కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 12తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 19తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 26తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 6/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూన్‌ 12తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (222)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, జూన్‌ 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రతిపాదనలో, అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు పత్రికలను అందిస్తున్నట్లు ప్రదర్శించండి.

20 నిమి: “మన పరిచర్య​—కనికరాన్ని ప్రతిబింబిస్తుంది.”a సమయముంటే ఉల్లేఖించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిపై’ నమ్మకముంచడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం మూడవ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

పాట 4 (43) ముగింపు ప్రార్థన.

జూన్‌ 19తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

20 నిమి: సమయోచితమైన మాట యెంత మనోహరము! కావలికోట జనవరి 1, 2006 16-19 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఉపోద్ఘాత ప్రసంగంలో, “సానుకూల ప్రభావాలు” అనే ఉపశీర్షిక క్రింద చర్చించబడిన ఇతరులను ప్రశంసించడంవల్ల వచ్చే నాలుగు రకాల ప్రయోజనాలను నొక్కిచెప్పండి. ఈ క్రింది ప్రశ్నలను వ్యాఖ్యానించడానికి ప్రేక్షకులను ఆహ్వానించండి: మన ప్రశంసను పొందడానికి ఎవరు అత్యంత అర్హులు? మన తోటి ఆరాధకులు ఎందుకు సముచితమైన ప్రశంసకు అర్హులు? సంఘంలో ప్రశంసించేందుకు మనకెలాంటి అవకాశాలున్నాయి? కుటుంబ సభ్యులను ప్రశంసించడం ఎందుకు ప్రయోజనకరం, దాన్ని మనమెలా చేయవచ్చు? మీరు అందుకున్న ప్రశంసనుబట్టి మీరెలా ప్రోత్సహించబడ్డారు లేదా బలపరచబడ్డారు?

15 నిమి: “ప్రశంసించడం ద్వారా వ్యక్తిగత ఆసక్తిని చూపించండి.” b ప్రచారకుడు, గృహస్థుడు చెప్పేది జాగ్రత్తగా విని, యథార్థంగా ప్రశంసించి, ఆయన చెప్పినదాన్నిబట్టి సముచితమైన లేఖనాన్ని చదివి సంభాషణను కొనసాగించే క్లుప్త ప్రదర్శనను చేర్చండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

జూన్‌ 26తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ జూలై 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ప్రతీ ప్రదర్శన ముగింపులో, పునర్దర్శనంలో బైబిలు బోధిస్తోంది పుస్తకం ఉపయోగించి సమాధానమిచ్చేలా ఆలోచన రేకెత్తించే ప్రశ్నను ప్రచారకుడు అడుగుతాడు.

18 నిమి: తోటి విశ్వాసులతో స్నేహాలు వృద్ధిచేసుకోవడం. (సామె. 18:24; 27:9) కావలికోట డిసెంబరు 1, 2000 22-3 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సత్యారాధనవల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి, నిజమైన స్నేహితులను సంపాదించుకొనే అవకాశం. కూటాల్లో, క్షేత్రసేవలో, మరితర సందర్భాల్లో మనం సహవసించడం మనకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. సంఘంలోని ఇతరులతో మనమెలా స్నేహాన్ని వృద్ధిచేసుకోవచ్చు? “నిరంతరం నిలిచే స్నేహానికి ఆరు మెట్లు” అనే బాక్సును సమీక్షించండి, సహోదరులతో మనం వ్యవహరించేటప్పుడు ప్రతీ అంశాన్ని ఎలా అన్వయించవచ్చో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: జూలై నెలలో సువార్తను ప్రకటించడం. మీ క్షేత్రంలో సాధారణంగా ప్రజల ఆసక్తిని చూరగొనే విషయాలు ఏవి? బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని సమర్థవంతంగా ఉపయోగించి బహుశా బైబిలు అధ్యయనం ప్రారంభించిన ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఆ తర్వాత మీ క్షేత్రంలో మంచి ఫలితాలు సాధించిన ప్రతిపాదనను ఉపయోగిస్తూ దానిని ఇంటింటి పరిచర్యలో అందిస్తున్నట్లు ప్రదర్శించండి.​—⁠జనవరి 2005 మన రాజ్య పరిచర్యలోని, 8వ పేజీ 5వ పేరా చూడండి.

పాట 17 (187), ముగింపు ప్రార్థన.

జూలై 3తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రచారకులు ఇప్పటికీ జూన్‌ నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వనట్లయితే వాటిని వెంటనే ఇవ్వమని వారికి గుర్తు చేయండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎలా చేరుకోవాలి.” c తమ ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి, వాటిని చేరుకోవడానికి తాము చేస్తున్న కృషి గురించి వ్యాఖ్యానించమని సంఘంలోని యౌవనులను ఆహ్వానించండి. ఒకటి లేదా రెండు వ్యాఖ్యానాలు చేసేందుకు ముందుగానే ఏర్పాటు చేయవచ్చు.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి