కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/05 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 5/05 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌ 18-మే 15: అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించే ప్రత్యేక కార్యక్రమం. మే 16-31: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలను ప్రతిపాదించండి. ఆసక్తిగలవారినీ, జ్ఞాపకార్థ ఆచరణకు లేక ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకు హాజరవుతున్నా సంఘంతో క్రియాశీలంగా సహవసించని వారినీ పునర్దర్శించేటప్పుడు దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టినిలపండి. ప్రత్యేకంగా జ్ఞానము పుస్తకం నుండి, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ నుండి ఇప్పటికే అధ్యయనం పూర్తిచేసిన వ్యక్తులతో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్‌లో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం ఇవ్వండి, తమకు పిల్లలులేరని చెప్పిన వారికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ఇవ్వండి. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషి చేయండి. జూలై, ఆగస్టుల్లో: భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), అనే 32-పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన వ్యక్తి జూన్‌ 1వ తారీఖున లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయాలి. మరమ్మతుల కోసం, నిర్మాణం కోసం వేరే అకౌంట్‌ ఉంటే, ఆ అకౌంట్‌ను కూడా ఆడిట్‌ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఆడిట్‌ పూర్తవగానే తరువాతి అకౌంట్సు రిపోర్టుతో పాటు దానిని సంఘానికి చదవాలి.

◼ అస్సామీస్‌, మరాఠీ భాషా సంఘాలు, జూన్‌ 27తో ప్రారంభమయ్యేవారం నుండి తమ సంఘ పుస్తక అధ్యయనంలో దానియేలు ప్రవచనం పుస్తకాన్ని హిందీ భాషలో అధ్యయనం చేస్తాయి. తెలుగు, బెంగాలీ, మిజో సంఘాలు ఆ పుస్తకానికి బదులు దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని అధ్యయనం చేస్తాయి.

◼ గాంగ్‌టాక్‌ (నేపాలీ)లో జరగబోయే “దైవిక విధేయత” జిల్లా సమావేశ తేదీలు సవరించబడ్డాయి. సవరించబడిన తేదీలు ఆగస్టు 12-14, 2005.

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

యెహోవాకు స్తుతిగీతాలు పాడండి—ఆంగ్లంలో పెద్ద అచ్చుది.

ఇది స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌ అని దయచేసి గమనించండి, అంతేకాక ఇది దృష్టిలోపం ఉన్నవారికి, చిన్న అక్షరాలు చదవలేని వారికి మాత్రమే అని గమనించండి. అందుకే దృష్టిలోపం ఉన్నవారు రిక్వెస్ట్‌ చేసినప్పుడు మాత్రమే ఆర్డరు చేయాలి. సర్వీసు కమిటీ దానిని సొసైటీకి పంపించేముందు తప్పకుండా పరిశీలించి నిజంగా అవసరమనుకుంటేనే లిటరేచర్‌ రిక్వెస్టులో దానిని పేర్కొనాలి.

◼ లభ్యమయ్యే కొత్త ఆడియో కాంపాక్ట్‌ డిస్కులు:

మీ కంటిని తేటగా ఉంచుకోండి—కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

“కుటుంబములారా—అనుదిన బైబిలు పఠనాన్ని మీ జీవన విధానంగా చేసుకోండి!” —కన్నడ, తమిళం, మలయాళం, హిందీ

యెహోవాకు సన్నిహితమవండి (ఎమ్‌పి 3 ఫార్మెట్‌)—ఆంగ్లం

పధ్నాలుగు బైబిలు డ్రామాలు (3 సీడీలు, ఎమ్‌పి 3 ఫార్మెట్‌)—ఆంగ్లం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి