కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/08 పేజీలు 3-4
  • ‘ఆయన అడుగుజాడల్లో నడవండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఆయన అడుగుజాడల్లో నడవండి’
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “వచ్చి నన్ను వెంబడించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యేసులా ప్రేమతో బోధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 4/08 పేజీలు 3-4

‘ఆయన అడుగుజాడల్లో నడవండి’

1 యేసు రబ్బీల పాఠశాలల్లో చదవకపోయినప్పటికీ ఆయన చరిత్రలోనే గొప్ప ప్రచారకుడు. యేసు పరిచర్యకు సంబంధించిన లిఖిత సమాచారం మనకోసం భద్రపర్చబడివుండడం మనకెంతో ప్రయోజనకరం. మనం సమర్థవంతులైన ప్రచారకులుగా తయారవ్వాలంటే ‘ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి.’—1 పేతు. 2:21.

2 ప్రజలపట్ల ప్రేమ కనబర్చండి: ప్రజలపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ యేసును పురికొల్పింది. (మార్కు 6:30-34) మన క్షేత్రంలో అనేకమంది “వేదన”పడుతున్నారు, వారికి సత్యం ఎంతో అవసరం. (రోమా. 8:22) అలాంటివారి దయనీయ పరిస్థితి గురించి, వారిపట్ల యెహోవాకున్న ప్రేమపూర్వక శ్రద్ధ గురించి ఆలోచించినప్పుడు మనం ప్రకటనా పనిలో పట్టుదలగా కొనసాగగలుగుతాం. (2 పేతు. 3:9) అంతేకాక, మనకు వారిపట్ల నిజంగా శ్రద్ధవుందని గ్రహిస్తే, ప్రజలు మన సందేశాన్ని వినడానికి సుముఖంగా ఉంటారు.

3 అన్ని సందర్భాల్లోనూ ప్రకటించండి: యేసు అన్ని సందర్భాల్లోనూ ఇతరులకు సువార్త ప్రకటించాడు. (మత్త. 4:23; 9:9; యోహా. 4:7-10) ఆయనలాగే మనం దైనందిన కార్యకలాపాలు చేసుకుంటున్నప్పుడు కూడా సత్యం గురించి ఇతరులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగస్థలంలో, పాఠశాలలో, ప్రయాణంలో, షాపింగ్‌ చేస్తున్నప్పుడు, మరితర సందర్భాల్లో సాక్ష్యమిచ్చేలా కొంతమంది బైబిలును, కొన్ని ప్రచురణలను ఎల్లప్పుడూ తమతో ఉంచుకుంటారు.

4 రాజ్యానికి ప్రాముఖ్యతనివ్వండి: యేసు ప్రకటనాపనికి రాజ్య సువార్తే ముఖ్యాంశం. (లూకా 4:43) మనం గృహస్థునితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లేదా నేరుగా రాజ్యాన్ని గురించి ప్రస్తావించకపోయినా గృహస్థులు దాని అవసరాన్ని గ్రహించేందుకు సహాయం చేయాలని గుర్తుంచుకుంటాము. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని సూచించే లోకంలోని చెడు పరిస్థితుల గురించి మాట్లాడినా, మనం ముఖ్యంగా ‘ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్తనే’ ప్రకటిస్తాం.—రోమా. 10:15.

5 దేవుని వాక్యాన్ని ఉపయోగించండి: యేసు తన పరిచర్య అంతటిలో లేఖనాలను ఉపయోగిస్తూ బోధించాడు. యేసు తన ఇష్టానుసారంగా ఏదీ బోధించలేదు. (యోహా. 7:16, 18) ఆయన దేవుని వాక్యాన్ని క్రమంగా చదివేవాడు. సాతాను శోధించినప్పుడు లేఖనాలను తనకు అన్వయించుకున్నాడు. (మత్త. 4:1-4) మనం సమర్థవంతంగా బోధించాలంటే ప్రతీదినం బైబిలు చదివి, అన్వయించుకోవాలి. (రోమా. 2:21) పరిచర్యలో ప్రశ్నలకు జవాబులిస్తున్నప్పుడు లేఖనాధారంగా మాట్లాడాలి. వీలైనప్పుడెల్లా బైబిలు నుండి నేరుగా చదవాలి. స్వంత అభిప్రాయాలు కాదుగానీ దేవుని తలంపుల ఆధారంగానే చెబుతున్నామని గృహస్థులు గ్రహించాలని కోరుకుంటాం.

6 బోధిస్తున్నప్పుడు హృదయాలను చేరుకోండి: యేసును ఎందుకు బంధించలేదని బంట్రౌతులను ప్రధానయాజకులు, పరిసయ్యులు అడిగినప్పుడు వారు, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” అని జవాబిచ్చారు. (యోహా. 7:46) యేసు కేవలం విషయాలను చెప్పడమే కాక, శ్రోతల హృదయాలను చేరుకొనేలా బోధించాడు. (లూకా 24:32) ప్రజలు తన సందేశాన్ని అర్థంచేసుకునేలా నిజ జీవిత దృష్టాంతాలను ఉపయోగించాడు. (మత్త. 13:34) అన్ని విషయాలూ ప్రవాహంలా ఒకేసారి చెప్పలేదు. (యోహా. 16:12) తన గురించికాక యెహోవా గురించే ఎక్కువగా చెప్పాడు. ‘మన బోధ విషయంలో జాగ్రత్తగా’ ఉంటేనే మనం కూడా యేసులా మంచి బోధకులముగా తయారవగలం.—1 తిమో. 4:16.

7 ఉదాసీనత, వ్యతిరేకతవున్నా పట్టుదలతో కొనసాగండి: యేసు అద్భుత కార్యాలు చేసినా అనేకమంది ఆయన చెప్పేది వినలేదు. (లూకా 10:13) ఆయన కుటుంబ సభ్యులే ఆయనకు ‘మతి చలించిందని’ అనుకున్నారు. (మార్కు 3:21) అయినప్పటికీ ఆయన ప్రకటనాపనిలో పట్టుదలతో కొనసాగాడు. మానవులను స్వతంత్రులను చేయగల సత్యము తన దగ్గర ఉందని పూర్తిగా నమ్మాడు కాబట్టి, ఆయన కృతనిశ్చయంతో ముందుకు సాగాడు. (యోహా. 8:32) మనం కూడా యెహోవా సహాయంతో, అధైర్యపడకుండా కృతనిశ్చయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.—2 కొరిం. 4:1.

8 పూర్తిగా పాల్గొనడానికి అవసరమైన త్యాగాలు చేయండి: పరిచర్య చేయడానికి యేసు వస్తుపర సౌకర్యాలను త్యాగం చేశాడు. (మత్త. 8:20) ఆయన అవిశ్రాంతంగా, కొన్నిసార్లు ప్రొద్దుపోయేంత వరకు కూడా ప్రకటించాడు. (మార్కు 6:35, 36) తన పని సంపూర్తి చేయడానికి తనకు చాలా తక్కువ సమయం ఉందని యేసుకు తెలుసు. “కాలము సంకుచితమై యున్నది” కాబట్టి యేసులాగే మనం కూడా సమయాన్ని, శక్తిని, వనరులను త్యాగం చేయాల్సిన అవసరం ఉంది.—1 కొరిం. 7:29-31.

9 మొదటి శతాబ్దపు క్రైస్తవులు సమర్థవంతులైన ప్రచారకులుగా ఉన్నారు, ఎందుకంటే వారు యేసు నుండి నేర్చుకున్నారు. (అపొ. 4:13) చరిత్రలో గొప్ప ప్రచారకుడైన యేసును మనం అనుకరిస్తే మనం కూడా మన పరిచర్యను సంపూర్ణంగా చేయగలుగుతాం.—2 తిమో. 4:5.

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం ఎలా సమర్థవంతులైన ప్రచారకులుగా తయారవ్వొచ్చు?

2. ప్రజలపట్ల క్రీస్తుకున్న ప్రేమను మనం పెంపొందించుకునేందుకు ఏది సహాయం చేస్తుంది?

3. ఏ యే సందర్భాల్లో యేసు ఇతరులకు ప్రకటించాడు?

4. మన ప్రకటనా పనికి రాజ్యాన్ని ముఖ్యాంశంగా ఎలా చేసుకోవచ్చు?

5. మన పరిచర్య సమర్థవంతంగా ఉండడంలో బైబిలు పాత్ర ఏమిటి?

6. తన శ్రోతల హృదయాలను చేరుకోవడానికి యేసు ఏమి చేశాడు?

7. యేసు ఎందుకు పరిచర్యలో పట్టుదలతో కొనసాగాడు?

8, 9. సువార్త నిమిత్తం త్యాగాలు చేయడంలో యేసును మనమెలా అనుకరించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి