పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటమే 15
“ఈ ప్రేరేపిత లేఖనంలో వర్ణించబడిన పరిస్థితుల్లో జీవించడాన్ని మీరు ఆస్వాదిస్తారని అనుకుంటున్నారా? [2 పేతురు 3:13 చదవండి. తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి అంటే ఏమిటో వివరిస్తుంది. దేవుడు భూమిపట్ల తనకున్న సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో కూడా ఇది వివరిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“ఇంకా 20, 30 సంవత్సరాల్లో లోకం ఎలా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత కీర్తన 119:105 చదవండి.] బైబిలు ముందున్న మార్గంపై వెలుగును ప్రకాశింపజేస్తుంది కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించగలం. ఈ పత్రిక, కాల ప్రవాహంలో మనమెక్కడున్నామని చూపించే ప్రవచనాలను చర్చిస్తుంది, ఇంకా మనమెందుకు ఉజ్వలమైన భవిష్యత్తు గురించి ఎదురుచూడవచ్చనే విషయాన్ని చర్చిస్తుంది.”
కావలికోటజూన్ 1
“ఈ ప్రాచీన నియమంలో చూస్తున్నట్లుగా, ఒకప్పుడు చాలా సంస్కృతుల్లో, వృద్ధులు గౌరవించబడేవారు. [లేవీయకాండము 19:32 చదవండి.] అలా నేడు కూడా గౌరవించబడుతున్నారని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక దేవుడు వృద్ధులపట్ల ఎలా శ్రద్ధ చూపిస్తున్నాడో, మనం కూడా ఎలా శ్రద్ధ చూపించవచ్చో వివరిస్తోంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“దిగజారుతున్న ప్రపంచ పరిస్థితులు మానవజాతి భవిష్యత్తు గురించి ఏమి సూచిస్తున్నాయి? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 2 తిమోతి 3:1-5 చదవండి.] మానవజాతి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ పత్రిక చర్చిస్తుంది.” ఆ పత్రికలోని 9వ పేజీకి త్రిప్పి “ముందున్న మార్గం” అనే ఉపశీర్షిక క్రిందున్న సమాచారాన్ని చూపించండి.