కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 11తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 18తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 25తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 9/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

సెప్టెంబరు 11తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి:స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకోబడిన ప్రకటనలు. సెప్టెంబరు 25తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటానికి సిద్ధపడేందుకు యువత ఇలా అడుగుతోంది​—⁠నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియోను చూడమని అందరిని ప్రోత్సహించండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, సెప్టెంబరు 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో “నాకు నా స్వంత మతముంది” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా మాట్లాడాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 10వ పేజీని చూడండి.

20 నిమి:సేవాకూటం నుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 64వ పేజీ ఉపశీర్షిక నుండి 69వ పేజీవరకు ఉన్న పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

15 నిమి:బ్రాంచి ఉత్తరం. ఈ సంచిక ముందుపేజీలో కనిపించే ఉత్తరం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

పాట 3 (32) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 18తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

5 నిమి:స్థానిక ప్రకటనలు.

15 నిమి:గత సంవత్సరంలో మనమెలా చేశాము? సేవా పైవిచారణకర్త, పరిచర్యలో సాధించిన ప్రోత్సాహకరమైన విషయాల మీద దృష్టి నిలుపుతూ గత సేవా సంవత్సరంలో చేసిన సేవను సమీక్షిస్తాడు. సముచితమైన విధంగా మెచ్చుకోండి. రాబోయే సంవత్సరంలో దృష్టి నిలపాల్సిన ఒకటి లేక రెండు రంగాలను వివరించండి. పయినీర్ల కార్యకలాపాల గురించి వ్యాఖ్యానించండి, వారు ఉత్సాహంగా చేస్తున్న పనిని మెచ్చుకోండి. నిష్క్రియులైనవారికి సహాయపడేందుకు చేసిన కృషివల్ల సాధించిన సత్ఫలితాల గురించి చెప్పండి.

25 నిమి:“అక్టోబరు 16​—⁠నవంబరు 12 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!” ఒక పెద్ద ఉత్సాహంగా జరిపే చర్చ. పెద్దల సభకు పంపించబడిన జూన్‌ 6, 2006 తేదీ ఉత్తరంలో ఇవ్వబడిన ప్రకటన చదివిన తర్వాత, హాజరైన వారందరికీ ఒక్కో రాజ్యవార్త నం. 37 ఇవ్వండి. తర్వాత శీర్షికను చర్చిస్తూ ప్రశ్నాజవాబుల చర్చను కొనసాగించండి. క్షేత్రాన్నంతా పూర్తి చేయడానికి సంబంధించిన స్థానిక ఏర్పాట్లను తెలియజేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రచారకులందరినీ ప్రోత్సహించండి. క్లుప్తమైన అందింపును ప్రదర్శించండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 25తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

10 నిమి:స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. సెప్టెంబరు నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఒక ప్రదర్శనలో అక్టోబరు 1 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను వీధి సాక్ష్యమిస్తున్నప్పుడు ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

25 నిమి:“గంభీరంగా ఆలోచింపజేసే వీడియో”a మొదటి పేరాను చర్చించేటప్పుడు, సంఘంలోనివారిని యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? అనే వీడియోకు సంబంధించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను క్లుప్తంగా తెలియజేయమనండి. ఆ తర్వాత 2-7 వరకున్న ప్రతీ పేరా ప్రశ్నను చర్చించండి. ముగింపులో, యువత ఇలా అడుగుతోంది​—నేను నా జీవితంలో ఏమి చేస్తాను? (ఆంగ్లం) అనే డీవీడీని కూడా త్వరలోనే కుటుంబాలను కలిసి చూడమని ప్రోత్సహించండి.

10 నిమి:స్థానిక అనుభవాలు. జరిల్లు! ప్రత్యేక సంచికను అందించినప్పుడు ఎదురైన అనుభవాలను చెప్పమనండి లేదా మొదటి సందర్శనంలోనే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు అధ్యయనాలు ప్రారంభిస్తుండగా ఎదురైన అనుభవాలు చెప్పమనండి. ప్రత్యేకంగావున్న ఒకటి, రెండు అనుభవాలను పునర్నటించవచ్చు.

పాట 27 (221), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 2తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10 నిమి:స్థానిక ప్రకటనలు. ప్రశ్నా భాగం సమీక్షించండి.

15 నిమి:స్థానిక అవసరాలు.

20 నిమి:“ఇంటింటా సాక్ష్యమివ్వడం”b సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమనండి.

పాట 15 (127), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి