కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/05 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 12తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 19తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 26తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2005
km 9/05 పేజీ 2

సేవా కూటాల పట్టిక

సెప్టెంబరు 12తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. సెప్టెంబరు 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. రెండు ప్రదర్శనల్లోనూ ఒక ప్రదర్శనను ఒక పెద్దతో చేయించండి, మరొకటి ఒక యువకునితో చేయించండి. ప్రతీ ప్రదర్శన తర్వాత ఆ ప్రతిపాదనలో ఉన్న కొన్ని మంచి అంశాలను నొక్కి చెప్పండి.

20 నిమి: “మీ సమయాన్ని జ్ఞానవంతంగా ఉపయోగించండి.”a ప్రతీరోజు బైబిలు చదవడానికి తాము సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కాలపట్టిక వేసుకోవడానికి మన రాజ్య పరిచర్య, మే 2005 మధ్యపేజీలను ఉపయోగించుకొమ్మని ఆయావ్యక్తులను, కుటుంబాలను ప్రోత్సహించండి.

15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం.”b మధ్య పేజీల్లోని ఒకటి, రెండు భాగాల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. మన రాజ్య పరిచర్య, ఆగస్టు 2004, 1వ పేజీని కూడా సంప్రదించవచ్చు. మీరు బైబిలు అధ్యయనం నిర్వహించే ప్రతీసారి సమగ్రంగా సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం? అలా సిద్ధపడడంలో ఏమి ఇమిడివుంది? మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సలహాలను తాము ఎలా అన్వయించుకున్నారో వివరించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. అనుబంధంలో మొదటి పేజీలో పైభాగంలో షేడ్‌ చేయబడిన బాక్సు మీద వ్యాఖ్యానిస్తూ ముగించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 19తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య మొదటి పేజీలో కనిపించే బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ఉత్తరంలోని ముఖ్యాంశాలను సమీక్షించండి.

20 నిమి: గత సంవత్సరంలో మనమెలా చేశాము? సేవా పైవిచారణకర్త, పరిచర్యలో సాధించిన ప్రోత్సాహకరమైన విషయాల మీద దృష్టి నిలుపుతూ గత సేవా సంవత్సరాన్ని సమీక్షిస్తాడు. సముచితమైన విధంగా మెచ్చుకోండి. రాబోయే సంవత్సరంలో దృష్టి నిలపాల్సిన ఒకటి లేక రెండు రంగాల గురించి చెప్పండి. పయినీర్ల కార్యకలాపాల గురించి వ్యాఖ్యానించండి, వారు ఉత్సాహంగా చేస్తున్న పనిని మెచ్చుకోండి. నిష్క్రియులైనవారికి సహాయపడేందుకు చేసిన కృషివల్ల సాధించిన మంచి ఫలితాల గురించి చెప్పండి.

15 నిమి: “ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి.”c ఇతరుల ప్రేమపూర్వక శ్రద్ధవల్ల తాము ఎలాంటి ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 26తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. సెప్టెంబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: పత్రికలను ఉపయోగిస్తూ రాజ్యసువార్త తెలియజేయడం. మనం అక్టోబరు నెలలో కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదిస్తాం. ఉపోద్ఘాతంలో, మన రాజ్య పరిచర్య, ఫిబ్రవరి 2005 8వ పేజీ, 3-6 పేరాల నుండి క్రింది సూచనలను చర్చించండి: (1) పత్రికలను జతగా ప్రతిపాదించండి. (2) పత్రికా పనిలో భాగం వహించడానికి వారానికి ఒకరోజును కేటాయించండి. (3) ప్రతీ నెల అందించాల్సిన పత్రికల లక్ష్యాన్ని పెట్టుకోండి. (4) పత్రికలను ప్రతిపాదించడానికి సముచితమైన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. (5) పాత సంచికలను చక్కగా ఉపయోగించండి. ఈ సలహాలు స్థానికంగా ఎలా అన్వయిస్తాయో చెప్పండి. ఆ తర్వాత అక్టోబరు 1 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి ఈ మన రాజ్య పరిచర్యలో ఉన్న 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. అంతేకాక స్థానిక క్షేత్రంలోని ప్రజలను ఆకర్షించగల లోపలి పేజీల్లోని ఆర్టికల్స్‌ వైపు దృష్టి మళ్ళించి, ఆ ఆర్టికల్స్‌లో ఒకదానిని ఉపయోగిస్తూ ఒక ప్రతిపాదనను ప్రదర్శించండి. ప్రతీ ప్రదర్శన తర్వాత, ఆ ప్రతిపాదనలో ఉన్న కొన్ని మంచి విషయాలను నొక్కిచెప్పండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 3తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: “‘హృదయపూర్వకముగా లోబడి’ ఉండేలా ఇతరులకు సహాయం చేయండి” d సమయం అనుమతిస్తే, ఉదాహరించబడిన లేఖనాల మీద వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడం. (సామె. 27:11) యెహోవాను దీర్ఘకాలంగా సేవిస్తున్న ఇద్దరు లేక ముగ్గురు నమ్మకమైన సేవకులను ఇంటర్వ్యూ చేయండి. యెహోవాకు విధేయులుగా ఉండడానికి తమకు సహాయం చేసిన ఒకటి లేక రెండు విషయాల గురించి చెప్పమని వారిలో ప్రతీ ఒక్కరిని ఆహ్వానించండి. శ్రద్ధతో చేసే వ్యక్తిగత బైబిలు అధ్యయనం, క్రమంగా కూటాలకు హాజరవడం, ఇతర యథార్థవంతులతో సహవాసం, క్షేత్ర పరిచర్యలో పూర్ణాత్మతో భాగం వహించడం, హృదయపూర్వక ప్రార్థన, అనుచిత వినోదానికి దూరంగా ఉండడం వంటి విషయాల గురించి చెప్పవచ్చు. వారు ఎలాంటి విధేయతా పరీక్షలను ఎదుర్కొన్నారు, వారు ఆ పరీక్షలను విజయవంతంగా ఎలా ఎదుర్కొన్నారు? వారు విధేయత చూపించినందుకు ఎలా ఆశీర్వదించబడ్డారు?

పాట 21 (191), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి