ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: నా బైబిలు కథల పుస్తకము. గృహస్థులు తమకు పిల్లలు లేరని చెబితే వారికి అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను అందించండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం. దానికి బదులు, యెహోవాకు సన్నిహితమవండి లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాన్ని అందజేయవచ్చు. జనవరిలో: 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా లేదా 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. సంఘాల్లో అలాంటి పాత పుస్తకాలు అందుబాటులో లేకపోతే, జ్ఞానము పుస్తకాన్ని (అందుబాటులో ఉంటే) గానీ అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను గానీ ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము.
◼ డిసెంబరు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువుగా ఉంటుంది.
◼ ఆయా సంస్కృతుల, మతనేపథ్యాల ప్రజలకు సాక్ష్యమిచ్చేందుకు రూపొందించబడిన బైబిలు ఆధారిత ప్రచురణలు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రచురణల పట్టిక సాహిత్య సేవకుని దగ్గర ఉంది.
◼ జిల్లా సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పని కోసం చెక్ రూపంలో ఇవ్వబోయే చందాలు, బ్రాంచి కార్యాలయానికి పంపించబోయే చెక్కులు “Watch Tower Bible and Tract Society of India” పేరున ఇవ్వాలి. వాటితోపాటు చందాదారుని పేరు, పూర్తి అడ్రసు, ఏ ఉద్దేశంతో తమసొంత వనరుల నుండి సొసైటి ప్రపంచవ్యాప్త పనికోసం తాము చందా ఇస్తున్నారో తెలియజేసే ఉత్తరాన్ని జతచేయాలి. మీరు చెల్లించే చందా 50,000 రూపాయలుకన్నా ఎక్కువవుంటే, మా ఆడిట్ రికార్డులకోసం మీ ఆదాయపు పన్ను పర్మనెంట్ అకౌంట్ నెంబరును మాకు తెలియజేయండి. దయచేసి వీటిని ఈ చిరునామాకు పంపించండి. The Watch Tower Bible and Tract Society of India, 927/1, A V Pura, Post Box 6441, Yelahanka, Bangalore - 560 064.
◼ డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్ని (DPA) కార్డును ఇంకా ఎవరైనా పూర్తిచేయకపోతే దాన్ని పూర్తిచేయమని ప్రచారకులను ప్రోత్సహిస్తున్నాం. రక్తమార్పిడిని నిరాకరించే విషయంలో మీ హక్కును ఈ DPA కార్డు పరిరక్షిస్తుంది. ఈ విషయంలో అవసరమైన సహాయాన్ని పెద్దలు మీకందిస్తారు.—నవంబరు 2006 మనరాజ్య పరిచర్య మధ్యపేజీ చూడండి.
◼ ప్రచారకులు నెలలో జరిపే ప్రతీ బైబిలు అధ్యయనాల స్టడీ రిపోర్ట్‌ను (S-3) ఇక మీదట ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే, క్షేత్రసేవా రిపోర్టులో (S-4) బైబిలు అధ్యయనాలకు సంబంధించిన కాలమ్‌లో ఎప్పటిలాగే నిర్వహించబడే వివిధ బైబిలు అధ్యయనాల సంఖ్యను రాయాలి. ఇప్పటినుండి, S-3 ఫారమ్‌ను సంఘ కూటాల అటెన్డెన్స్ రికార్డు కోసం మాత్రమే ఉపయోగించాలి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2006 —ఆంగ్లం
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—చైనీస్, పర్షియన్, పోర్చుగీస్, ఫ్రెంచ్
మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (కరపత్రం నం. 16)—అరబిక్, చైనీస్, పర్షియన్, పోర్చుగీస్, ఫ్రెంచ్
కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)—చైనీస్, పర్షియన్, పోర్చుగీస్, ఫ్రెంచ్
బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి! (కరపత్రం నం. 27)—చైనీస్, పర్షియన్, పోర్చుగీసు, ఫ్రెంచ్
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
చర్చనీయ బైబిలు అంశాలు—తెలుగు, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, హిందీ