ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు, మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి శ్రద్ధగా కృషి చేయండి. ఏప్రిల్, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి మాత్రమే హాజరై సంఘ కూటాలకు క్రమంగా రాని ఆసక్తిగల కొత్తవారిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. అలాంటివారిలో ఎవరైతే ఇప్పటికింకా బైబిలు అధ్యయనం చేయడంలేదో వారితో గృహ బైబిలు అధ్యయనం చేయాలనే లక్ష్యంతో వారిని సందర్శించాలి. జూన్‌లో: అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి.
▪ సంఘాలు కావలికోట తాజా పత్రికలు అందుకున్న వెంటనే వాటిని ప్రచారకులకు ఇవ్వాలి. దానివల్ల, ప్రచారకులు ఆ పత్రికలను క్షేత్రసేవలో అందించడానికి ముందే వాటితో సుపరిచితులు అవగలుగుతారు.
▪ సంఘ పైవిచారణకర్త నియమించిన వ్యక్తి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంఘ అకౌంట్స్‌ను ఆడిట్ చేయాలి. ఆ తర్వాతి నెలల్లో ఆడిట్ చేయడానికి వేర్వేరు వ్యక్తులను నియమించాలి. ఆడిటింగ్ పూర్తైన తర్వాత, సంఘంలో తర్వాతి అకౌంట్స్ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.—ఇన్‌స్ట్రక్షన్ ఫర్ కాంగ్రిగేషన్ అకౌంటింగ్ (S-27).
▪ 2008లో జరగబోయే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం యొక్క అంశం “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది.” సమావేశపు మూడురోజుల కార్యక్రమ భాగాలన్నింటికీ హాజరవడానికి మీరు పూర్తిగా సిద్ధపడేందుకు వీలుగా అవసరమైన సమాచారాన్ని జూలై మన రాజ్య పరిచర్య ఇస్తుంది. మూడు రోజులు ఆ సమావేశానికి హాజరవడానికి సెలవు పెట్టాల్సివుంటే, వెంటనే సెలవుకోసం అడగండి.
▪ 2008, ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం నుండి ఇంగ్లీషు భాషా సంఘాలు యెహోవా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి అనే ఆంగ్ల పుస్తకాన్ని అధ్యయనం చేస్తాయి, కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ భాషా సంఘాలు నా బైబిలు కథల పుస్తకమును అధ్యయనం చేస్తాయి, మిజో భాషా సంఘం నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని అధ్యయనం చేస్తుంది.
▪ క్రమ పయినీరు సేవకు దరఖాస్తు S-205 ఫారాన్ని పెద్దలకు ఇచ్చేముందు అది పూర్తిగా నింపబడిందో లేదో, అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయబడ్డాయో లేదో చూసుకోండి. సేవా కమిటీ ముఖ్యంగా సంఘ కార్యదర్శి, ఫారమ్‌పై సంతకం చేసే ముందు అన్ని ప్రశ్నలకు సరైన విధంగా, పూర్తిగా జవాబులు ఇవ్వబడ్డాయో లేదో పరిశీలించాలి. ఇలా చేయడం ద్వారా మరిన్ని వివరాలను అడగడాన్ని, నియామక ఆలస్యాన్ని నివారించవచ్చు.
▪ విదేశాల నుండి వచ్చిన సహోదరులను క్షేత్రసేవకు తీసుకువెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారు టూరిస్టు, బిజినెస్ వీసాలపై వస్తే అలాంటి మత కార్యకలాపాలు చేయడానికి అనుమతి ఉండదు. (రోమా. 13:1, 5; తీతు 3:1) స్థానిక ప్రచారకులు అప్పుడప్పుడూ ఎదుర్కొంటున్న తీవ్ర వ్యతిరేకతను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ సహోదరులను పునర్దర్శనాలకు తీసుకువెళ్ళడం సరైనదే అయినా వివేచనను ఉపయోగించడం మంచిది. మనం పునర్దర్శనం చేసే వ్యక్తి ఉండే ప్రాంతం, ఇతర పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని ఆ పునర్దర్శనానికి తీసుకువెళ్ళడం జ్ఞానయుక్తమో కాదో ఆలోచించాలి.