ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చిలో: బోధిస్తోంది పుస్తకాన్ని అందించి, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. ఈ పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి. ఏప్రిల్, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్: సృష్టికర్త పుస్తకాన్ని లేదా కుటుంబ సంతోషం పుస్తకాన్ని ప్రతిపాదించండి.
◼ కావలికోట, తేజరిల్లు! పత్రికల తాజా సంచికలు సంఘాలకు అందిన వెంటనే వాటిని ప్రచారకులకు ఇవ్వాలి. దానివల్ల, క్షేత్రసేవలో అందించడానికి ముందే, ప్రచారకులు వాటిలో ఉన్న విషయాలతో సుపరిచితులయ్యే అవకాశం ఉంటుంది.
◼ విదేశాలకు తరలివెళ్ళిన ప్రతీ ప్రచారకుని గురించి సంఘ సేవా కమిటీ వెంటనే బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి. ప్రచారకుడు వెళ్ళే క్రొత్త ప్రదేశంలో ఆయనను సంప్రదించేందుకు పూర్తి సమాచారాన్ని, వీలైతే ఆయన సహవసించబోయే సంఘం పేరును పంపించాలి. బ్రాంచి కార్యాలయానికి ఆ సమాచారంతో పాటు పబ్లిషర్ కార్డు(లు), పరిచయ లేఖ పంపించాలి, అలాచేస్తే ఆ ప్రచారకుడు వెళ్ళే క్షేత్రాన్ని పర్యవేక్షిస్తున్న బ్రాంచికి ఆ సమాచారాన్ని పంపించడం వీలౌతుంది. ప్రచారకుడు సహవసించబోయే క్రొత్త సంఘం అడిగే వరకు వేచివుండే బదులు వారు వెళ్ళిన వెంటనే దాన్ని పంపించాలి. (మార్చి 1991 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నాభాగంను చూడండి.) పరిచయ లేఖల సమాచారం కోసం జూలై 1, 2006వ తేదీతో పెద్దల సభలన్నింటికి వ్రాయబడిన ఉత్తరం చూడండి.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు త్వరగా సంఘ అకౌంట్స్ ఆడిట్ చేయాలి. ఆడిటింగ్ పూర్తైన తర్వాత, సంఘంలో తర్వాతి అకౌంట్స్ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.—ఇన్‌స్ట్రక్షన్ ఫర్ కాంగ్రిగేషన్ అకౌంటింగ్ (S-27).
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి—పదకూర్పు మాత్రమే—మలయాళం
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?—తమిళం, మలయాళం, హిందీ
అప్రమత్తంగా ఉండండి!—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము—ఉర్దూ
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు—ఉర్దూ
బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి! (కరపత్రం నం. 27)—ఉర్దూ