దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
పునఃసమీక్ష దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 జూన్ 26వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 మే 1 నుండి జూన్ 26 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. స్వరభేదం అంటే ఏమిటి, అది ఎందుకు ప్రాముఖ్యం? [be 111వ పేజీ, బాక్సులు]
2. ప్రసంగించేటప్పుడు మనం మాటల వేగాన్ని ఎలా మార్చుకోవచ్చు? [be 112వ పేజీ, 3-6 పేరాలు, బాక్సు]
3. మనం చెబుతున్న విషయంపట్ల ఉత్సాహాన్ని ఎలా వృద్ధిచేసుకోవచ్చు, ఇది ఎందుకు ప్రాముఖ్యం? [be 115వ పేజీ, 1వ పేరా-116వ పేజీ, 2వ పేరా, బాక్సులు]
4. మనం ఇతరులకు బోధించేటప్పుడు, ఆప్యాయత ఎందుకు ఆవశ్యకం, దాన్ని వ్యక్తం చేయడానికి మనకేమి సహాయం చేయగలదు? [be 118వ పేజీ, 3వ పేరా-119వ పేజీ, 5వ పేరా]
5. సంభాషించడంలో సంజ్ఞలకు, ముఖ కవళికలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించండి. (మత్త. 12:48, 49) [be 121వ పేజీ, బాక్సులు]
ఒకటవ నియామకం
6. యోబు గ్రంథం ఎలా యెహోవాను ఉన్నతపరుస్తూ, ఆయన నీతియుక్తమైన జీవన ప్రమాణాలను మహిమపరుస్తోంది? [bsi06 13వ పేజీ]
7. కీర్తనల ప్రామాణికతను ఏది నిరూపిస్తుంది? [bsi06 16, 17 పేజీలు]
8. సామెతలు 13:16 లో ప్రస్తావించబడిన ‘వివేకం’ ఏమిటి? [w04 7/15 28వ పేజీ, 3-4 పేరాలు]
9. పరిశుద్ధాత్మ ఒక సహాయకంగా ఎలా ఉండగలదు, అది తెలుసుకోవడం మనమేమి చేయడానికి ప్రోత్సహించాలి? (యోహా. 14:25, 26) [be 19వ పేజీ, 2-3 పేరాలు]
10. యేసు ఏ సాధారణ భావంలో వస్తాడు, మత్తయి 16:28 లో యేసు ఏ “వచ్చుట” గురించి ప్రస్తావిస్తున్నాడు? [w04 3/1 16, బాక్సు]
వారపు బైబిలు పఠనం
11. యోబు 42:1-6 వచనాల్లో, యోబు యెహోవాకు ఇచ్చిన జవాబు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12. జనములు ఏ “వ్యర్థమైన” దాని గురించి తలంచుచున్నవి? (కీర్త. 2:1, 2)
13. ఏ పునాదులు పాడైపోయాయి? (కీర్త. 11:3)
14. గర్వంతో ప్రవర్తించేవారికి “గొప్ప ప్రతికారము” ఎలా లభిస్తుంది? (కీర్త. 31:23)
15. తుచ్ఛమైన శరీర అపరిపూర్ణతను, ఈ విధానపు వివిధ కష్టాలను సహించడానికి మనకు సహాయం చేసే ఎలాంటి ఓదార్పును మనం 40వ కీర్తన నుండి పొందవచ్చు? (కీర్త. 40:1, 2, 5, 12)