దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2007 ఆగస్టు 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 జూలై 2 నుండి ఆగస్టు 27, 2007 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
ప్రసంగ లక్షణాలు
1. పరిచర్యలో మనం కలిసేవారిపట్ల, సంఘంలోనివారిపట్ల మనం ఎలా గౌరవం చూపించవచ్చు? [be 192వ పేజీ, 2-4 పేరాలు]
2. మన భావాలను నిశ్చయతతో మాట్లాడాలంటే ఏది ప్రాముఖ్యం? [be 196వ పేజీ, 1-3 పేరాలు]
3. ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యంతో మాట్లాడేందుకు సహాయపడే కొన్ని సలహాలేమిటి? [be 197వ పేజీ, 5వ పేరా-198వ పేజీ, 4వ పేరా]
4. ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యాన్ని చూపించడంలో సరైన సమయమేదో నిర్ణయించుకోవడం ఎలా ఇమిడివుంది? (సామె. 25:11) [be 199వ పేజీ, 1–3 పేరాలు]
5. మన ప్రసంగ శైలి ప్రోత్సాహకరంగా ఎలా ఉండాలి? [be 203వ పేజీ, 3వ పేరా-204వ పేజీ, 1వ పేరా]
ఒకటవ నియామకం
6. యెహెజ్కేలు పుస్తకాన్ని యెహెజ్కేలే వ్రాశాడనే దాని గురించి, దాని ప్రామాణికతను గురించి, విశ్వసనీయతను గురించి మనం ఏమి చెప్పవచ్చు? [bsi07 6వ పేజీ, 3వ పేరా]
7. అన్యాయాన్ని సహించేందుకు ఒక వ్యక్తికి ఏ లక్షణం అవసరం? [w05 6/1 29వ పేజీ, 4వ పేరా]
8. పునరుత్థానాన్ని గురించి ప్రశ్నించిన సద్దూకయ్యులకు యేసు ఇచ్చిన జవాబు నుండి మనమేమి నేర్చుకుంటాము? (లూకా 20:37, 38) [be 66వ పేజీ, 4వ పేరా]
9. బైబిలు విద్యార్థిగానీ తోటి విశ్వాసిగానీ ఫలానా పరిస్థితిలో తానేమి చేయాలని మిమ్మల్ని అడిగితే మీరెలా జవాబివ్వాలి? [be 69వ పేజీ, 4వ పేరా-70వ పేజీ, 1వ పేరా]
10. “చిత్తవృత్తియందు నూతనపరచబ[డడంలో]” ఏమి ఇమిడివుంది? (ఎఫె. 4:23) [be 74వ పేజీ, 4వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. యెహెజ్కేలు 9:2-4లో అవిసెనారబట్ట ధరించుకొన్న వ్యక్తి ఎవరికి చిత్రీకరణగా ఉన్నాడు, “లలాటముల గురుతు” దేనికి సూచనగా ఉంటుంది? [w88 9/15 14వ పేజీ, 18వ పేరా]
12. క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులు ఏ భావంలో యెహెజ్కేలు 13:3 లో వర్ణించబడిన “స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తల[ను]” పోలివున్నారు? [w99 10/1 13వ పేజీ]
13. యెహెజ్కేలు 18:2లోని “సామెత” చెబుతూ ఇశ్రాయేలీయులు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, జవాబుదారులుగా ఉండే విషయం గురించి దానిలో ఏ ప్రాముఖ్యమైన పాఠం నొక్కిచెప్పబడింది? [w88 9/15 18వ పేజీ, 10వ పేరా]
14. యెరూషలేము ముట్టడించబడి, నాశనం చేయబడుతున్నప్పుడు యెహెజ్కేలు ఏ భావంలో “మౌనముగా” ఉన్నాడు? (యెహె. 24:27; 33:22) [w03 12/1 29వ పేజీ]
15. “మాగోగు దేశపువాడగు గోగు” ఎవరు, అతను యెహోవా ప్రజలను నాశనం చేయాలనే ప్రయత్నాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాడు? (యెహె. 38:2, 16) [w97 3/1 14వ పేజీ, 1వ పేరా-15వ పేజీ, 3వ పేరా]