ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు జూన్‌లో: అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధిచండి. జూలై ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధిచవచ్చు, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలుసుకున్నప్పుడే బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషిచేయండి. ఈ పుస్తకం అంతకుముందే గృహస్థుని దగ్గర ఉన్నట్లైతే, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శిస్తూ ఆయన దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించండి.
▪ ఆగస్టు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
▪ సంఘ పైవిచారణకర్త నియమించిన ఒకరు మార్చి, ఏప్రిల్, మే నెలల సంఘ జమాఖర్చుల వివరాల లెక్కలను తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేయడం పూర్తయ్యాక సంబంధిత వివరాలను, సంఘ జమాఖర్చుల వివరాలను చదివిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.—ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ కాంగ్రిగేషన్ అకౌంటింగ్ (S-27)ను చూడండి.
▪ క్రమ పయినీరు సేవ కోసం దరఖాస్తులను, పయినీరు సేవ ప్రారంభించడానికి అనుమతి కోసం అడిగిన తేదీకి కనీసం 30 రోజులకన్నా ముందు బ్రాంచి కార్యాలయానికి పంపించాలని సిఫారసు చేయబడుతోంది. సంఘ కార్యదర్శి, ఆ ఫారాల్లో పూర్తి వివరాలు ఉన్నాయో లేదో చూడడానికి వాటిని సమీక్షించాలి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసుకున్న ఖచ్చితమైన తేదీ జ్ఞాపకం లేకపోతే వారు ఆ తేదీని అంచనా వేసుకొని ఆ తర్వాత ఎల్లప్పుడూ ఆ తేదీని ఉపయోగించాలి. సంఘ కార్యదర్శి ఆ తేదీని కాంగ్రిగేషన్స్ పబ్లిషర్ రికార్డ్ (S-21) కార్డు మీద వ్రాయాలి.
▪ 2008 జనవరి నుండి కావలికోట, తేజరిల్లు! ఆడియో ఫైల్సు ఆంగ్లం, స్పానిష్ భాషల్లో www.jw.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆడియో పత్రికలు సంఘాలకు CD లేదా MP3 డిస్కుల రూపంలో అందుబాటులోకి రావడానికి ముందే, చాలామంది వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడల్లా సంస్థ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. అయినప్పటికీ డిస్కులను తయారుచేసి, పంపించడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇంటర్నెట్ ద్వారా పంపించడానికయ్యే ఖర్చు తక్కువ. కాబట్టి పత్రికలను అలా డౌన్‌లోడ్ చేసుకునే ప్రచారకులు, CD లేదా MP3 కావాలని పత్రికా సేవకునికి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దుచేసుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు. ఆడియో ప్రోగ్రామ్‌లు ఇంకా ఇతర భాషల్లో క్రమేణా www.jw.org ద్వారా అందుబాటులోకి వస్తాయి.
▪ విపత్తుకు ముందుగానే సిద్ధపడడం గురించి జూలై 6, 2006 తేదీతో పంపించిన ఉత్తరాన్ని పెద్దల సభలు సమీక్షించి, ప్రతీ ప్రచారకుడి ప్రస్తుత చిరునామా తమ దగ్గర ఉండేలా చూసుకోవాలి. విపత్తు సంభవించే ప్రాంతాల్లో అత్యవసరంగా సంప్రదించడానికి అదనపు సమాచారాన్ని పొందాలి. అయితే, అత్యవసర పరిస్థితుల్లోనేకాక, ప్రచారకులు ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే, అంటే వారు సెలవుల్లో వేరే ప్రాంతానికి వెళ్తున్నా, బిజినెస్ పనిమీద ఎక్కువరోజులు ఇంటికి దూరంగా ఉంటున్నా లేదా హాస్పిటల్లో ఉంటున్నా, అలాంటిది మరేదైనా పరిస్థితుల్లో దాని గురించి వారి సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తతో లేదా మరొక పెద్దతో మాట్లాడడం పెద్దలకు సహాయకరంగా ఉంటుంది.
▪ ఈ సంవత్సరం జిల్లా సమావేశం గురించి, ప్రత్యేక ఆహ్వాన హ్యాండ్‌బిల్లులతో ప్రచారం చేయబడదని దయచేసి గమనించండి. అయితే త్వరలో గమనార్హమైన ప్రపంచవ్యాప్త ప్రచారకార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకు తర్వాత తెలియజేయబడతాయి.
▪ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
‘వచ్చి నన్ను అనుసరిచండి’–పెద్ద అచ్చు —ఆంగ్లం
ఇది ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయవలసిన ప్రచురణ అని, కేవలం దృష్టిలోపం ఉండి చిన్న అచ్చుతో ఉన్నవాటిని చదవలేనివారికి అని దయచేసి గమనించండి. కాబట్టి దృష్టి లోపం ఉన్న ప్రచారకులు అడిగినప్పుడు వారి కోసం మాత్రమే ఆర్డర్ చేయాలి. సంఘ సేవా కమిటీ వారి నిజమైన అవసరాన్ని పరిశీలించి సొసైటీకి పంపించేముందు లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌మీద దానిగురించి ప్రస్తావించాలి.
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (ట్రాక్ట్ నం. 15) —రష్యన్, స్పానిష్