“విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం గురించి తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం
ప్రతీ సంఘంలోని ప్రచారకులు ప్రత్యేక హ్యాండ్బిల్లు అందజేస్తారు
1 ఉత్తరార్థగోళంలో 2006, వసంతకాలంలో ప్రారంభమై ప్రపంచమంతటా కొనసాగే జిల్లా సమావేశాల పరంపర ముగిసేంతవరకు, దాదాపు 155 దేశాల్లో జరగబోయే జిల్లా సమావేశాల గురించి ప్రత్యేక హ్యాండ్బిల్లులను ఉపయోగించి తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతోంది. 2006 జూలైలోనూ, ఆగస్టు మొదటి వారంలోనూ జర్మనీ, ఛెక్ రిపబ్లిక్, పోలండ్లలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశాలకు సంబంధించి కూడా ఆ ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతోంది.
2 అంత్యదినాల చివరి భాగంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, ఈ దుష్ట విధానం నుండి విడుదల చేయబడడం గురించిన దేవుని వాగ్దానాన్ని నొక్కిచెప్పే ఈ సమావేశాలు సరైన మనోవైఖరిగల ప్రజల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో పరిశీలించేందుకు ఆ సందేశం వారిని ప్రోత్సహించాలి. ఓదార్పు నిరీక్షణలనిచ్చే సందేశాన్ని కోట్లాదిమంది వినే అవకాశం కల్పించడం కోసం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 98,000కన్నా ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలు తాము ఆహ్వానించబడిన ఆ సమావేశం గురించి ప్రకటించడంలో ఉత్సాహంతో పాల్గొనాలని ప్రోత్సహించబడుతున్నాయి.
3 సంఘం ఏ భాషా సమావేశానికైతే నియమించబడిందో ఆ భాషలో ప్రతీ ప్రచారకునికి సుమారు 15 హ్యాండ్బిల్లులు లభించేలా సంఘాలన్నింటికీ సరిపోయే మోతాదులో హ్యాండ్బిల్లులు పంపించబడతాయి. సమావేశం జరిగే నగరంలోని సంఘాల్లోవున్న ప్రతీ ప్రచారకునికి 30 హ్యాండ్బిల్లులు చొప్పున లభిస్తాయి. హ్యాండ్బిల్లులు ఎక్కువగా ఉంటే, సంఘంలోని పయినీర్లు వాటిని ఉపయోగించవచ్చు. ప్రతీ సంఘంలో, సంఘానికి నియమించబడిన సమావేశం ప్రారంభమయ్యే తేదీకి మూడు వారాల ముందు ప్రచార కార్యక్రమం మొదలవుతుంది. సంఘానికి సంబంధించిన క్షేత్రాన్ని పూర్తిగా కాకపోయినా, దానిలో ఎక్కువ భాగం పూర్తి చేయడానికి ఆ గడువు సరిపోతుంది.
4 సమావేశ స్థలం, తేదీలు వ్రాయడానికి లేదా ముద్రించడానికి వీలుగా హ్యాండ్బిల్లు వెనక ఖాళీగా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ గృహస్థుల చేతికే ఆ హ్యాండ్బిల్లు అందించాలని ప్రోత్సహించబడుతోంది. అయితే, ఇంట్లో లేనివారి ఇంటిగుమ్మం దగ్గర ఆ హ్యాండ్బిల్లును జాగ్రత్తగా పెట్టవచ్చు. సమావేశ నగరంలో నివసించని ప్రచారకులు, తాము పునర్దర్శనాలు చేస్తున్నవారిని, తమ బైబిలు విద్యార్థులను ఆహ్వానించడానికి హ్యాండ్బిల్లులను ఉపయోగించవచ్చు. అదనంగా వారు సమావేశానికి ప్రయాణిస్తున్నప్పుడు కూడా వాటిని ఉపయోగించవచ్చు. ఆ మూడు వారాల గడువులో హ్యాండ్బిల్లులన్నీ అందజేయబడేలా గట్టి కృషి చేయాలి.
5 ఈ శీర్షికలో సూచించబడినట్లుగా “విడుదల సమీపించింది!” జిల్లా సమావేశం గురించి ప్రకటించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగే తీవ్రకృషి ఫలితంగా గొప్ప సాక్ష్యమివ్వబడుతుందని మేము నమ్ముతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు చేసే వ్యక్తిగత ప్రయత్నాలను యెహోవా మెండుగా ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాం.