కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/06 పేజీలు 4-5
  • యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం
    మన రాజ్య పరిచర్య—2008
  • గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా క్రీస్తును అనుసరించండి
    మన రాజ్య పరిచర్య—2007
  • మహా సమాజంలో యెహోవాను స్తుతించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 4/06 పేజీలు 4-5

యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి

1. సమావేశపు అంశం ఏమిటి, అది ఎందుకు సమయోచితమైనది?

1 “యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు” అని యెషయా వ్రాశాడు. (యెష. 30:18) దేవుడు తన శత్రువులపై తీర్పు అమలుజరపడాన్ని గురించిన, నమ్మకస్థులైన తన సేవకులను రక్షించడాన్ని గురించిన బైబిలు వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. నేడు యెహోవా ఆరాధకులకు ఆ వృత్తాంతాలు ఏ పాఠాలు నేర్పిస్తున్నాయి? “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” కోసం సిద్ధపడడానికి మనం ఇప్పుడేమి చేయవచ్చు? (యోవే. 2:31, 32) త్వరలో జరుగనున్న “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం ఆ ప్రశ్నలను ధ్యానించి స్వయంపరిశీలన చేసుకోవడానికి మనల్ని కదిలిస్తుంది. మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేందుకు అది సహాయం చేస్తుంది.

2. జిల్లా సమావేశంపట్ల మనం మన కృతజ్ఞతను ఎలా కనపరచవచ్చు?

2 సమావేశపు మూడు రోజులనుండీ ప్రయోజనం పొందేందుకు మీరు ఏర్పాట్లు చేసుకున్నారా? ఉదాహరణకు, సమావేశానికి హాజరవడానికి సెలవుకోసం మీ యజమానిని సంప్రదించారా? ఎటువంటి ప్రయత్నమూ లేకుండా మీకది లభిస్తుందని అనుకోకండి. దాని గురించి ప్రార్థించండి. ఆ తర్వాత, మీ అభ్యర్థనను యజమానికి తెలియజేయండి. (నెహె. 2:4, 5) అదేవిధంగా, ప్రయాణం, వసతి, అవసరమైన మరితర విషయాల్లో ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యం చేయకండి. అలా చక్కగా పథకాలు వేసుకోవడం యెహోవా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక పోషణా కార్యక్రమంపట్ల మనకున్న ప్రగాఢ కృతజ్ఞతను ప్రతిబింబిస్తుంది. సమావేశ ఏర్పాట్లలో సహాయం అవసరమయ్యేవారికి, ప్రత్యేకంగా సంఘంలోని వృద్ధులకు సహాయం చేయడానికి పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.—గల. 6:10.

3. సమావేశ నగరంలో ఉన్నప్పుడు యెహోవా ప్రజలు ఎటువంటి లక్షణాలను కనపరచాలి?

3 మంచి ప్రవర్తన దేవుణ్ణి ఘనపరుస్తుంది: మనం సమావేశాల్లో పెద్ద సమూహాలుగా సమకూడినప్పుడు, మన మంచి ప్రవర్తన సమాజంలోనివారికి సాక్ష్యంగా పనిచేస్తుంది. దానికి మనమేమి చేయాలి? మనం హోటళ్ళలో, రెస్టారెంట్లలో లేదా సమావేశ ప్రాంతంలో ఉన్న ఇతర వ్యాపారస్థలాల్లో ఉన్నప్పుడు మనతో వ్యవహరించేవారు మన క్రైస్తవ లక్షణాలైన దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, సహేతుకతలనుబట్టి ఉపశమనాన్ని పొందాలి. (గల. 5:22 ఫిలి. 4:5) ‘అమర్యాదగా నడవని, స్వప్రయోజనమును విచారించని, త్వరగా కోపపడని’ ప్రేమను మనలో ప్రతీ ఒక్కరమూ కనబరచాలి. ఒకవేళ కష్టాలు లేక ఇబ్బందులు ఎదురైనా సరే, మనం “సమస్తమును దేవుని మహిమకొరకు చేయాలని” కోరుకుంటాము.—1 కొరిం. 10:31; 13:5.

4. పిల్లలు యెహోవాకు ఘనత తీసుకువచ్చేలా నడుచుకోవడానికి తల్లిదండ్రులెలా సహాయం చేయవచ్చు?

4 ఒక సమావేశం తర్వాత, ఓ హోటల్‌ మేనేజరు మన యౌవనులు కనబడే తీరునుబట్టి, వారి ప్రవర్తననుబట్టి ఎంతగా ముగ్ధుడయ్యాడంటే, “ఎల్లప్పుడూ యెహోవాసాక్షులు మా హోటల్లో అతిథులుగా ఉండాలి” అని తన కోరికను వ్యక్తం చేశాడు. ఆనందించడానికి అదెంత మంచి కారణమో కదా! అదంతా తల్లిదండ్రులైన మీరు ఇచ్చిన తర్ఫీదూ, పర్యవేక్షణా ఫలితమే. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పర్యవేక్షణ లేకుండా హోటల్‌ రూములో ఉండడానికి అనుమతించడం జ్ఞానయుక్తం కాదు. పిల్లలు ఎల్లప్పుడూ సరైనవిధంగా పర్యవేక్షించబడాలి. (సామె. 29:15) వారి మంచి నడవడి యెహోవాకు ఘనత తెచ్చి, ఆయన హృదయాన్ని సంతోషపెట్టునుగాక!—సామె. 27:11.

5. మన దుస్తులశైలి, కనబడేతీరు ద్వారా యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు?

5 అణకువను కనపర్చే వస్త్రాలు, కనబడే తీరు: మనం ధరించే దుస్తులు, కనబడే తీరు అతి ఫ్యాషన్‌గా, విపరీతంగా, అమర్యాదకరంగా, క్రమరహితంగా ఉండకుండా జాగ్రత్త వహించడం ద్వారా సమావేశం విషయంలో ఇతరులకు మంచి అభిప్రాయం కలిగించడానికి మనలో ప్రతీ ఒక్కరమూ దోహదపడవచ్చు. మనం సమావేశ నగరానికి వెళ్తున్నప్పుడు, అక్కడినుండి వస్తున్నప్పుడు ప్రయాణాల్లో, సమావేశ స్థలాన్ని సిద్ధం చేయడంలో సహాయం చేస్తున్నప్పుడు, సమావేశ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు సహితం అది అన్వయిస్తుంది. దేవుని సేవకులముగా మనం మొదటిగా దేవుని నామం గురించి, దాని ఘనత గురించి ఆలోచించాలే గాని మన స్వంత ఇష్టాల గురించి లేక సౌకర్యాల గురించి ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులు కనబడే తీరు అన్ని సమయాల్లో నమ్రతను, స్వస్థబుద్ధిని ప్రతిబింబించే విధంగా ఉందో లేదో చూసే బాధ్యత కుటుంబ యజమానులది.—1 తిమో. 2:9.

6. మనం సమావేశ కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు హుందాగా కనిపించినట్లే తీరిక సమయంలో కూడా ఎందుకు హుందాగా కనిపించాలి?

6 అదేవిధంగా తీరిక సమయాల్లో హోటళ్ళలో ఉన్నప్పుడు, దుకాణాలకు వెళ్లినప్పుడు, రెస్టారెంట్లలో కూడా మనం కనబడే తీరు హుందాగా ఉండడం చాలా ప్రాముఖ్యం. సమావేశ కార్యక్రమాల తర్వాత బయట భోజనం చేస్తున్నప్పుడు మనం సమావేశానికి వేసుకునేలాంటి దుస్తులనే వేసుకోవడం సముచితంగా ఉంటుంది. మనం సమావేశ బ్యాడ్జి కార్డును ధరించడం అనియత సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలను కల్పిస్తుంది.—2 కొరిం. 6:3, 4.

7. సమావేశంలో క్రమబద్ధతకు, ఆనందానికి మనం ఎలా దోహదపడవచ్చు? (“జిల్లా సమావేశపు జ్ఞాపికలు” చూడండి.)

7 యెషయా ఇలా ప్రవచించాడు: “కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు.” (యెష. 30:18ఎ) యెహోవా చూపిన దయపట్ల, కృపపట్ల కృతజ్ఞత, సమావేశాల్లో కూడుకున్నప్పుడు మన ప్రవర్తన ద్వారా, కనబడే తీరు ద్వారా ఆయనను ఘనపర్చేందుకు మనల్ని కదిలిస్తుంది. “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం దేవుణ్ణి ఘనపరిచి, మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేయునుగాక!

[5వ పేజీలోని బాక్సు]

జిల్లా సమావేశపు జ్ఞాపికలు

◼ కార్యక్రమ వేళలు: మూడు దినాలూ కార్యక్రమం ఉద. 9:30కి ప్రారంభమౌతుంది. ఉద. 8:00కి తలుపులు తెరుస్తారు. కార్యక్రమం ప్రారంభమవడానికి కొన్ని నిమిషాల ముందు ప్రారంభ రాజ్య సంగీతం వినిపిస్తున్నప్పుడు ఛైర్మన్‌ స్టేజి మీదకు వచ్చి కూర్చుంటాడు. కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమవడానికి ఆ సమయంలో మనమందరం మన సీట్లలో కూర్చోవాలి. కార్యక్రమం శుక్రవారం సాయం. 5:15కి, శనివారం సాయం. 5:05కి, ఆదివారం సాయం. 4:10కి ముగుస్తుంది.

◼ పార్కింగ్‌: మనకు పార్కింగ్‌ వసతులను నియంత్రించే అవకాశం దొరికిన అన్ని సమావేశ స్థలాల్లో, ఎవరు ముందు వస్తే వారికే పార్కింగ్‌ స్థలం ఇవ్వబడుతుంది. సమావేశ బ్యాడ్జి కార్డులు పార్కింగ్‌ చేయడానికి గుర్తింపుగా పనిచేస్తాయి. సాధారణంగా పార్కింగ్‌కు కేటాయించే స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక కార్లో ఒకరిద్దరు మాత్రమే వచ్చే బదులు కారు ఉన్న వేరేగుంపువారిని కూడా కలుపుకుని ఒకే కార్లో రావడానికి ప్రయత్నించాలి.

◼ సీట్లు నిలుపుకోవడం: మీ ఇంట్లో మీతోపాటు ఉండే వారికి మాత్రమే సీట్లు నిలుపుకోవచ్చు.

◼ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళే బదులు దయచేసి సాధారణ భోజనాన్ని మీ వెంట తెచ్చుకోండి. సీటు క్రింద పెట్టేందుకు వీలుగా ఉండే ఒక చిన్న బ్యాగును, టిఫిన్‌ కారియర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే పెద్ద సైజులో ఉండే బ్యాగులను నడిచే స్థలానికి అడ్డంగా పెట్టకుండా సామాను భద్రపరిచే స్థలంలో విడిచిపెట్టాలి.

◼ విరాళాలు: ఒక జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మన రాజ్య మందిరంలో లేక సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా మన కృతజ్ఞతను చూపించవచ్చు. మనం సమావేశం కోసం చెక్‌ రూపంలో ఇచ్చే విరాళాలు “Watch Tower” పేరున వ్రాయాలి.

◼ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో వైద్య సంబంధమైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హత పొందిన ప్రథమచికిత్సా సిబ్బంది పరిస్థితి గంభీరతను అంచనా వేసి సహాయపడేందుకు, ఆయన వెంటనే దానిని ప్రథమచికిత్స డిపార్ట్‌మెంటు దృష్టికి తీసుకువస్తాడు.

◼ బధిరులు: సికింద్రాబాదు ఇంగ్లీషు సమావేశంలో సంజ్ఞాభాష కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.

◼ రికార్డింగ్‌: సమావేశ స్థలానికి సంబంధించిన విద్యుత్తు కనెక్షన్‌కు లేక సౌండ్‌ సిస్టమ్‌కు ఏ విధమైన రికార్డర్లనూ కనెక్ట్‌ చేయకూడదు, వాటిని ఇతరులకు ఆటంకం కలిగించని విధంగా ఉపయోగించాలి.

◼ ఫోటోలు తీయడం: కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఫోటోలు తీయాలనుకుంటే ఫ్లాష్‌ను ఉపయోగించకండి.

◼ పేజర్లు, సెల్‌ఫోన్లు: ఇతరుల అవధానాన్ని ఆటంకపరచకుండా ఉండేలా వీటిని సెట్‌ చేసుకోవాలి.

◼ సెంట్లు: కొన్ని సమావేశాలు కృత్రిమ వెంటిలేషన్‌ మాత్రమే ఉండే హాళ్లలో జరుగుతాయి కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవారిపై ప్రతిచర్యచూపే ఘాటు సెంట్లను, అత్తర్లను పరిమితంగా వాడితే వారిపట్ల దయ చూపినవారమవుతాం.—1 కొరిం. 10:24.

◼ ఫాలో అప్‌ ఫారమ్‌లు: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపినవారి గురించిన సమాచారం అందించడానికి ప్లీజ్‌ ఫాలో అప్‌ ఫారమ్‌ (S-43) ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫాలో అప్‌ ఫారమ్‌లను తెచ్చుకోవాలి. ఆ ఫారమ్‌లు సమావేశ పుస్తక విభాగంలో కూడా లభిస్తాయి. ఆసక్తి చూపించినవారికి సహాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగివెళ్ళిన తర్వాత మీ సంఘంలోని కార్యదర్శికి అందజేయండి.—మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 2005, 6వ పేజీ చూడండి.

◼ రెస్టారెంట్లు: చాలా ప్రాంతాల్లో లభ్యమవుతున్న సేవలనుబట్టి 15 నుండి 20 శాతం టిప్స్‌ ఇవ్వడం పరిపాటి.

◼ హోటళ్ళు: (1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతి ఉన్న దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి. (2) మీరు మీ రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి హోటల్‌ వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే లగేజి కార్ట్‌ను తీసుకోండి. (4) వంట చేసేందుకు అనుమతి లేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు హౌస్‌కీపర్‌లకు టిప్స్‌ ఇవ్వండి. (6) అతిథులు హోటళ్ళో ఉన్నప్పుడు వారికి అందించే అల్పాహారం, కాఫీ లేక ఐస్‌ లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) హోటల్‌ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు ఆత్మఫలాలను ప్రదర్శించండి, ఆ ఫలాలను ప్రాముఖ్యంగా హోటల్‌ కౌంటర్‌ రద్దీగా ఉండే సమయాల్లో అంటే హోటల్లో దిగే సమయాల్లో, హోటల్లో నుండి వెళ్ళిపోయే సమయాల్లో ప్రదర్శించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి