సేవా కూటాల పట్టిక
అక్టోబరు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ అక్టోబరు 15 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా అందించాలో ప్రదర్శించండి. ఒక పత్రిక గురించే మాట్లాడినా ప్రతీ ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి.
20 నిమి: యెహోవా సంస్థకు సన్నిహితంగా ఉండండి. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 17వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
15 నిమి: మీకు జ్ఞాపకమున్నాయా? కావలికోట ఆగస్టు 15, 2007, 19వ పేజీ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ.
పాట 21 (191)
అక్టోబరు 15తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
20 నిమి: మీరు బోధిస్తున్నవారిలో సత్యం ఫలిస్తోందా? కావలికోట ఫిబ్రవరి 1, 2005, 28-30 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. విద్యార్థి హృదయంలో ఏముందో తెలుసుకునేందుకు మనకు సహాయం చేసేలా బైబిలు బోధిస్తోంది అనే పుస్తకంలోని ప్రశ్నలు ఎలా రూపొందించబడ్డాయో వ్యాఖ్యానించండి. 1వ అధ్యాయంలోని 19వ పేరా; 2వ అధ్యాయంలోని 4వ పేరా; 3వ అధ్యాయంలోని 24వ పేరా; 4వ అధ్యాయంలోని 18వ పేరా వంటి ఉదాహరణలను పరిశీలించండి. పుస్తకంలోని వివిధ అంశాలను చక్కగా ఉపయోగించమని ప్రేక్షకులకు చెప్పండి.
15 నిమి: “నవంబరులో మనమందించనున్న తేజరిల్లు! ప్రత్యేక సంచిక.”a మనమందించనున్న తేజరిల్లు!లోని విషయాలను క్లుప్తంగా పరిశీలించి, ఆర్టికల్‌ను ప్రశ్నా-జవాబులతో చర్చించండి. 3వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా అందించాలో ప్రదర్శించండి. ప్రదర్శన ముగింపులో తర్వాతి సందర్శనానికి పునాది వేయండి.
పాట 18 (162)
అక్టోబరు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ నవంబరు 1 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా అందించాలో ప్రదర్శించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: వెలుగు సంబంధుల్లా నడుచుకోండి. ప్రసంగం, ఇంటర్వ్యూలు. మనం ఈ లోకపు అంధకారాన్ని విడిచిపెట్టి, యెహోవా వెలుగు మనల్ని నిర్దేశించడానికి అనుమతించాం. (ఎఫె. 5:8, 9, 10) అలా అనుమతించడం మన జీవితాన్ని మెరుగుపర్చి, దానికి ఒక సంకల్పాన్నిచ్చింది. (1 తిమో. 4:8) ఆ వెలుగు మనకు నిరీక్షణను కూడా ఇస్తుంది. (రోమా. 15:4) యెహోవాతో చక్కని సంబంధం ఏర్పర్చుకోవడానికి, దాన్ని కాపాడుకోడానికి, పెద్దపెద్ద ఆటంకాలను అధిగమించిన ఇద్దరు, ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. సత్యంలోకి వస్తున్నప్పుడు వారెలాంటి పరీక్షలను ఎదుర్కొన్నారు? వాటిని ఎలా అధిగమించగలిగారు? వారి జీవితం ఇప్పుడు ఏ విధంగా మెరుగైంది? సత్యంలో స్థిరంగా ఉండడానికి వారికేది సహాయపడుతోంది? ప్రసంగం ముగింపులో, ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తూ, యెహోవా బయల్పర్చిన సత్యంపట్ల ప్రగాఢమైన ప్రశంసను కనబర్చమనీ అందరినీ ప్రోత్సహించండి.—2 పేతు. 1:5-8.
పాట 29 (222)
అక్టోబరు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 13 (124)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్టోబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. నవంబరులో అందించే సాహిత్యాల గురించి చెప్పి, ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.
15 నిమి: మీ సృష్టికర్తను మహిమపరచడానికి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోండి. కావలికోట జూలై 15, 2004, 21-3 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తాము పెట్టుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి, వాటిని సాధించడానికి తాము చేస్తున్న కృషి గురించి చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు.
20 నిమి: “బీదలకు నిరీక్షణా సందేశాన్ని ప్రకటించండి.”b
పాట 17 (187)
నవంబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: దైవిక జ్ఞానం సహాయంతో మీ పిల్లలను కాపాడుకోవడం. కావలికోట జనవరి 1, 2005 సంచికలోని 23-7 పేజీల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “అందరూ పరస్పరం ప్రోత్సహించుకోవడం.”c ఒక ప్రయాణ పైవిచారణకర్త సంఘాన్ని సందర్శించినప్పుడు తాము ఎలా ప్రోత్సహించబడ్డారో నిర్దిష్టంగా చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు.
పాట 21 (191)
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.