కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • జనవరి 8తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 15తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 22తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 29తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 1/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 8తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి 22తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటంలో నిర్వహించబడే చర్చకు సిద్ధపడడంలో భాగంగా రక్త రహిత చికిత్స​—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి. జనవరి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించండి. ఒక ప్రదర్శనలో, ‘పనితొందరలో ఉన్నాను’ అని సంభాషణను ఆటంకపరిచే వారితో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే పుస్తకంలో 11-12 పేజీలు చూడండి.

15 నిమి: ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం ద్వారా ప్రయోజనం పొందండి. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం​—2007, ముందుమాట ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ప్రతీరోజు దినవచనాన్ని, వ్యాఖ్యానాలను పరిశీలించేందుకు అందరూ కొంత సమయం వెచ్చించడంలోని అవసరాన్ని గురించి చర్చించండి. దినవచనాన్ని పరిశీలించడానికి వారు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారు అనే విషయాలపై వ్యాఖ్యానించడానికి ఒకరు లేక ఇద్దరిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి. 2007వ సంవత్సరపు వార్షిక వచనాన్ని క్లుప్తంగా చర్చించి ముగించండి.

20 నిమి: అందరికీ సువార్తను అందజేయండి. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలో, 92-102వ పేజీలోని మొదటి ఉపశీర్షిక వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

జనవరి 15తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: మిమ్మల్ని ఏదైనా ఆపుతోందా? కావలికోట ఏప్రిల్‌ 1, 2002 13-15 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “నాకు ఇష్టం లేదు.”a 4వ పేరాను చర్చిస్తున్నప్పుడు, స్థానిక క్షేత్రంలోని ప్రజలకు ఏ విషయాలపై ఆసక్తివుందో ప్రేక్షకులను అడగండి. “నాకు ఇష్టం లేదు” అని సంభాషణను ఆటంకపరిచే వారినెలా అధిగమించాలో చూపించే రెండు క్లుప్త ప్రదర్శనలను చేర్చండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలో 8, 9 పేజీలు చూడండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

జనవరి 22తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. ఫిబ్రవరి 1 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించండి. ఒక ప్రతిపాదనలో పత్రికా మార్గంద్వారా మీరు కలుస్తున్న వ్యక్తిని పునర్దర్శించడాన్ని ప్రదర్శించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

25 నిమి: “ఏది అత్యుత్తమ వైద్యచికిత్స?” ఒక పెద్ద నిర్వహించాలి. ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ రక్త రహిత చికిత్స అనే వీడియో గురించి ప్రేక్షకులతో చర్చ ప్రారంభించండి. ఉదాహరించబడిన కావలికోట ఆర్టికల్‌లను జాగ్రత్తగా సమీక్షించమని అందరినీ ప్రోత్సహిస్తూ, ఆఖరి పేరాను చదివి ముగించండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

జనవరి 29తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. ఫిబ్రవరిలో అందించే సాహిత్యాల గురించి చెప్పి, ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.

20 నిమి: “ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?” b ఒక పెద్ద నిర్వహించాలి. 2005 నవంబరు మన రాజ్య పరిచర్య, 3వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

15 నిమి: తిరిగి వస్తానని మాటిస్తే, ఖచ్చితంగా వెళ్ళండి. కావలికోట సెప్టెంబరు 15, 1999, 11వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తిరిగి వస్తానని వాగ్దానం చేసినట్టుగా మళ్లీ వెళ్ళడంద్వారా వారెలా ఆశీర్వదించబడ్డారో చూపించే అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: నేను యెహోవాసాక్షిని! ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తమ తోటివారు ఎగతాళి చేస్తారనుకొని కొంతమంది యౌవనులు తాము యెహోవాసాక్షులమని చెప్పుకోవడానికి వెనకాడతారు. అయితే, మీరెవరనే విషయాన్ని తెలియజేయడానికి మంచి కారణాలున్నాయి. మీ నమ్మకాలు తెలిసిన టీచర్లు వాటిని గౌరవించి, అనుచితమైన కార్యకలాపాల్లో పాల్గొనమని మిమ్మల్ని బలవంతం చేయరు. నైతిక విలువలు కొరవడిన యౌవనస్థులు తప్పు చేయడంలో తమతో భాగంవహించమని మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి వెనకాడతారు. డేటింగ్‌ విషయంలో, స్కూల్లో నిర్వహించే క్రీడల్లో లేదా మరితర కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో మీరు తీసుకొనే నిర్ణయాలను ఇతరులు వెంటనే అర్థం చేసుకుంటారు. స్కూల్లో సాక్ష్యమివ్వడానికి లేదా క్షేత్రంలో ప్రకటిస్తుండగా మీ తోటి విద్యార్థిని కలవడానికి మీరు ధైర్యంగా ఉంటారు. (Km 1/06 8వ పేజీ) స్కూల్లో తాము యెహోవాసాక్షులని తెలియజేయడంద్వారా వారెలాంటి ప్రయోజనాలను పొందారో వ్యాఖ్యానించమని ప్రచారకులను అడగండి. ఒకటి రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు.

20 నిమి: “ఫలవంతమైన పరిచర్యకు కీలకం​—ప్రేమ.”c కావలికోట ఫిబ్రవరి 1, 2003 23వ పేజీ, 16-17 పేరాలలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 17 (187), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి