ప్రశ్నా భాగం
◼ మనమందించే ప్రచురణలకు మన వ్యక్తిగత ఈ-మెయిల్ అడ్రస్‌ను ఇవ్వడం సరైనదేనా?
కొంతమంది ప్రచారకులు తమ వ్యక్తిగత ఈ-మెయిల్ అడ్రస్‌లను ఇతరులకు తామందించే పత్రికలపై లేదా కరపత్రాలపై స్టాంపుతో ముద్రిస్తున్నారు లేక ముద్రించిన లేబుల్‌ను అతికిస్తున్నారు. దీనివల్ల, ప్రచురణలు తీసుకున్నవారు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఆ అడ్రస్ ఇచ్చిన ప్రచారకుణ్ణి సంప్రదించగలుగుతున్నారు. ఆసక్తిగల వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతోనే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, పత్రికల, కరపత్రాల చివరిపేజీలో మన అధికారిక వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వబడింది. కాబట్టి, ప్రచురణలకు మన వ్యక్తిగత ఈ-మెయిల్ అడ్రస్ లేబుల్‌ను అతికించకుండా ఉండడమే సరైనది.
ఒక ప్రచారకుడు చిన్న పేపరుమీద అడ్రస్ రాసి క్షేత్రంలోని ప్రజలకు, ముఖ్యంగా పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు, ఇవ్వాలా వద్దా అనేది వ్యక్తిగత విషయం. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఆసక్తిగల వారే మనల్ని సంప్రదిస్తారని అనుకోకుండా వారిని తిరిగి కలుసుకోవడానికి మనమే చొరవతీసుకోవాలి. ఒక వ్యక్తికి ఎంత ఆసక్తి ఉందనేది ఆ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడడం ద్వారానే చక్కగా తెలుసుకోవచ్చు.