అన్ని వయసులవారూ అనుకరించదగ్గ మాదిరి
నోవహు దేవునితో ప్రేమపూర్వక, సన్నిహిత సంబంధాన్ని ఆస్వాదించాడు. యెహోవా చిత్తం చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఆయన ‘సత్యదేవునితో నడిచాడు,’ అలా నడవడంవల్ల ఆశీర్వదించబడ్డాడు. నోవహు అటు యౌవనులు, ఇటు వృద్ధులు అనుకరించదగ్గ మాదిరిగా ఉన్నాడు. (ఆది. 6:9, NW) నోవహు జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికి, యెహోవా ఆశీర్వాదానికి ఆయన ఎందుకర్హుడో, ఆయనలోని మంచి లక్షణాలను మీరు ఎలా అనుకరించవచ్చో తెలుసుకోవడానికి నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు (ఆంగ్లం) అనే వీడియో మీకు సహాయం చేస్తుంది.
నోవహు డీవీడీలో “వీడియో క్విజ్” అనే భాగంలో ఈ క్రింది ప్రశ్నలున్నాయి. వీడియోను చూసిన తర్వాత మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: (1) కొందరు దేవదూతలు ఏ తప్పు చేశారు, నెఫీలులు ఎవరు? (ఆది. 6:1, 2, 4) (2) ప్రజలు ఎందుకంత దుష్టులుగా మారారు, దానిని దేవుడెలా దృష్టించాడు? (ఆది. 6:4-6) (3) నోవహు ఇతరులకు ఎలా భిన్నంగా ఉన్నాడు? (ఆది. 6:22) (4) దుష్టులు ఎలా నాశనమయ్యారు? (ఆది. 6:17) (5) ఓడ ఎంత పెద్దగా ఉంది? (ఆది. 6:15) (6) నోవహు ఇంకా ఏమి చేశాడు, దానికి ప్రజలెలా ప్రతిస్పందించారు? (మత్త. 24:38, 39; 2 పేతు. 2:5) (7) జంతువుల్లోని ప్రతీజాతిలో ఎన్నేసి ఓడలో ఉన్నాయి? (ఆది. 7:2, 3, 8, 9; w54 2/15 127వ పేజీ, పాఠకుల ప్రశ్నలు) (8) ఎంతకాలం వర్షం కురిసింది, భూమి ఎంతకాలం నీటితో నిండివుంది? (ఆది. 7:11, 12; 8:3, 4) (9) నోవహు ఆయన కుటుంబం ఎందుకు రక్షించబడ్డారు? (ఆది. 6:18, 22; 7:5) (10) ఓడ ఎక్కడ నిలిచింది? (ఆది. 8:4) (11) ఓడ బయటికి రావడం క్షేమమేనని నోవహుకు ఎలా తెలిసింది? (ఆది. 8:6-12) (12) ఓడ బయటికి వచ్చిన తర్వాత నోవహు ఏమి చేశాడు? (ఆది. 8:20-22) (13) వర్షధనస్సు దేన్ని సూచిస్తుంది? (ఆది. 9:8-16) (14) “దేవునితోకూడ” నడవడం అంటే ఏమిటి? (ఆది. 6:9, 22; 7:5) (15) పరదైసులో నోవహును చూడాలంటే మనమేం చేయాలి? (మత్త. 28:19, 20; 1 పేతు. 2:21)
మీరు కూడా ఎలా ‘దేవునితో నడవచ్చు,’ ఆధునిక కాలంలోని తన ప్రజలను రక్షించే యెహోవా సామర్థ్యంపై నమ్మకం ఎలా కలిగివుండవచ్చు అనే వాటి గురించి బైబిల్లో తెలియజేయబడిన విశ్వసనీయుడు, విధేయుడు అయిన నోవహు వృత్తాంతం మీకేమి బోధిస్తోంది?—ఆది. 7:1; సామె. 10:16; హెబ్రీ. 11:7; 2 పేతు. 2:9.