కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/07 పేజీ 3
  • దేవుని సేవను ఎక్కువగా చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని సేవను ఎక్కువగా చేయండి
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యౌవన సహోదరులారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—2013
  • మీ పరిచర్యను విస్తృతపర్చుకునే మార్గాలు
    మన రాజ్య పరిచర్య—1999
  • బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 12/07 పేజీ 3

దేవుని సేవను ఎక్కువగా చేయండి

1 క్రైస్తవులు దేవుని మార్గంలో నడుస్తూ ‘అంతకంతకు అభివృద్ధి’ చెందుతూ ఉండాలని అపొస్తలుడైన పౌలు వారికి ఉపదేశించాడు. (1 థెస్స. 4:1) ఆ మాటల్ని మనమెలా అన్వయించుకోవచ్చు? ఒక మార్గం ఏమిటంటే, మనం ఆధ్యాత్మిక పనుల్లో ఇంకా ఎక్కువగా పాల్గొనే అవకాశాల కోసం చూస్తూ, మన ‘పరిచర్యను సంపూర్ణంగా’ చేసేందుకు ఎల్లప్పుడూ కృషిచేయాలి.—2 తిమో. 4:5.

2 ప్రేరణ: మన సృష్టికర్తను ఇంకా ఎక్కువగా సేవించాలనే కోరిక, ఇతరులకు మరింత సహాయం చేయడానికి ప్రేరణనిస్తుంది. మనం ఆధ్యాత్మిక ప్రగతిసాధిస్తూ, మన పరిచర్యను మెరుగుపరచుకోవాలని కోరుకుంటాం. సరైన దృక్పథంతో ఆధ్యాత్మిక కార్యకలాపాలు క్రమంగా చేయడం, దేవుని సేవలో మనం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సహాయంచేస్తుంది.—కీర్త. 1:1, 2; ఫిలి. 4:6; హెబ్రీ 10:24, 25.

3 దేవుని సేవను ఎక్కువగా చేయడానికి మనం ఇచ్చే స్ఫూర్తి, స్వయంత్యాగ స్ఫూర్తిని పెంపొందించుకోవడం అవసరం. యేసు ఉంచిన మంచి మాదిరిని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడంద్వారా మనం అలాంటి స్ఫూర్తిని పెంపొందించుకోవచ్చు. (మత్త. 20:28) యేసు తన పరిచర్య కాలమంతటిలో ఇతరులకు సేవచేయడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందాడు. (అపొ. 20:35) మనం ప్రజలపట్ల వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తూ, దేవుని సేవను ఎక్కువగా చేసే అవకాశాల కోసం చూడడం ద్వారా యేసు మాదిరిని అనుకరించవచ్చు.—యెష. 6:8.

4 తల్లిదండ్రుల పాత్ర: ఇతరులకు సహాయపడాలనే, దేవుని సేవను ఎక్కువగా చేయాలనే కోరికను చిన్నతనంలోనే పిల్లల్లో పెంపొందింపజేయవచ్చు. పిల్లలు కుటుంబ సభ్యుల శ్రమించే స్వభావాన్నేకాక, దేవుని సేవను ఎక్కువగా చేయడానికి వారు చూపే ఉత్సాహాన్ని కూడా గమనిస్తారు. ఒక సహోదరుడు తన చిన్నతనంలో వాళ్ళ తాతయ్యతో కలిసి సంఘపనుల్లో భాగంవహించడం వల్ల దేవుని సేవను ఎక్కువగా చేయడానికి ప్రేరేపించబడ్డాడు. వాళ్ళ తాతయ్య శ్రమించే స్వభావాన్ని, సంతోషాన్ని చూసి తను కూడా తన సహోదరులకు సేవచేసే అవకాశాలను వెదికేందుకు పురికొల్పబడ్డాడు. ఆయనిప్పుడు పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్నాడు.

5 సహోదరుల అవసరత: “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడు.” (1 తిమో. 3:1) ఈ మాటలు, సహోదరులు యెహోవా సంస్థలో అదనపు సేవాధిక్యతలను చేపట్టేందుకు అర్హత సంపాదించుకోవాలని వారిని ప్రోత్సహిస్తున్నాయి. దీని కోసం ప్రత్యేక నైపుణ్యాలు లేదా అసాధారణ సామర్థ్యాలు అవసరంలేదు. అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నించే సహోదరుడు దేవుని రాజ్యానికి మొదటి స్థానమిచ్చి, దేవుని సేవలో ఉత్సాహంగా పాల్గొంటాడు. (మత్త. 6:33; 2 తిమో. 4:5) ఆయన ఇతరులకు మంచి మాదిరిగా ఉండడానికి కృషిచేస్తాడు.

6 ప్రపంచవ్యాప్తంగా: యెహోవా సమకూర్చే పనిని త్వరపెడుతున్నాడు. (యెష. 60:22) యేసు మాదిరిని అనుసరిస్తున్న వారందరికీ దేవుని సేవను ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 2006 సంవత్సరపు ప్రపంచవ్యాప్త వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది 2,48,327 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ప్రతీరోజు సగటున 680 కన్నా ఎక్కువమంది క్రొత్తవారు బాప్తిస్మం తీసుకుంటున్నారు! మనందరం దేవుని సేవను ఎక్కువగా చేసే అవకాశాల కోసం వెదుకుతూనే ఉందుము గాక!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి