకోవాలనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

జూలై 14తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, జూలై-సెప్టెంబరు కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: మన అత్యవసర భావాన్ని కాపాడుకోవడం. కావలికోట, డిసెంబరు 15, 2006, 18-19 పేజీలు, 17-21 పేరాల ఆధారంగా ఇవ్వబడే ఉత్సాహవంతమైన ప్రసంగం.

20 నిమి: “సంఘ పుస్తక అధ్యయనంలో నా బైబిలు కథల పుస్తకం ఉపయోగించడం.”a పుస్తకంలోని ప్రత్యేక ఆకర్షణలను వివరించండి. పుస్తక అధ్యయన పట్టికను సమీక్షించండి. పుస్తక అధ్యయనానికి క్రమంగా హాజరై, చక్కగా వ్యాఖ్యానాలు చేయమని అందరినీ ప్రోత్సహించండి. కూటాలకు బాగా సిద్ధపడతారని పేరుగాంచిన ఒకరిద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేసి, అలా సిద్ధపడేందుకు వారిని ప్రేరేపించేదేమిటో చెప్పమని అడగండి.

పాట 26 (212)

జూలై 21తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “సిద్ధపాటు—సమర్థవంతంగా పునర్దర్శనాలు చేయడానికి కీలకం.”b ఒక ప్రచారకుడు పునర్దర్శనాల కోసం సిద్ధపడుతూ నాలుగు నిమిషాలపాటు స్వగతంలో మాట్లాడుకుంటున్నట్లు చూపించండి. ఆయన తన ఇంటింటి పరిచర్య రికార్డులను పరిశీలించుకుని, ఈ వారాంతంలో ఇద్దరు గృహస్థుల్ని కలుసుకోవలసివుందని నిశ్చయించుకుంటాడు. తర్వాత, ఆ ఇద్దరు వ్యక్తులతో గతంలో చర్చించిన విషయాలను గుర్తుతెచ్చుకుని, తన లక్ష్యమేమిటో నిశ్చయించుకుని, దాన్ని చేరుకోవడానికి సిద్ధపడతాడు. ఒక గృహస్థుడికి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించడానికి సిద్ధపడతాడు. 5వ పేరాలో ఇవ్వబడిన సలహాలను పాటిస్తూ మరో గృహస్థుడి ఆసక్తిని పెంచడానికి సిద్ధపడతాడు.

పాట 4 (43)

జూలై 28తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. సంఘ జమాఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి. ఆగస్టులో అందించవలసిన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ, ఒక అందింపును ప్రదర్శింపజేయండి.

10 నిమి: మీరు ‘ధైర్యంగా మాట్లాడగలరా’? కావలికోట, మే 15, 2006, 13-16 పేజీల ఆధారంగా ప్రసంగం. ధైర్యంగా ప్రకటించడంయొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పండి.

25 నిమి:  “ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం.”c సంఘ కార్యదర్శి దీనిని నిర్వహించాలి. సంఘం ఏ సమావేశానికి నియమించబడిందో తెలియజేయండి. “జిల్లా సమావేశపు జ్ఞాపికలు” అనే బాక్సును పరిశీలించండి.

పాట 6 (45)

ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (222)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: మీ పిల్లలు క్రైస్తవులుగా పాఠశాలలో తాము ఎదుర్కోబోయే సమస్యలను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. క్రైస్తవ యౌవనులు పాఠశాలలో ఎదుర్కొనే కొన్ని సవాళ్ళను పేర్కొనండి. సహాయకరమైన సమాచారాన్ని కనుక్కోవడానికి తల్లిదండ్రులు, వారి పిల్లలు వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. కొన్ని ఉదాహరణలను ఇవ్వండి. (“సూల్స్‌” అనే ముఖ్య శీర్షికను, “ఎక్స్‌పీరియన్సెస్‌” అనే ఉపశీర్షికను చూడండి.) పాఠశాలలో సవాళ్ళు ఎదుర్కోవడానికి, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడానికి తమ తల్లిదండ్రులు తమనెలా సిద్ధం చేశారో తెలియజేయమని ప్రేక్షకుల్లోవున్న క్రైస్తవ కుటుంబాల్లో పెరిగినవారిని అడగండి. తేజరిల్లు!లోని అంశాలపై తాము సిద్ధం చేసిన పాఠశాల నివేదికలను కూడా వారు ప్రస్తావించవచ్చు. పాఠశాలలో సాక్ష్యమివ్వడం తమకెలా ఒక కాపుదలగా పనిచేసిందో వారిని వివరించమనండి.

20 నిమి: “బలంగా నాటుకుపోయిన నమ్మకాలను మనం పెకిలించివేస్తున్నాం.”d బలంగా నాటుకుపోయిన అబద్ధమత నమ్మకాలను విడిచిపెట్టడానికి, తమతో బైబిలు అధ్యయనం నిర్వహించినవారు తమకెలా సహాయం చేశారో చెప్పమని ప్రేక్షకులను కోరండి.

పాట 17 (187)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి