పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట నవం. 15
“సంతోషకరమైన, సంకల్పవంతమైన జీవితాన్ని గడపాలని మనమంతా కోరుకుంటాం. సంతోషానికిగల కీలకం గురించి యేసు ఇక్కడ చెప్పిన దానితో మీరు ఏకీభవిస్తారా? [మత్తయి 5:3 చదివి, ప్రతిస్పందించనివ్వండి.] దేవుణ్ణి సేవించాలన్న మన సహజ అవసరాన్ని తీర్చుకోవడం మన జీవితాలకు ఒక సంకల్పాన్ని ఎలా ఇస్తుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
యౌవనులను కలిసినప్పుడు మీరిలా చెప్పవచ్చు: “చాలామంది యౌవనస్థులు కొన్నిసార్లు తాము విడిచిపెట్టబడినట్లో లేదా ఒంటరివారమన్నట్లో భావిస్తారు. మీకెప్పుడైనా అలా అనిపించిందా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత, సామెతలు 15:13 చదవండి.] నిజానికి ఒంటరితనమనేది చాలా బాధాకరమైనదే. ఈ ఆర్టికల్, ఒంటరితనం వల్ల కలిగే భావాలతో ఎలా పోరాడవచ్చో మంచి సూచనలను ఇస్తుంది.” 12వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.
కావలికోట డిసెం. 1
“ఈ ప్రశ్నకు మీరేమని జవాబిస్తారు? [ముఖపత్రంపైనున్న ప్రశ్నను చదివి, ప్రతిస్పందించనివ్వండి.] మానవజాతిని ఐక్యపర్చాలన్నదే దేవుని సంకల్పం. [కీర్తనలు 46:8, 9 చదవండి.] ఆ ఐక్యత సాధించబడే విధానం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“మనలో చాలామందిమి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును కోరుకుంటాం. ఆశావహ దృక్పథం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మీకనిపిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత సామెతలు 17:22 చదవండి.] ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవడం ఎందుకు ప్రయోజనకరమో ఈ పత్రిక వివరిస్తుంది.” 22వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.