2008వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
సూచనలు
2008వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించడానికి ఈ క్రింది ఏర్పాట్లు ఉంటాయి.
సమాచారానికి మూలాధారాలు: పరిశుద్ధ గ్రంథము [O.V.], దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి [be], “ప్రతిలేఖనము” విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది [bsi08-1, bsi08-2], “చర్చనీయ బైబిలు అంశాలు” [td].
పాట, ప్రార్థన, ఆహ్వానపు మాటలతో పాఠశాలను సరిగ్గా సమయానికి ప్రారంభించి, ఈ క్రింద సూచించిన విధానాన్ని పాటించండి. ప్రతీ భాగం తర్వాత పాఠశాల పైవిచారణకర్త తర్వాతి భాగాన్ని పరిచయం చేస్తాడు.
ప్రసంగ లక్షణం: 5 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త, సహాయక సలహాదారుడు లేదా అర్హతగల మరో పెద్ద పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకం ఆధారంగా ఒక ప్రసంగ లక్షణంపై చర్చిస్తాడు. (పెద్దలు తక్కువగా ఉన్న సంఘాల్లో అర్హతగల పరిచర్య సేవకులను ఉపయోగించుకోవచ్చు.)
ఉపదేశ ప్రసంగం: 10 నిమిషాలు. ఇది అర్హతగల ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఈ ప్రసంగం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకం లేదా “ప్రతిలేఖనము” విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది అనే బ్రోషురు ఆధారంగా ఇవ్వబడుతుంది. దీన్ని పది నిమిషాల ఉపదేశ ప్రసంగంలా ఇవ్వాలి. ఈ ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు కేవలం సమాచారం అందజేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకూడదు, చర్చిస్తున్న సమాచారంలో సంఘానికి బాగా ఉపయోగపడే విషయాలను నొక్కిచెబుతూ సమాచారపు ఆచరణాత్మక విలువపై దృష్టి సారించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇవ్వబడిన ప్రసంగాంశాన్ని ఉపయోగించాలి. ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు నిర్ణీత సమయంలో ముగించేలా జాగ్రత్తపడతారని ఆశించబడుతోంది. సలహా ఇవ్వవలసిన అవసరముంటే వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
బైబిలు పఠన ముఖ్యాంశాలు: 10 నిమిషాలు. మొదటి అయిదు నిమిషాలు, అర్హతగల ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని స్థానిక అవసరాలకు అన్వయించాలి. ఆ వారం బైబిలు పఠనానికి నియమించబడిన భాగంలోని ఏ భాగంపైనైనా ఆయన వ్యాఖ్యానించవచ్చు. అయితే ఇది నియమిత పఠన భాగపు సారాంశంలా ఉండకూడదు. ఈ సమాచారం ఎందుకు, ఏ విధంగా విలువైనదో ప్రేక్షకులు గ్రహించడానికి సహాయం చేయాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభ భాగానికి కేటాయించబడిన ఐదు నిమిషాలకు మించకుండా ప్రసంగీకుడు జాగ్రత్తపడాలి. ప్రేక్షకులు భాగం వహించేందుకు ఐదు నిమిషాలు ఉండేలా ఆయన చూసుకోవాలి. బైబిలు పఠనంలో ఆసక్తికరమైన ఏ అంశాలు తాము గ్రహించారో, దాని ప్రయోజనాలేమిటో క్లుప్తంగా (30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో) చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించాలి. ఆ తర్వాత పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులను వారు నియమించబడిన ఇతర తరగతి గదులకు పంపిస్తాడు.
2వ విద్యార్థి ప్రసంగం: 4 నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ. ఇది ఒక సహోదరుడు చదవాల్సిన భాగం. విద్యార్థి పరిచయ మాటలు లేక ముగింపు మాటలు ఏమీ చెప్పకుండా నియమిత సమాచారాన్ని చదవాలి. పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులు అవగాహనతో, అనర్గళంగా, భావాన్ని సరిగ్గా నొక్కిచెబుతూ, స్వరభేదంతో, సరైన చోట ఆగుతూ, సహజత్వంతో చదివేందుకు సహాయపడడంలో ముఖ్యంగా శ్రద్ధ చూపిస్తాడు.
3వ విద్యార్థి ప్రసంగం: 5 నిమిషాలు. ఇది ఒక సహోదరికి నియమించబడుతుంది. ఈ నియామకాన్ని పొందే విద్యార్థులకు పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలో 82వ పేజీలోవున్న పట్టిక నుండి ఒక సన్నివేశం నియమించబడుతుంది లేదా వారే అందులోనుండి ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవాలి. విద్యార్థిని తనకివ్వబడిన ప్రసంగాంశాన్నే ఉపయోగిస్తూ దానిని స్థానిక క్షేత్ర పరిస్థితులకు తగినట్లుగాను, ఆచరణాత్మకంగాను ఉండేలా క్షేత్ర సేవకు సంబంధించిన ఒక రంగానికి అన్వయింపజేయాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించబడనప్పుడు, విద్యార్థిని ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని మన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. కొత్త విద్యార్థులకు రెఫరెన్సులున్న నియామకాలే ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త, విద్యార్థిని సమాచారాన్ని విపులీకరించే విధానంపైనా, గృహస్థురాలికి లేఖనాలపై తర్కించడంలోనూ, అందించబడుతున్న సమాచారంలోని కీలకాంశాలను అర్థం చేసుకోవడంలోనూ ఆమె సహాయపడే విధానంపైనా ముఖ్యంగా శ్రద్ధ చూపిస్తాడు. పైవిచారణకర్త ఒక సహాయకురాలిని నియమిస్తాడు.
4వ విద్యార్థి ప్రసంగం: 5 నిమిషాలు. నియమించబడిన అంశంపై విద్యార్థి ప్రసంగించాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించబడనప్పుడు, విద్యార్థి ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని మన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. ఈ భాగానికి ఒక సహోదరుడు నియమించబడినప్పుడు, ఆయన రాజ్యమందిరంలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రసంగంలా ఇవ్వాలి. సహోదరి నియమించబడినప్పుడు, ఆమె దీన్ని 3వ విద్యార్థి ప్రసంగానికి ఇవ్వబడిన సూచనల ప్రకారం ఇవ్వాలి. 4వ విద్యార్థి ప్రసంగం సహోదరునికి ఇవ్వడం సముచితమని పాఠశాల పైవిచారణకర్త భావించినప్పుడు ఆయన అలా ఇవ్వవచ్చు. పువ్వుగుర్తు ఇవ్వబడిన ప్రసంగాలకు సహోదరులను మాత్రమే నియమించాలని దయచేసి గమనించండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని, సేవాకూటంలోని వివిధ భాగాలను నిర్వహించడానికి మీ సంఘంలో సరిపడేంతమంది పెద్దలు, పరిచర్య సేవకులు ఉన్నట్లయితే పూవు గుర్తులోవున్న అంశాలను సాధ్యమైనప్పుడెల్లా ఒక పెద్దకు లేదా పరిచర్య సేవకునికి నియమించడం మంచిది.
సలహా: 1 నిమిషం. విద్యార్థులు పనిచేసే ప్రసంగ లక్షణాన్ని పాఠశాల పైవిచారణకర్త ప్రసంగానికి ముందే చెప్పడు. 2వ, 3వ, 4వ విద్యార్థి ప్రసంగాలు ముగిసిన తర్వాత తాను ఆ ప్రసంగాల్లో గమనించిన ప్రశంసనీయమైన ఒక అంశంపై నిర్మాణాత్మకంగా వ్యాఖ్యానించాలి. కేవలం “బాగా చేశారు” అని ప్రశంసించడం మాత్రమే లక్ష్యంగా ఉండకూడదు గానీ, ఆ ప్రసంగంలోని ఫలానా అంశం ఎందుకు బాగుందో తెలియజేసే నిర్దిష్ట కారణాల గురించి కూడా చెప్పాలి. ప్రతీ విద్యార్థికి వారి అవసరాన్నిబట్టి, నిర్మాణాత్మకమైన అదనపు సలహాను కూటం తర్వాత లేదా వేరే సమయంలో వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
సమయపాలన: ఏ ప్రసంగమైనా, సలహాదారుని సలహాలైనా నియమిత సమయాన్ని మించకూడదు. 2వ, 3వ, 4వ విద్యార్థి ప్రసంగాల సమయం ముగిసిన వెంటనే వాటిని నేర్పుగా ఆపుజేయాలి. ప్రసంగ లక్షణంపై ఇవ్వబడే ప్రసంగాన్ని, ఉపదేశ ప్రసంగాన్ని లేదా బైబిలు పఠనంలోని ముఖ్యాంశాలను నిర్వహిస్తున్న సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే వారికి వ్యక్తిగతంగా సలహా ఇవ్వాలి. అందరూ తమ తమ సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి. మొత్తం కార్యక్రమం: పాట, ప్రార్థన మినహాయించి 45 నిమిషాలు.
సలహా పత్రం: పాఠ్య పుస్తకంలో ఉంది.
సహాయక సలహాదారుడు: పాఠశాల పైవిచారణకర్తతోపాటు సమర్థుడైన మరొక పెద్ద ఉంటే ఆయనను సహాయక సలహాదారునిగా పెద్దల సభ ఎంపిక చేయవచ్చు. ఒకవేళ సంఘంలో చాలామంది పెద్దలుంటే, ఈ నియామకాన్ని ప్రతీ సంవత్సరం అర్హుడైన ఒక్కో పెద్ద నిర్వహించవచ్చు. ఉపదేశ ప్రసంగాన్ని, బైబిలు ముఖ్యాంశాలను అందించే సహోదరులకు అవసరమైనప్పుడు విడిగా సలహా ఇవ్వడం సహాయక సలహాదారుని బాధ్యత. అయితే తోటి పెద్దలు లేదా పరిచర్య సేవకులు ఇచ్చిన ప్రతీ ప్రసంగం తర్వాత ఆయన సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష: 30 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త రెండు నెలలకు ఒకసారి పునఃసమీక్ష నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న సూచనల ప్రకారం ప్రసంగ లక్షణం, బైబిలు పఠనంలోని ముఖ్యాంశాలు నిర్వహించిన తర్వాత ఈ పునఃసమీక్ష ఉంటుంది. ఆ వారంతోసహా అంతకుముందు రెండు నెలలపాటు పరిశీలించబడిన సమాచారం ఆధారంగా ఈ పునఃసమీక్ష జరుగుతుంది. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష జరిగే వారంలో మీ సంఘానికి ప్రాంతీయ సమావేశం ఉంటే, పునఃసమీక్షను (ఆ వారపు మిగతా నియామకాలు) సమావేశం తర్వాతి వారానికి వాయిదా వేయాలి, ఆ మరుసటి వారపు నియామకాలను ముందటి వారంలో నిర్వహించాలి. ఒకవేళ పునఃసమీక్ష, జరిగే వారంలో ప్రాంతీయ పైవిచారణకర్త మీ సంఘాన్ని సందర్శిస్తుంటే, పట్టికలో ఉన్న ప్రకారమే పాట, ప్రసంగ లక్షణానికి సంబంధించిన ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాలు నిర్వహించాలి. ఉపదేశ ప్రసంగాన్ని (ప్రసంగ లక్షణం అనే ప్రసంగం తర్వాత ఇచ్చేది) మరుసటి వారంలో నుండి తీసుకోవాలి. ఆ మరుసటి వారపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఆ వారపు ప్రసంగ లక్షణానికి సంబంధించిన ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాల తర్వాత పునఃసమీక్ష ఉంటుంది.
పట్టిక
జన. 7 బైబిలు పఠనం: మత్తయి 1-6 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: అవసరమైన వివరణలను ఇవ్వడం (be 228వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: మత్తయి సువార్తకు ఉపోద్ఘాతం (bsi08-1 3-5 పేజీలు, 1-10 పేరాలు)
నం. 2: మత్తయి 5:1-20
నం. 3: td 39బి సబ్బాతు ఆచరణ కేవలం ప్రాచీన ఇశ్రాయేలుకు మాత్రమే
నం. 4: దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేసే మార్గాలు
జన. 14 బైబిలు పఠనం: మత్తయి 7-11 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: హృదయం పాత్ర ఏమిటి? (be 228వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: దేవుని వాక్యంలో ఆనందించండి (be 9వ పేజీ, 1వ పేరా-10వ పేజీ, 1వ పేరా)
నం. 2: మత్తయి 10:1-23
నం. 3: నిజాయితీగా ఉండడం ఎందుకు ప్రయోజనకరం?
నం. 4: td 39సి దేవుని విశ్రాంతి (సృష్టి “వారం”లోని ఏడవదినం)
జన. 21 బైబిలు పఠనం: మత్తయి 12-15 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేది (be 230వ పేజీ, 1-6 పేరాలు)
నం. 1: ప్రతి రోజూ బైబిలు చదవండి (be 10వ పేజీ, 2వ పేరా-12వ పేజీ, 4వ పేరా)
నం. 2: మత్తయి 14:1-22
నం. 3: td 40ఎ క్రైస్తవుల పట్ల వ్యతిరేకతకు కారణం
నం. 4: క్రీస్తు విరోధి ఎవరు?
జన. 28 బైబిలు పఠనం: మత్తయి 16-21 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: పరిశోధన ద్వారా ప్రసంగాన్ని సమాచారం అందజేసేదిగా చేయడం (be 231వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: ‘మీరెలా వింటున్నారో చూసుకోండి’ (be 13వ పేజీ, 1వ పేరా-14వ పేజీ, 4వ పేరా)
నం. 2: మత్తయి 17:1-20
నం. 3: td 40బి భర్త తనను దేవుని నుండి వేరుచేయడానికి భార్య ఒప్పుకోకూడదు
నం. 4: క్రైస్తవులు పవిత్రమైనవిగా పరిగణించే విషయాలు
ఫిబ్ర. 4 బైబిలు పఠనం: మత్తయి 22-25 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: లేఖనాలను వివరించడం (be 231వ పేజీ, 4-5 పేరాలు)
నం. 1: కూటాల్లో, సమావేశాల్లో వినడం (be 15వ పేజీ, 1వ పేరా-16వ పేజీ, 5వ పేరా)
నం. 2: మత్తయి 23:1-24
నం. 3: ఎల్లకాలం జీవించడం విసుగు పుట్టించదు
నం. 4: a td 40సి దేవుణ్ణి సేవించకుండా భార్య తనను అడ్డగించడాన్ని భర్త అనుమతించకూడదు
ఫిబ్ర. 11 బైబిలు పఠనం: మత్తయి 26-28 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: పదాల భావాలను వివరించడం (be 232వ పేజీ, 1వ పేరా)
నం. 1: మత్తయి సువార్త—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 5వ పేజీ, 29-33 పేరాలు)
నం. 2: మత్తయి 27:1-22
నం. 3: విశ్వాసముంచడమంటే కేవలం నమ్మడం ఎందుకు కాదు
నం. 4: b td 41ఎ క్రైస్తవులందరూ సాక్ష్యమివ్వాలి, సువార్తను ప్రకటించాలి
ఫిబ్ర. 18 బైబిలు పఠనం: మార్కు 1-4 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: వచనంపై తర్కించడం (be 232వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: మార్కు సువార్తకు ఉపోద్ఘాతం (bsi08-1 6, 7 పేజీలు, 1-11 పేరాలు)
నం. 2: మార్కు 2:1-17
నం. 3: ప్రేమవల్ల ధైర్యం ఎలా బలపడుతుంది?
నం. 4: c td 41బి పలుమార్లు సందర్శించాలి, సాక్ష్యమివ్వడం కొనసాగించాలి
ఫిబ్ర. 25 బైబిలు పఠనం: మార్కు 5-8 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు ప్రయోజనకరంగా ఉండే సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం (be 232వ పేజీ, 5వ పేరా-233వ పేజీ, 4వ పేరా)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
మార్చి 3 బైబిలు పఠనం: మార్కు 9-12 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: నియమిత సమాచార వినియోగం (be 234వ పేజీ, 1వ పేరా-235వ పేజీ, 3వ పేరా)
నం. 1: మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు (be 17వ పేజీ, 1వ పేరా-19వ పేజీ, 1వ పేరా)
నం. 2: మార్కు 11:1-18
నం. 3: దేవుడు ఎందుకు అబద్ధమాడనేరడు?
నం. 4: d td 41సి రక్తాపరాధం లేకుండా ఉండడానికి సాక్ష్యమివ్వాలి
మార్చి 10 బైబిలు పఠనం: మార్కు 13-16 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం (be 236వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: మార్కు సువార్త—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 7, 8 పేజీలు, 31-33 పేరాలు)
నం. 2: మార్కు 14:1-21
నం. 3: td 42ఎ యేసు నిందాస్పదముగా ఒక హింసాకొయ్యపై వేలాడదీయబడ్డాడు
నం. 4: “నరుని కోపము దేవుని నీతిని” ఎందుకు “నెరవేర్చదు”? (యాకో. 1:20)
మార్చి 17 బైబిలు పఠనం: లూకా 1-3 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: ప్రముఖమైన తలంపులు ప్రవేశపెట్టడానికి ఉపయోగపడే ప్రశ్నలు (be 237వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: లూకా సువార్తకు ఉపోద్ఘాతం (bsi08-1 8-10 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: లూకా 1:1-23
నం. 3: “క్రియలులేని విశ్వాసము” ఎందుకు “నిష్ఫలమైనది”? (యాకో. 2:20)
నం. 4: td 42బి హింసాకొయ్యను ఆరాధించకూడదు
మార్చి 24 బైబిలు పఠనం: లూకా 4-6 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: ఒక విషయంపై తర్కించడానికి ఉపయోగపడే ప్రశ్నలు (be 237వ పేజీ, 3వ పేరా-238వ పేజీ, 2వ పేరా)
నం. 1: గుర్తుంచుకోవడంలో దేవుని ఆత్మ వహించే పాత్ర (be 19వ పేజీ, 2వ పేరా-20వ పేజీ, 3వ పేరా)
నం. 2: లూకా 4:1-21
నం. 3: td 43ఎ నిరూపిత విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తుంది; పరిణామ సిద్ధాంతంతో విభేదిస్తుంది
నం. 4: దేవుని భయం పాపం చేయకుండా మనల్ని అదుపులో ఉంచుతుంది
మార్చి 31 బైబిలు పఠనం: లూకా 7-9 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: అంతర్గత భావాలను వెలికితీయడానికి ఉపయోగపడే ప్రశ్నలు (be 238వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: చదవడం మీద ఎందుకు శ్రద్ధ వహించాలి? (be 21వ పేజీ, 1వ పేరా-23వ పేజీ, 3వ పేరా)
నం. 2: లూకా 7:1-17
నం. 3: దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనడానికి, మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడనడానికి రుజువేమిటి?
నం. 4: td 43బి సృష్టిదినాలు 24 గంటల దినాలు కావు
ఏప్రి. 7 బైబిలు పఠనం: లూకా 10-12 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: నొక్కిచెప్పేందుకు ఉపయోగపడే ప్రశ్నలు (be 239వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: చదవడం మీద శ్రద్ధ వహించడం ఎలా? (be 23వ పేజీ, 4వ పేరా-26వ పేజీ, 5వ పేరా)
నం. 2: లూకా 11:37-54
నం. 3: td 44ఎ తొలిక్రైస్తవులు జన్మదినాలను, క్రిస్మస్ను ఆచరించలేదు
నం. 4: ప్రకటన 17:17 ను మనమెలా అర్థం చేసుకోవాలి?
ఏప్రి. 14 బైబిలు పఠనం: లూకా 13-17 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: తప్పుడు ఆలోచనలను బట్టబయలు చేయడానికి ఉపయోగపడే ప్రశ్నలు (be 239వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: అధ్యయనం ఎలా చేయాలి? (be 27వ పేజీ, 1వ పేరా-31వ పేజీ, 2వ పేరా)
నం. 2: లూకా 16:1-15
నం. 3: పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన దేవుని నియమం మనకేమి నేర్పిస్తుంది? (లేవీ. 19:9, 10)
నం. 4: td 45ఎ ఆధ్యాత్మిక స్వస్థతకు శాశ్వత ప్రయోజనాలు ఉన్నాయి
ఏప్రి. 21 బైబిలు పఠనం: లూకా 18-21 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: బోధించే ఉపమాలంకారాలు, రూపకాలంకారాలు (be 240వ పేజీ, 1వ పేరా-241వ పేజీ, 1వ పేరా)
నం. 1: లూకా సువార్త—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 10, 11 పేజీలు, 30-5 పేరాలు)
నం. 2: లూకా 18:1-17
నం. 3: td 45బి దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతలను తెస్తుంది
నం. 4: ‘సణగడం మానండి’ అంటే అర్థమేమిటి? (ఫిలి. 2:14)
ఏప్రి. 28 బైబిలు పఠనం: లూకా 22-24 పాట 29 (222)
ప్రసంగ లక్షణం: ఉదాహరణలు ఉపయోగించడం (be 241వ పేజీ, 2-4 పేరాలు)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
మే 5 బైబిలు పఠనం: యోహాను 1-4 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: లేఖనాల్లోని ఉదాహరణలు (be 242వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: యోహాను సువార్తకు ఉపోద్ఘాతం (bsi08-1 11-13 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: యోహాను 3:1-21
నం. 3: రాజైన సౌలును చంపడానికి దావీదు నిరాకరించడం నుండి మనమేమి నేర్చుకుంటాం?
నం. 4: td 45సి ఆధునిక కాలంలోని విశ్వాస స్వస్థతలకు దేవుని అంగీకారమున్న రుజువు లేదు
మే 12 బైబిలు పఠనం: యోహాను 5-7 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: అది అర్థమవుతుందా? (be 242వ పేజీ, 3వ పేరా-243వ పేజీ, 1వ పేరా)
నం. 1: అధ్యయనం ప్రతిఫలదాయకంగా ఉంటుంది (be 31వ పేజీ, 3వ పేరా-32వ పేజీ, 4వ పేరా)
నం. 2: యోహాను 6:1-21
నం. 3: అననీయ, సప్పీరాల వృత్తాంతం మనకే పాఠం బోధిస్తోంది?
నం. 4: td 45డి భాషలలో మాట్లాడడం కేవలం తాత్కాలిక ఏర్పాటు
మే 19 బైబిలు పఠనం: యోహాను 8-11 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: సుపరిచిత పరిస్థితుల నుండి ఉపమానాలు (be 244వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: బైబిలుతో పరిశోధన ఎలా చెయ్యాలి? (be 33వ పేజీ, 1వ పేరా-35వ పేజీ, 2వ పేరా)
నం. 2: యోహాను 11:38-57
నం. 3: td 1ఎ “లోకాంతము” అంటే అర్థం ఏమిటి
నం. 4: పదవ ఆజ్ఞను పాటించనివారిని శిక్షించడం సాధ్యం కాదు కదా, మరి అది ఎందుకు ఇవ్వబడింది?
మే 26 బైబిలు పఠనం: యోహాను 12-16 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు తగిన ఉపమానాలు (be 244వ పేజీ, 3వ పేరా-245వ పేజీ, 4వ పేరా)
నం. 1: ఇతర పరిశోధనా ఉపకరణాలను ఉపయోగించడం నేర్చుకోవడం (be 35వ పేజీ, 3వ పేరా-38వ పేజీ, 4వ పేరా)
నం. 2: యోహాను 12:1-19
నం. 3: td 1బి అంత్యదినాల సూచనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
నం. 4: మనం మన భారాన్ని యెహోవాపై ఎలా మోపుతాము? (కీర్త. 55:22)
జూన్ 2 బైబిలు పఠనం: యోహాను 17-21 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాల సమర్థమైన ఉపయోగం (be 247వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: యోహాను సువార్త—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 13, 14 పేజీలు, 30-5 పేరాలు)
నం. 2: యోహాను 21:1-14
నం. 3: మనం చూడలేని దేవునిని మనమెందుకు నమ్మాలి?
నం. 4: td 2ఎ అపవాది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి
జూన్ 9 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 1-4 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాలను యేసు ఎలా ఉపయోగించాడు? (be 247వ పేజీ, 3వ పేరా)
నం. 1: అపొస్తలుల కార్యములు పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi08-1 14, 15 పేజీలు, 1-8 పేరాలు)
నం. 2: అపొస్తలుల కార్యములు 1:1-14
నం. 3: td 2బి అపవాది ఈ లోక అదృశ్య పాలకుడు
నం. 4: ‘ధైర్యంగా మాట్లాడడంలో’ ఏమి ఇమిడివుంది? (హెబ్రీ. 3:6)
జూన్ 16 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 5-7 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాలను ఉపయోగించే విధానాలు (be 248వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం (be 39-42 పేజీలు)
నం. 2: అపొస్తలుల కార్యములు 5:1-16
నం. 3: td 2సి తిరుగుబాటుదారులైన దేవదూతలే దయ్యాలు
నం. 4: యెహోవాయందలి భయము ఎందుకు జ్ఞానమునకు మూలము? (కీర్త. 111:10)
జూన్ 23 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 8-10 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: మ్యాపులను, ముద్రిత సమావేశ కార్యక్రమాలను, వీడియోలను ఉపయోగించడం (be 248వ పేజీ, 4వ పేరా-249వ పేజీ, 2వ పేరా)
నం. 1: పాఠశాలలో విద్యార్థి నియామకాలకు సిద్ధపడడం (be 43వ పేజీ, 1వ పేరా-44వ పేజీ, 3వ పేరా)
నం. 2: అపొస్తలుల కార్యములు 8:1-17
నం. 3: యేసు ‘దరిద్రులను’ ఎలా ‘విడిపిస్తాడు’? (కీర్త. 72:12)
నం. 4: td 3ఎ అబద్ధ ప్రవక్తల గురించి ముందుగానే చెప్పబడింది; అపొస్తలుల కాలంలోనూ ఉన్నారు
జూన్ 30 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 11-14 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: పెద్ద సమూహాల కోసం దృశ్య సహాయకాలు ఉపయోగించడం (be 249వ పేజీ, 3వ పేరా-250వ పేజీ, 1వ పేరా)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
జూలై 7 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 15-17 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: తర్కించే విధానం ఎందుకు ప్రాముఖ్యం? (be 251వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: విషయం, సన్నివేశం ఉన్న ప్రసంగాన్ని సిద్ధపడడం (be 44వ పేజీ, 4వ పేరా-46వ పేజీ, 1వ పేరా)
నం. 2: అపొస్తలుల కార్యములు 16:1-15
నం. 3: యెహోవాను నిర్భయంగా సేవించడానికిగల కారణాలు
నం. 4: td 4ఎ అభిచారం దయ్యాల పని కాబట్టి దానిని విసర్జించాలి
జూలై 14 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 18-21 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: ఎక్కడ మొదలుపెట్టాలి? (be 251వ పేజీ, 4వ పేరా-252వ పేజీ, 3వ పేరా)
నం. 1: సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 47వ పేజీ, 1వ పేరా-49వ పేజీ, 1వ పేరా)
నం. 2: అపొస్తలుల కార్యములు 20:1-16
నం. 3: td 5ఎ మనిషిలో అమర్త్యమైనది ఏదీ లేదు
నం. 4: నిర్గమకాండము 23:19బి భాగంలో ఉన్న నిషేధాన్నిబట్టి మనమేమి నేర్చుకోవచ్చు?
జూలై 21 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 22-25 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ఎప్పుడు విడిచిపెట్టాలి? (be 252వ పేజీ, 4వ పేరా-253వ పేజీ, 2వ పేరా)
నం. 1: సేవాకూటంలోని భాగాలకు, ఇతర ప్రసంగాలకు సిద్ధపడడం (be 49వ పేజీ, 2వ పేరా-51వ పేజీ, 1వ పేరా)
నం. 2: అపొస్తలుల కార్యములు 22:1-16
నం. 3: యోహాను 13:34, 35 లోని మాటలను యెహోవాసాక్షులు ఏయే మార్గాల్లో నెరవేరుస్తున్నారు?
నం. 4: td 5బి ప్రాణం లేదా జీవశక్తి
జూలై 28 బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 26-28 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: ప్రశ్నలడగడం, కారణాలివ్వడం (be 253వ పేజీ, 3వ పేరా-254వ పేజీ, 2వ పేరా)
నం. 1: అపొస్తలుల కార్యములు—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 15-17 పేజీలు, 32-40 పేరాలు)
నం. 2: అపొస్తలుల కార్యములు 26:1-18
నం. 3: td 6ఎ అర్మగిద్దోను, దుష్టత్వాన్ని అంతమొందించే దేవుని యుద్ధం
నం. 4: యెహోవా ఎందుకు ఓర్పు చూపిస్తున్నాడు?
ఆగ. 4 బైబిలు పఠనం: రోమీయులు 1-4 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడివుండే వాదన (be 255వ పేజీ, 1వ పేరా-256వ పేజీ, 2వ పేరా)
నం. 1: రోమీయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం (bsi08-1 17, 18 పేజీలు, 1-7 పేరాలు)
నం. 2: రోమీయులు 3:1-20
నం. 3: దేవదూతలు దేవుని సేవకులను ఎలా కాపాడి, బలపరుస్తారు?
నం. 4: td 6బి దేవుని ప్రేమ చెక్కుచెదరలేదు
ఆగ. 11 బైబిలు పఠనం: రోమీయులు 5-8 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: అదనపు రుజువుల మద్దతుతో వాదన (be 256వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: బహిరంగ ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 52వ పేజీ, 1వ పేరా-54వ పేజీ, 1వ పేరా)
నం. 2: రోమీయులు 6:1-20
నం. 3: td 7ఎ (సా.శ.) 1914లో అన్యజనుల కాలములు పూర్తయ్యాయి
నం. 4: నీతి మనలను ఎలా కాపాడుతుంది?
ఆగ. 18 బైబిలు పఠనం: రోమీయులు 9-12 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: సరిపడేన్ని రుజువులు చూపించడం (be 256వ పేజీ, 6వ పేరా-257వ పేజీ, 3వ పేరా)
నం. 1: రోమీయులకు వ్రాసిన పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 18, 19 పేజీలు, 20-5 పేరాలు)
నం. 2: రోమీయులు 9:1-18
నం. 3: హానికరమైన గాలి కబుర్లను, పుకార్లను వ్యాపింపజేయడంలో ఏమి అపాయాలున్నాయి?
నం. 4: td 8ఎ క్రీస్తు తిరిగి రావడం మానవులకు కనిపించదు
ఆగ. 25 బైబిలు పఠనం: రోమీయులు 13-16 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: హృదయాన్ని స్పృశించేందుకు కృషి (be 258వ పేజీ, 1వ పేరా-259వ పేజీ, 1వ పేరా)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
సెప్టెం. 1 బైబిలు పఠనం: 1 కొరింథీయులు 1-9 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: ప్రజల హృదయాల్లో ఏముందో వెలికితీయడం (be 259వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికకు ఉపోద్ఘాతం (bsi08-1 20, 21 పేజీలు, 1-7 పేరాలు)
నం. 2: మొదటి కొరింథీయులు 4:1-17
నం. 3: td 8బి భౌతిక వాస్తవాలను బట్టి క్రీస్తు తిరిగి రావడాన్ని గుర్తించవచ్చు
నం. 4: ధనికులుగా ఉండడం దేవుని ఆశీర్వాదమున్నదనడానికి రుజువా?
సెప్టెం. 8 బైబిలు పఠనం: 1 కొరింథీయులు 10-16 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ప్రయోజనకరమైన భావాలను ప్రేరేపించడం (be 259వ పేజీ, 5వ పేరా-260వ పేజీ, 1వ పేరా)
నం. 1: కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 21, 22 పేజీలు, 23-6 పేరాలు)
నం. 2: మొదటి కొరింథీయులు 13:1–14:6
నం. 3: వాక్యప్రకారం ప్రవర్తించేవారు ఎందుకు ఆనందంగా ఉంటారు?
నం. 4: td 9ఎ చర్చి ఆధ్యాత్మికమైనది, క్రీస్తుపై నిర్మించబడింది
సెప్టెం. 15 బైబిలు పఠనం: 2 కొరింథీయులు 1-7 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: దైవిక భయమును అలవరుచుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం (be 260వ పేజీ, 2-3 పేరాలు)
నం. 1: కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఉపోద్ఘాతం (bsi08-1 22వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: రెండవ కొరింథీయులు 1:1-14
నం. 3: td 9బి చర్చి పేతురు మీద నిర్మించబడలేదు
నం. 4: హింసించబడుతున్నప్పుడు నిజ క్రైస్తవులు ఎందుకు సంతోషిస్తారు?
సెప్టెం. 22 బైబిలు పఠనం: 2 కొరింథీయులు 8-13 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: మన ప్రవర్తన యెహోవాకు ప్రాముఖ్యమైన విషయం (be 260వ పేజీ, 4వ పేరా-261వ పేజీ, 1వ పేరా)
నం. 1: కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 22, 23 పేజీలు, 18-20 పేరాలు)
నం. 2: రెండవ కొరింథీయులు 9:1-15
నం. 3: నిజ క్రైస్తవులు ఎందుకు లోకసంబంధులు కారు
నం. 4: td 10ఎ విధేయత చూపించే మానవజాతికి నిత్యజీవపు హామీ ఇవ్వబడింది
సెప్టెం. 29 బైబిలు పఠనం: గలతీయులు 1-6 పాట 19 (164)
ప్రసంగ లక్షణం: ఇతరులు పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయడం (be 261వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: గలతీయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 24, 25 పేజీలు, 1-6, 14-18 పేరాలు)
నం. 2: గలతీయులు 1:1-17
నం. 3: td 10బి క్రీస్తుతోడి వారసులకే పరలోక జీవితం లభిస్తుంది
నం. 4: ప్రేమ మనుష్య భయాన్ని ఎలా జయిస్తుంది?
అక్టో. 6 బైబిలు పఠనం: ఎఫెసీయులు 1-6 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: హృదయపూర్వక విధేయతను చూపించేలా ప్రోత్సహించడం (be 262వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: ఎఫెసీయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 26-28 పేజీలు, 1-8, 16-19 పేరాలు)
నం. 2: ఎఫెసీయులు 3:1-19
నం. 3: క్షమాపణ కోరడం బలహీనతకు గుర్తుకాదు
నం. 4: td 10సి అసంఖ్యాకులైన వేరేగొఱ్ఱెలకు భూజీవితం వాగ్దానం చేయబడింది
అక్టో. 13 బైబిలు పఠనం: ఫిలిప్పీయులు 1-4 – కొలొస్సయులు 1-4 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: ప్రజల హృదయాలను చేరుకోవడంలో యెహోవాకు సహకరించడం (be 262వ పేజీ, 5వ పేరా)
నం. 1: ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 28, 29 పేజీలు, 1-7, 12-14 పేరాలు)
నం. 2: ఫిలిప్పీయులు 3:1-16
నం. 3: td 11ఎ ప్రభువు రాత్రి భోజన ఆచరణను జ్ఞాపకం చేసుకోవడం
నం. 4: e కొలొస్సయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-1 30, 31 పేజీలు, 1-5, 12-14 పేరాలు)
అక్టో. 20 బైబిలు పఠనం: 1 థెస్సలొనీకయులు 1-5 – 2 థెస్సలొనీకయులు 1-3 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: సమయాన్ని ఎలా పాటించాలి? (be 263వ పేజీ, 1వ పేరా-264వ పేజీ, 4వ పేరా)
నం. 1: థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రికకు, రెండవ పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 3, 4 పేజీలు, 1-5, 13-15 పేరాలు; 5, 6 పేజీలు, 1-4, 10, 11 పేరాలు)
నం. 2: మొదటి థెస్సలొనీకయులు 1:1–2:8
నం. 3: td 11బి మాస్ లేఖన విరుద్ధమైనది
నం. 4: f తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 7వ పేజీ, 15-19 పేరాలు, 9వ పేజీ, 10-12 పేరాలు)
అక్టో. 27 బైబిలు పఠనం: 1 తిమోతి 1-6 – 2 తిమోతి 1-4 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: ప్రభావితం చేసే ఉద్బోధ (be 265వ పేజీ, 1-3 పేరాలు)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
నవం. 3 బైబిలు పఠనం: తీతు 1-3 – ఫిలేమోను 1-25 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: ప్రేమనుబట్టి ఉద్బోధించడం (be 266వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: తీతుకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 10, 11 పేజీలు, 1-4, 8-10 పేరాలు)
నం. 2: తీతు 1:1-16
నం. 3: td 12ఎ తండ్రియైన దేవుడు అద్వితీయుడు, ఆయనే విశ్వంలో సర్వోన్నతుడు
నం. 4: g ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 12, 13 పేజీలు, 7-10 పేరాలు)
నవం. 10 బైబిలు పఠనం: హెబ్రీయులు 1-8 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: లేఖనాల్లో నాటుకొనివున్న ఉద్బోధ (be 266వ పేజీ, 5వ పేరా-267వ పేజీ, 1వ పేరా)
నం. 1: హెబ్రీయులకు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం (bsi08-2 13-15 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: హెబ్రీయులు 3:1-19
నం. 3: td 12బి కుమారుడు భూమికి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తండ్రికంటే తక్కువవాడు
నం. 4: సరియైన వినయానికి, సరికాని వినయానికి మధ్య ఉన్న తేడాలు
నవం. 17 బైబిలు పఠనం: హెబ్రీయులు 9-13 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: మాట్లాడే స్వేచ్ఛ ఉండడం (be 267వ పేజీ, 2-3 పేరాలు)
నం. 1: హెబ్రీయులకు వ్రాసిన పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 15, 16 పేజీలు, 23-27 పేరాలు)
నం. 2: హెబ్రీయులు 10:1-17
నం. 3: td 12సి దేవుని మరియు క్రీస్తుల ఐక్యత
నం. 4: క్షమించడం ఐక్యతను ఎలా పురికొల్పుతుంది?
నవం. 24 బైబిలు పఠనం: యాకోబు 1-5 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: ప్రోత్సహించేవారిగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (be 268వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: యాకోబు వ్రాసిన పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 16-18 పేజీలు, 1-7, 15-17 పేరాలు)
నం. 2: యాకోబు 1:1-21
నం. 3: td 12డి దేవుని పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి
నం. 4: ‘కనికరం తీర్పును మించి ఎలా అతిశయపడుతుంది?’ (యాకో. 2:13)
డిసెం. 1 బైబిలు పఠనం: 1 పేతురు 1-5 – 2 పేతురు 1-3 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: యెహోవా ఏమి చేశాడో వారికి గుర్తుచేయడం (be 268వ పేజీ, 4వ పేరా-269వ పేజీ, 1వ పేరా)
నం. 1: పేతురు వ్రాసిన మొదటి పత్రికకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 19, 20 పేజీలు, 1-5, 11-13 పేరాలు)
నం. 2: మొదటి పేతురు 2:1-17
నం. 3: td 13ఎ లోక దుస్థితికి ఎవరు బాధ్యులు
నం. 4: h పేతురు వ్రాసిన రెండవ పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 21, 22 పేజీలు, 8-10 పేరాలు)
డిసెం. 8 బైబిలు పఠనం: 1 యోహాను 1-5; 2 యోహాను 1-13; 3 యోహాను 1-14; యూదా 1-25 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో చూపించడం (be 269వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: యోహాను వ్రాసిన మొదటి, రెండవ, మూడవ పత్రికలకు ఉపోద్ఘాతం, ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 22-24 పేజీలు, 1-5, 11-13 పేరాలు; 24, 25 పేజీలు, 1-3, 5 పేరాలు; 26వ పేజీ, 1-3, 5 పేరాలు)
నం. 2: మొదటి యోహాను 4:1-16
నం. 3: td 13బి దుష్టత్వం ఎందుకు అనుమతించబడింది
నం. 4: i యూదా వ్రాసిన పత్రిక—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 28వ పేజీ, 8-10 పేరాలు)
డిసెం. 15 బైబిలు పఠనం: ప్రకటన 1-6 పాట 29 (222)
ప్రసంగ లక్షణం: దేవుడు ప్రస్తుతం చేస్తున్న వాటి విషయమై ఆనందాన్ని వ్యక్తపరచడం (be 269వ పేజీ, 5వ పేరా-271వ పేజీ, 1వ పేరా)
నం. 1: ప్రకటన గ్రంథానికి ఉపోద్ఘాతం (bsi08-2 28-30 పేజీలు, 1-6 పేరాలు)
నం. 2: ప్రకటన 3:1-13
నం. 3: td 13సి అంతానికి ముందు ఈ దీర్ఘకాల వ్యవధి కనికరంతో కూడిన ఒక ఏర్పాటు
నం. 4: ఓర్పు, కనికరం చూపించడానికి ఎందుకు హద్దులున్నాయి?
డిసెం. 22 బైబిలు పఠనం: ప్రకటన 7-14 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందడం (be 5వ పేజీ, 1వ పేరా-8వ పేజీ, 1వ పేరా)
నం. 1: ప్రకటన గ్రంథము—ఎందుకు ప్రయోజనకరం? (bsi08-2 30, 31 పేజీలు, 28-34 పేరాలు)
నం. 2: ప్రకటన 8:1-13
నం. 3: td 13డి లోక దుస్థితికి మనుష్యులు పరిష్కారం తీసుకురాలేరు
నం. 4: “దేవుడు మన హృదయముకంటె అధికుడు” అనే మాటల భావమేమిటి? (1 యోహాను 3:19)
డిసెం. 29 బైబిలు పఠనం: ప్రకటన 15-22 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: తప్పులు లేకుండా చదవడం (be 83వ పేజీ, 1వ పేరా-84వ పేజీ, 1వ పేరా)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
[అధస్సూచీలు]
a సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
b సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
c సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
d సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
e సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
f సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
g సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
h సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.
i సహోదరులకు మాత్రమే నియమించండి, పెద్దలకు లేదా పరిచర్య సేవకులకు నియమిస్తే మంచిది.