కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 11తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 18తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 25తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 6/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూన్‌ 11తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, జూన్‌ 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాము. కావలికోట ఫిబ్రవరి 15, 2002, 24-28 పేజీల్లోని సమాచారం ఆధారంగా ప్రసంగం. కొంతమంది క్రైస్తవులు తాము బైబిలు అధ్యయనం నిర్వహించడానికి యోగ్యులం కాదనుకుని, ఆసక్తి గలవారికి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించడానికి వెనకాడతారు. అయితే, యెహోవా తన వాక్యంద్వారా, తన పరిశుద్ధాత్మశక్తి ద్వారా, తన సంస్థద్వారా మనల్ని యోగ్యులను చేస్తాడు. కేవలం సాహిత్యాన్ని అందించడం మాత్రమే మన లక్ష్యం కాదు. ప్రజలకు బోధించడానికి మనం కృషి చేయాలి. (మత్త. 28:19, 20) బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.

20 నిమి: ‘సమస్తము దేవుని మహిమకొరకు చేయండి.’ యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 13వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

పాట 4 (43) ముగింపు ప్రార్థన.

జూన్‌ 18తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “విభిన్న భాషల్లో కరపత్రాల సెట్టు.” ప్రేక్షకులతో చర్చ. మీ క్షేత్రంలో ఏ భాషల కరపత్రాల సెట్టు తీసుకువెళ్లాలని సూచించబడిందో సంఘానికి తెలియజేయండి. ఈ కరపత్రాల సెట్టును అన్ని సమయాల్లో తమ దగ్గర ఉంచుకోవాలని ప్రచారకులను ప్రోత్సహించండి.

20 నిమి: “యెహోవా సేవలో ప్రయాసపడడానికి మనం సంతోషిస్తాం!”a సమయం అనుమతిస్తే, ఉల్లేఖించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.

పాట 10 (82), ముగింపు ప్రార్థన.

జూన్‌ 25తో ప్రారంభమయ్యే వారం

పాట 2 (15)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ జూలై 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “‘ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశాన్ని’ మీరు వినియోగించుకోగలరా?”b క్రమ పయినీర్లలో ఒకరిద్దరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వారు క్రమ పయినీరు సేవ చేయడానికి ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు? వారు ఎలాంటి ఆశీర్వాదాలను పొందారు?

పాట 21 (191), ముగింపు ప్రార్థన.

జూలై 2తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రచారకులను జూన్‌ నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని వారికి గుర్తు చేయండి. జూలైలో అందించే సాహిత్య ప్రతిపాదనల గురించి చెప్పి, ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.

15 నిమి: అనియత సాక్ష్యం​—సువార్తను ప్రకటించడానికి ప్రాముఖ్యమైన పద్ధతి. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 101-102 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. అనియత సాక్ష్యమిచ్చేందుకు కొన్ని ఆచరణాత్మక పద్ధతులను సూచించండి. అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు తమకు ఎదురైన ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.

20 నిమి: “‘బహుగా ఫలిస్తూ ఉండండి.’”c 4వ పేరాను చర్చిస్తున్నప్పుడు, కావలికోట ఫిబ్రవరి 1, 2003 21వ పేజీలోని “‘ఓపికతో ఫలించడం’ ఎలా?” అనే బాక్సులోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి