సేవా కూటాల పట్టిక
మార్చి 13తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, మార్చి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. కావలికోట ప్రతిపాదనను ముగించేముందు ప్రచారకుడు ఇస్తున్న ఆ పత్రికలోని 32వ పేజీని ఉపయోగిస్తూ గృహస్థుడ్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నట్లు ప్రదర్శింపజేయండి. ఆసక్తిగలవారిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ప్రదర్శించండి.
15 నిమి: “విమోచన క్రయధనంనుండి ప్రయోజనం పొందేలా ఇతరులకు సహాయం చేయండి.”a ప్రజలను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించేటప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 206-8 పేజీలను మనం ఇంకా ఎలా ఉపయోగించవచ్చో తర్వాతి భాగం చర్చిస్తుంది.
20 నిమి: ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ. బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 206-8 పేజీల ఆధారంగా ప్రశ్నాజవాబుల చర్చ. ఒక నిమిషంకన్నా తక్కువ సమయంలో ఇచ్చే ఉపోద్ఘాతంలో, గృహస్థుని ఎదుట మొదటి పేరా చదివి ఒక అంశం గురించి చర్చ ఎలా ప్రారంభించవచ్చో పేర్కొనండి. ఆ తర్వాత, పేరాలను చదవకుండానే సభికులను ఈ క్రింది ప్రశ్నలకు వ్యాఖ్యానాలివ్వమని ఆహ్వానించండి: (2వ పేరా) యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఎప్పుడు ప్రారంభించాడు? (3వ పేరా) ప్రభువు రాత్రి భోజనాన్ని ఎన్నిసార్లు ఆచరించాలి? (4వ పేరా) జ్ఞాపకార్థ ఆచరణను బైబిలు ఎలా వర్ణిస్తోంది? (5వ పేరా) యేసు రొట్టెను తన అక్షరార్థ శరీరంగా, ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చలేదని మనకెలా తెలుసు? (6వ పేరా) పులియని రొట్టె దేనికి చిహ్నంగా ఉంది? (7వ పేరా) ఎర్రని ద్రాక్షారసం దేనికి ప్రతీకగా ఉంది? (8వ పేరా) ఎవరు మాత్రమే రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకోవాలి? (9వ పేరా) జ్ఞాపకార్థ ఆచరణ ప్రతీ సంవత్సరం ఎప్పుడు ఆచరించబడుతుంది, దానికి మనం ఎందుకు హాజరవ్వాలి? సమయం అనుకూలించినంతమేరకు కీలక వచనాలను నొక్కిచెప్పండి. బైబిలు విద్యార్థులతో, జ్ఞాపకార్థ ఆచరణకు వారు ఆహ్వానించిన ఇతరులతో కలిసి ఆ శీర్షికలోని పేరాలు చదివి, ముఖ్యాంశాలను చర్చించి, ఈ భాగంలో ఇవ్వబడినట్లు సరళమైన ప్రశ్నలను ఉపయోగిస్తూ ఈ సమాచారాన్ని అధ్యయనం చేయమని ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించండి.
పాట 28 (224), ముగింపు ప్రార్థన.
మార్చి 20తో ప్రారంభమయ్యే వారం
పాట 15 (127)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” బాక్సులో ఉన్న ముఖ్యాంశాలను సమీక్షించండి.
23 నిమి: దేవుని ఏర్పాటులో క్రీస్తు పాత్ర. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 10-13 పేజీల ఆధారంగా ప్రసంగం. “క్రీస్తు పాత్ర” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న మొదటి రెండు పేరాలను చర్చిస్తున్నప్పుడు, జ్ఞాపకార్థ ఆహ్వానాన్ని ఉపయోగించే విధానాలను సూచించడానికి, ప్రదర్శించడానికి మూడు, నాలుగు నిమిషాలు తీసుకోండి. ఫిబ్రవరి 2006 మన రాజ్య పరిచర్యలోని 3వ పేజీలోని 3వ పేరాలో ఇవ్వబడిన సూచనలను సమీక్షించండి.
12 నిమి: ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం ద్వారా బలపరచబడడం. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2006, ముందుమాట ఆధారంగా ప్రసంగం, ప్రదర్శన. ఒక కుటుంబం ఆ రోజు కొరకైన దినవచనాన్ని, వాఖ్యానాలను పరిశీలించడాన్ని చూపించే ప్రదర్శనను ఏర్పాటు చేయండి.
పాట 11 (85), ముగింపు ప్రార్థన.
మార్చి 27తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
15 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఏప్రిల్ 1 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. తేజరిల్లు! ప్రతిపాదన ముగించేముందు ప్రచారకుడు ఇస్తున్న ఆ పత్రికలోని 32వ పేజీని ఉపయోగిస్తూ గృహస్థుడ్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నట్లు ప్రదర్శింపజేయండి. ఆసక్తిగలవారిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ప్రదర్శించండి.
10 నిమి: పరిస్థితులు ఇప్పటికీ దేవుని అధీనంలోనే ఉన్నాయా? కావలికోట ఏప్రిల్ 1, 2006, 32వ పేజీపై ఆధారితమైన ప్రసంగం, ప్రదర్శన. ప్రజలను ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి ఆహ్వానించడానికి దొరికే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బైబిలు విద్యార్థులను, వారితోపాటు బైబిలు అధ్యయనంలో కూర్చోని వారి కుటుంబ సభ్యులను తప్పక ఆహ్వానించండి. మనకు పరిచయమున్న ఆసక్తిగలవారందరికీ, మనం పరిచర్యలో కలిసే ఇతరులకూ ఈ ప్రత్యేక ఆహ్వానం ఇవ్వాలి. నిష్క్రియులుగా మారినవారిని లేదా కూటాలకు హాజరవడం మానేసిన వారిని ఆహ్వానిస్తున్నప్పడు కావలికోట ఏప్రిల్ 1, ఎలా ఉపయోగించాలో ప్రదర్శించండి.
20 నిమి: స్థానిక అనుభవాలు. మార్చి నెలలో బైబిలు బోధిస్తోంది పుస్తకం అందిస్తున్నప్పుడు తమకు ఎదురైన అనుభవాలను చెప్పమని సభికులను ఆహ్వానించండి. ప్రారంభించబడిన బైబిలు అధ్యయనాలను పేర్కొనండి. ఒకటి లేదా రెండు మంచి అనుభవాలు పునర్నటింపజేయవచ్చు.
పాట 21 (191), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 3తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
15 నిమి: స్థానిక ప్రకటనలు. “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తక అధ్యయనాన్ని ఆస్వాదించండి” అనే శీర్షికతో ఫిబ్రవరి 2006 మన రాజ్య పరిచర్యలోని 6వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను సంక్షిప్తంగా సమీక్షించండి. బైబిలు బోధిస్తోంది పుస్తక అధ్యయన పట్టికవైపు అవధానాన్ని మళ్ళించండి. అంతేగాక జ్ఞాపకార్థ ఆచరణకు ఆసక్తిగలవారిని ఆహ్వానించేందుకు ముద్రిత ఆహ్వానం ఎలా ఉపయోగించాలో ప్రదర్శించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “దేవుని మార్గంలో నడవడాన్ని దీనులకు బోధించండి.”b కావలికోట జూలై 1, 2004, 16వ పేజీలోని 9వ పేరానుండి కూడా వ్యాఖ్యానాలు చేర్చండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.