కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/06 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 12/06 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. లేకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా, సంఘంలో స్టాకు ఉన్నట్లయితే, ఇక్కడివ్వబడిన పుస్తకాలలో ఏవైనా ప్రతిపాదించండి: నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు. జనవరిలో: 1991కు ముందు ప్రచురించబడిన 192 పేజీలుగల ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. ఒకవేళ సంఘాల్లో ఇలాంటి పాత పుస్తకాలేవీ స్టాకులో లేకపోతే, జ్ఞానము పుస్తకాన్ని గానీ లేదా అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను గానీ ఉపయోగించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని అందించండి. ఈ పుస్తకం స్టాకులో లేకపోతే ప్రకటన ముగింపు పుస్తకాన్ని లేక అధికంగా నిల్వవున్న మరో పాత ప్రచురణను ఉపయోగించవచ్చు. మార్చి: బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందించి, బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి గట్టి కృషి చేయండి. బైబిలు బోధిస్తోంది పుస్తకంతో పాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి.

◼ 2007వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాలు సంఘపు ప్రాథమిక భాషలో ప్రతీ సంఘానికి త్వరలో పంపించబడతాయి. మీ క్షేత్రంలో వేరే భాషలు మాట్లాడేవారి కోసం వారి భాషలో ఆ ఆహ్వాన పత్రాలు మీకు కావాలంటే వాటికోసం వీలైనంత త్వరగా లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14) ద్వారా రిక్వెస్టు చేయాలి. మీ క్షేత్రంలో అవసరమయ్యే భాషల్లో మాత్రమే ఆహ్వానపత్రాలను రిక్వెస్టు చేయండి. అవి అస్సామీ, ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

◼ 2008వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ శనివారం, మార్చి 22, సూర్యాస్తమయం తర్వాత అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లయితే, సహోదరులు అందుబాటులో ఉన్న ఇతర హాళ్ళను బుక్‌ చేసుకోవడానికి లేదా కాంట్రాక్టులు తీసుకోవడానికి వీలుగా ఈ తేదీ ముందుగా తెలియజేయబడుతోంది. జ్ఞాపకార్థ ఆచరణ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాలవల్ల భంగంవాటిల్లకుండా ఉండేందుకు పెద్దలు హాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి. జ్ఞాపకార్థ ఆచరణకున్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఆ సందర్భంలో ప్రసంగం ఇవ్వడానికి పెద్దలసభ ప్రతీ సంవత్సరం ఒకే సహోదరుణ్ణి ఎంపిక చేసుకునే బదులు లేదా తామే వంతులవారీగా ఇస్తూ ఉండే బదులు యోగ్యులైన పెద్దలలో ఒకరిని ఎంపికచేసుకోవాలి. ప్రసంగమిచ్చేందుకు అర్హతగల అభిషిక్తుడైన పెద్ద ఉన్నట్లయితే ఆయననే ఎంపిక చేసుకోవాలి.

◼ డిసెంబరు మన రాజ్య పరిచర్య 7-10 వరకున్న మధ్యపేజీల్లో ఇవ్వబడిన అనేక సవరణలను ప్రతీ ఒక్కరు తమ వ్యక్తిగత ప్రకటన ముగింపు పుస్తకంలో వ్రాసుకోవాలి. 2007, జనవరి 8తో ప్రారంభమయ్యే వారం నుండి మొదలయ్యే సంఘపుస్తక అధ్యయనానికి సిద్ధపాటుగా అలా చేసుకోవాలి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవా దినాన్ని మనసులో ఉంచుకుని జీవించండి​—ఆంగ్లం

ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము​—నలుపు, మెరూన్‌ రంగుల్లో, సాఫ్ట్‌ కవర్‌తో పాకెట్‌ సైజులో లభ్యమవుతోంది. సాఫ్ట్‌ కవర్‌తో పాకెట్‌ సైజులో ఉన్న ఈ బైబిలు ప్రజలు, ప్రచారకులు వాడుకునేందుకు అందుబాటులో ఉంది. ఎక్కువ సమాచారం కోసం ఆగస్టు 1, 2005 తేదీగల మా ఉత్తరాన్ని దయచేసి చూడండి.

వాచ్‌టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ 2001-2005—ఆంగ్లం

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?​—ఫ్రెంచ్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి