ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు, జనవరి: 192 పేజీల ఏ పాత పుస్తకమైనా లేక 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. సంఘాల్లో అలాంటి పాత పుస్తకాలు లేకపోతే, (అందుబాటులో ఉంటే) జ్ఞానము పుస్తకాన్ని గానీ, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను గానీ ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యం. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక అందించండి. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని ఆసక్తిగలవారిని సందర్శిస్తున్నప్పుడు ప్రత్యేక కృషి చేయాలి. అలాంటి సందర్శనలు గృహ బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో చేయాలి.
▪ మార్చి నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
▪ ఫిబ్రవరి నుండి మార్చి 2లోపు ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే కొత్త బహిరంగ ప్రసంగాంశం “విపత్కర కాలాల్లో మీరు సహాయాన్ని ఎక్కడినుండి పొందవచ్చు?”
▪ ఈ సంవత్సరం మార్చి 22, శనివారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రసంగం ముందుగానే ప్రారంభించినప్పటికీ చిహ్నాలను అందజేయడం మాత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు ప్రారంభించకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో స్థానికంగా అడిగి తెలుసుకోండి. ప్రతీ సంఘం రాజ్యమందిరంలోనే జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు ప్రయత్నించాలి. అయితే ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే హాలును ఒక సంఘం తర్వాత మరో సంఘం ఉపయోగించుకోవాలనుకుంటే, ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకు కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాం. హాజరయ్యే వారిని తీసుకురావడం, తీసుకువెళ్ళడంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ వంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు బాగుంటాయో పెద్దల సభ నిర్ణయించాలి.
▪ సంఘ కార్యదర్శులు, సంఘంలోని ప్రతీ క్రమ పయినీరుకు సంబంధించిన పయినీర్ అపాయింట్‌మెంట్ లెటర్ (S-202) తమ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఆ ఉత్తరం తమ దగ్గర లేనట్లయితే, వ్రాతపూర్వకంగా బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి.