దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2007 జూన్ 25వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 మే 7 నుండి జూన్ 25 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మాట్లాడుతున్నప్పుడు మన స్వర నాణ్యతను మెరుగుపర్చుకునేలా ఒత్తిడి తగ్గించుకోవడానికి మనమేమి చేయవచ్చు? [be 185వ పేజీ, 1-3 పేరాలు]
2. మన పరిచర్యలో మనమెలా ‘అందరికి అన్నివిధముల వారమై’ ఉండగలము? (1 కొరిం. 9:20-23) [be 186వ పేజీ, 2-4 పేరాలు]
3. ఇతరులు చెప్పేది వినే విషయంలో యెహోవా ఉంచిన మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? (ఆది. 18:23-33; 1 రాజు. 22:19-22) [be 187వ పేజీ, 1-2, 5 పేరాలు]
4. ఇతరులు ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు ఏ ఆచరణాత్మక మార్గాల్లో మనం సహాయం చేయవచ్చు? [be 187వ పేజీ 6వ పేరా–188వ పేజీ 3వ పేరా]
5. ఇతరులను గౌరవించే విషయంలో మనమెందుకు శ్రద్ధ వహించాలి? [be 190వ పేజీ, 3వ పేరా, బాక్సు]
ఒకటవ నియామకం
6. మనం బోధిస్తున్నవారి హృదయాన్ని చేరుకోవడానికి ఎందుకు కృషి చేయాలి? [be 59వ పేజీ, 1వ పేరా]
7. మనం బోధిస్తున్నవారిపై మన మాదిరి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? [be 61వ పేజీ, 1వ పేరా]
8. మన సంభాషణా సామర్థ్యాలను ఇంట్లోనే ఎలా మెరుగుపర్చుకోవచ్చు? [be 62వ పేజీ, 3వ పేరా]
9. ప్రవక్తయైన యిర్మీయా ధైర్యవంతమైన ఆసక్తి కనబర్చడంలో ఎలాంటి మాదిరి ఉంచాడు? [bsi07 3-4 పేజీలు, 36వ పేరా]
10. విలాపవాక్యములు ఏ నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది, అయినా దుష్టులపై దేవుని తీర్పుల తీవ్రతను చూపించడంలో అదెందుకు ప్రయోజనకరంగా ఉంది? [bsi07 5వ పేజీ, 13వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. యిర్మీయా 37:21 లో వర్ణించబడిన యిర్మీయా అనుభవాన్నిబట్టి మనకెలాంటి హామీ ఉంది?
12. ‘నేను అలసిపోయేలా’ “యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు” అని బారూకు అనడానికిగల కారణం ఏమి కావచ్చు, ఆయనకు ఎదురైన సమస్యకు ఆయన ముందుగా ఎలా ప్రతిస్పందించాడు? (యిర్మీ. 45:1-5)
13. బబులోను ఎప్పుడు నిర్జనమై, పూర్తిగా ‘పాడైపోయింది’? (యిర్మీ. 50:13)
14. విలాపవాక్యములు 3:8, 9, 42-45 లో ప్రార్థన గురించిన ఏ సూత్రం స్పష్టం చేయబడింది?
15. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో వర్ణించబడిన రథం దేనికి సాదృశ్యంగా ఉంది?