కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/05 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 9/05 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) ప్రత్యామ్నాయంగా, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా, సృష్టి ద్వారానా? (ఆంగ్లం) లేదా 192 పేజీల పాత పుస్తకం ఏదైనా ప్రతిపాదించవచ్చు. పుస్తక ప్రతిపాదనను గృహస్థుడు అంగీకరించకపోతే అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తి చూపించిన చోట దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. తమకు పిల్లలులేరని గృహస్థులు చెప్పినప్పుడు, వారికి జ్ఞానము పుస్తకాన్ని లేదా మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. సంఘంలో స్టాకు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), లేక మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి.

◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతీనెలా దాని గురించి సంఘంలో ప్రకటించే విధంగా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, కావల్సిన సాహిత్యాలను వ్యక్తిగతంగా తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల బాధ్యతను నిర్వహిస్తున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్స్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ బహిష్కరించబడిన లేక సహవాసం మానుకున్న వారెవరైనా తిరిగి చేర్చుకోబడేందుకు మొగ్గుచూపుతున్న వారి విషయంలో పెద్దలు కావలికోట ఫిబ్రవరి 1, 1992, 17-19 పేజీల్లోని సూచనల ప్రకారం వ్యవహరించాలని వారికి గుర్తు చేయబడుతోంది.

◼ 2006వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఆదివారం ఏప్రిల్‌ 30న ఉంటుంది. ఆ ప్రసంగాంశం తర్వాత ప్రకటించబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం లేక సమావేశం ఉండే సంఘాలకు ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. ఏ సంఘంలో కూడా ఆదివారం, ఏప్రిల్‌ 30, 2006 వ తేదీకన్నా ముందు ఆ ప్రత్యేక ప్రసంగం ఇవ్వకూడదు.

◼ అక్టోబరులో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు చేయడానికి అది చాలా అనువైన నెల.

◼ 2006వ సేవా సంవత్సరంలో, ప్రాంతీయ పైవిచారణకర్త సంఘాన్ని సందర్శించే నెలలో సహాయ పయినీర్లుగా సేవ చేస్తున్నవారందరూ సందర్శనంలో పయినీర్ల కోసం నిర్వహించే కూటంలోని మొదటి భాగానికి హాజరవడానికి అనుమతించబడతారు. అలా హాజరవగల వారందరూ ఆ ప్రత్యేక ఏర్పాటు నుండి ప్రయోజనం పొందాలని ప్రోత్సహించబడుతున్నారు.

◼ క్రొత్త సేవా సంవత్సరానికి సరిపడా వార్షిక సర్వీస్‌ ఫారాలు అన్ని సంఘాలకు పంపించబడుతున్నాయి. కార్యదర్శులు, పంపించబడిన ఆ ఫారాలు రాబోయే సేవా సంవత్సరానికి సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ ఫారాల్లో ఏవైనా మరికొన్ని కావాల్సివస్తే, వాటిని వెంటనే సెప్టెంబరులో మీరు చేసే లిటరేచర్‌ రిక్వెస్టుతోపాటు పంపించండి.

◼ డ్యూరబుల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని (DPA) కార్డు శాశ్వతకాలం చెల్లుతుంది కాబట్టి ప్రతీ సంవత్సరం క్రొత్తది వ్రాయనవసరం లేదు. అంతేకాక ఎన్నో సంవత్సరాలు నిలిచివుండే విధంగా రూపొందించబడిన ప్రత్యేక పేపరు మీద అది ముద్రించబడింది. అందుకే DPA కార్డు, DPA కార్డును పూరించడానికి సూచనలు (dpai) ప్రతీ సంవత్సరం పంపించే ఫారాలతో పాటు పంపించబడవు. ప్రతీ సంఘం తమ అవసరమేమిటో గుర్తించి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ను (S-14) ఉపయోగించి ఆ ఫారాల కోసం రిక్వెస్టు చేయాలి. DPA కార్డు, దానిని పూరించడానికి సూచనలు సంవత్సరమంతా సంఘంలో ఎల్లప్పుడూ స్టాకులో ఉండేలా కార్యదర్శులు చూసుకోవాలి, అవి లేని పరిస్థితి రాకముందే ముందుగానే వాటికోసం రిక్వెస్టు చేయాలి. DPA కార్డు ఆంగ్లంలో మాత్రమే లభ్యమవుతుంది, కానీ సూచనలు (dpai) మాత్రం ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో లభ్యమవుతున్నాయి.

◼ లభ్యమవుతున్న క్రొత్త సిడి-రామ్‌:

వాచ్‌టవర్‌ లైబ్రరీ—2004 ఎడిషన్‌—ఆంగ్లం

ఇది ప్రజలకు పంచడం కోసం, పాఠశాల గ్రంథాలయాల కోసం, యెహోవాసాక్షుల విషయంలో కేవలం ఆసక్తి వ్యక్తం చేసేవారి కోసం తయారుచేయబడలేదని దయచేసి గుర్తించండి. వాచ్‌టవర్‌ లైబ్రరీ, సంఘంలో కంప్యూటర్‌ సౌకర్యం ఉన్న సభ్యులకు మాత్రమే, అది కేవలం సంఘం ద్వారానే లభిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి