కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/05 పేజీ 1
  • మనం ఇతరులకు ఋణపడి ఉన్నది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ఇతరులకు ఋణపడి ఉన్నది
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు అప్పులు చేయడం యోగ్యమేనా?
    తేజరిల్లు!—1995
  • ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు
    మన రాజ్య పరిచర్య—2007
  • ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం నేడు ఎందుకు ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 7/05 పేజీ 1

మనం ఇతరులకు ఋణపడి ఉన్నది

1 అపొస్తలుడైన పౌలు ప్రజలకు ప్రకటించవలసిన బాధ్యత తనకుందని భావించాడు. యెహోవా తన కుమారుని అమూల్యమైన రక్తం ద్వారా మనుష్యులందరూ రక్షణ పొందడాన్ని సాధ్యం చేశాడని ఆయనకు తెలుసు. (1 తిమో. 2:3-6) అందుకే ఆయన ఇలా అన్నాడు: “గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.” పౌలు సువార్త ప్రకటించడం ద్వారా తన తోటి మానవులకు తాను ఋణపడి ఉన్నది తీర్చుకోవడానికి ఉత్సాహంగా, అలుపెరుగకుండా ప్రయాసపడ్డాడు.—రోమా. 1:14, 15.

2 పౌలులాగే నేడు క్రైస్తవులు కూడా అవకాశం దొరికినప్పుడల్లా తమ పొరుగువారికి రాజ్య సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. ‘మహాశ్రమ’ అతిసమీపంలో ఉంది కాబట్టి, మనం యథార్థ హృదయుల కోసం అన్వేషించడం అత్యవసరం. ఈ ప్రాణరక్షక పనిలో కష్టించి పనిచేయడానికి ప్రజలపట్ల నిజమైన ప్రేమ మనల్ని ప్రేరేపించును గాక.—మత్త. 24:21; యెహె. 33:8.

3 మన ఋణాన్ని తీర్చుకోవడం: మనం ప్రజలను కలుసుకొనే ప్రాముఖ్యమైన మార్గం ఇంటింటా ప్రకటించడం ద్వారానే. చాలామంది ఇంట్లో ఉండని క్షేత్రాల్లో ఖచ్చితమైన రికార్డులు ఉంచుకొని వేరే సమయాల్లో తిరిగి వెళ్ళడం ద్వారా చాలామందిని కలుసుకొనేందుకు మనకు వీలవుతుంది. (1 కొరిం. 10:33) వ్యాపార క్షేత్రంలో, వీధుల్లో, పార్కుల్లో, పార్కింగ్‌ స్థలాల్లో, టెలిఫోనులో సాక్ష్యమివ్వడం ద్వారా కూడా మనం వ్యక్తులను కలుసుకోవచ్చు. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘జీవాన్నిచ్చే సందేశాన్ని గురించి ప్రకటించడానికి అన్ని మార్గాలను ప్రయత్నించడంలో నేను నాకు సాధ్యమైనంత చేస్తున్నానా?’—మత్త. 10:11.

4 ఒక పయినీరు సహోదరి తన క్షేత్రంలో ఉన్న ప్రజలందరినీ కలుసుకోవాల్సిన బాధ్యత తనకు ఎంతో ఉందని భావించింది. ఒక ఇంట్లో ఎప్పుడు చూసినా కిటికీకున్న బ్లైండ్లు మూసేసి ఉండేవి, ఇంట్లో ఎవరూ ఉండేవారుకాదు. అయితే ఒకరోజు ఆ పయినీరు పరిచర్యలో లేనప్పుడు, ఎప్పుడూ ఎవరూ ఉండని ఆ ఇంటి ముందు కారు ఉండడం గమనించింది. ఆ అవకాశాన్ని చేజార్చుకోకూడదు అనుకొని ఆమె వెళ్ళి డోర్‌ బెల్‌ నొక్కింది. ఒక వ్యక్తి తలుపుతీశాడు, ఆ మొదటి సంభాషణ ఆ సహోదరి, ఆమె భర్త అనేక పునర్దర్శనాలు చేసేందుకు దారితీసింది. చివరకు, ఆ వ్యక్తి బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు, ఇప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న సహోదరుడు. ఆ సహోదరి తాను పొరుగువారికి ఋణపడి ఉన్నాను కాబట్టి, వారికి ప్రకటించే బాధ్యత తనకుందని భావించినందుకు ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు.

5 చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి, ప్రకటనా పనిలో తీవ్రంగా కృషి చేయడం ద్వారా మన పొరుగువారిపట్ల మన ఋణాన్ని తీర్చుకొనే సమయం ఇదే.—2 కొరిం. 6:1, 2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి