దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 డిసెంబరు 25వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 నవంబరు 6 నుండి డిసెంబరు 25 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. లేఖనానికి తగిన ఉపోద్ఘాతంగా ఏమి చెప్పాలో నిర్ణయించుకుంటున్నప్పుడు మనం ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? [be 148వ పేజీ, 4వ పేరా-149వ పేజీ, 2వ పేరా]
2. మనం మాట్లాడే మాటలను, పదబంధాలను సరైన విధంగా నొక్కిచెప్పేందుకు మనం ఎలాంటి కొన్ని పద్ధతులను ఉపయోగించవచ్చు? [be 151వ పేజీ, 4పేరా-152వ పేజీ 3వ పేరా]
3. దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడం గంభీరమైన విషయం కాబట్టి, మనం ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగా’ ఉండేందుకు ఏమి చేయాలి? (2 తిమో. 2:15) [be 153వ పేజీ, 1-3 పేరాలు, బాక్సు; 154వ పేజీ, 1-2 పేరాలు]
4. మనం చదివే లేఖనాలను ఏయే విధాలుగా స్పష్టంగా అన్వయించవచ్చు? [be 154వ పేజీ, 4వ పేరా-155వ పేజీ, 3వ పేరా]
5. మనం చెబుతున్న విషయాలకున్న ఆచరణాత్మక విలువను స్పష్టం చేయడం ఎందుకు చాలా ప్రాముఖ్యం, దానిని సాధించేందుకు ఉన్న కొన్ని మార్గాలేమిటి? [be 157వ పేజీ, 1-4 పేరాలు, బాక్సు; 158వ పేజీ, 1వ పేరా]
ఒకటవ నియామకం
6. సొలొమోను ఏ విధంగా ఒక సమావేశకునిగా ఉన్నాడు? [bsi06 25వ పేజీ, 1-3 పేరాలు]
7. ప్రసంగి పుస్తకం యేసు బోధలతో ఎలా పొందిక కలిగివుంది? [bsi06 26వ పేజీ, 16వ పేరా]
8. పరమగీతము ప్రామాణికమైనదని చెప్పడానికి ఎలాంటి రుజువులున్నాయి? [bsi06 28వ పేజీ, 3-4 పేరాలు]
9. యెషయా ప్రవచనానికి సంబంధించిన మృత సముద్రపు గ్రంథపు చుట్టలు నేడు మనం ఉపయోగిస్తున్న బైబిల్లో అసలైన ప్రేరేపిత సందేశమే ఉందనేందుకు ఎలా ఒక గట్టి రుజువును ఇస్తుంది? [bsi06 30వ పేజీ, 6వ పేరా]
10. విస్తృతంగా నోట్సు సిద్ధపడే అవసరం లేకుండా ఉండేందుకు ఒక ప్రసంగీకునికి ఏమి సహాయం చేయగలదు? [be 42వ పేజీ, 1వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. “యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును” ఎలా “గ్రహించగలరు”? (సామె. 28:5)
12. “బుద్ధిహీనులు తమ ప్రయాసచేత” ఎలా ‘ఆయాసపడతారు’? (ప్రసం. 10:15)
13. కన్యకయైన షూలమ్మీతీ తాను “మూయబడిన ఉద్యానము” అని ఎలా నిరూపించుకుంది, అవివాహిత క్రైస్తవ స్త్రీలకు ఆమె ఎలా చక్కని ఉదాహరణగా ఉంది? (పరమ. 4:12)
14. “వివాదము తీర్చుకొందము” అని ఇశ్రాయేలీయులను ఆహ్వానించడం ద్వారా యెహోవా తన ప్రజలతో న్యాయంగా రాజీ కుదుర్చుకునేందుకు ఇష్టపడుతున్నానని సూచిస్తున్నాడా? (యెష. 1:18ఎ)
15. ప్రాచీనకాలంలో యెషయా 11:6-9 ఎలా నెరవేరింది, అది మరింత గొప్పగా ఎలా నెరవేరుతుంది?