కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/06 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 5/06 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మేలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే క్రొత్త పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టి నిలపండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్‌లో: గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. ఈ ప్రచురణ గృహస్థుని భాషలో అందుబాటులో లేకపోతే, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము అందించండి. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అప్రమత్తంగా ఉండండి! కొన్ని ప్రాంతాల్లో ఈ క్రింద సూచించబడిన బ్రోషుర్లు అందించడం సముచితంగా ఉండవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), సంతృప్తికరమైన జీవితం​—దాన్నెలా సాధించవచ్చు?

◼ జూలై నెలలో ఐదు పూర్తి వారాంతాలున్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది ఎంతో అనువైన నెల.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు జూన్‌ 1వ తేదీన లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్సు ఆడిట్‌ చేయాలి. నిర్వహణ లేక నిర్మాణం లాంటి వాటికి వేరే అకౌంట్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిట్‌ చేయడానికి ఏర్పాటు చేయాలి. ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాత, తర్వాతి అకౌంట్సు రిపోర్టుతోపాటు దాన్ని సంఘంలో చదవాలి.

◼ క్రమ పయినీరు సేవ కోసం దరఖాస్తులను, పయినీరు సేవ ప్రారంభించడానికి అనుమతి కోసం అడిగిన తేదీకి కనీసం 30 రోజులకన్నా ముందు బ్రాంచి కార్యాలయానికి పంపించాలని సిఫారసు చేయబడుతోంది. సంఘ కార్యదర్శి, ఆ ఫారాల్లో పూర్తి వివరాలు ఉన్నాయో లేదో చూడడానికి వాటిని సమీక్షించాలి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసుకున్న తేదీ జ్ఞాపకం లేకపోతే వారు ఆ తేదీని అంచనా వేసుకొని ఆ తర్వాత ఎల్లప్పుడూ ఆ తేదీని ఉపయోగించాలి. సంఘ కార్యదర్శి ఆ తేదీని కాంగ్రిగేషన్స్‌ పబ్లిషర్‌ రికార్డ్‌ కార్డు (S-21) మీద వ్రాయాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి