కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/05 పేజీలు 4-5
  • మహా సమాజంలో యెహోవాను స్తుతించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మహా సమాజంలో యెహోవాను స్తుతించండి
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి
    మన రాజ్య పరిచర్య—2006
  • గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా క్రీస్తును అనుసరించండి
    మన రాజ్య పరిచర్య—2007
  • ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం
    మన రాజ్య పరిచర్య—2008
  • జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 4/05 పేజీలు 4-5

మహా సమాజంలో యెహోవాను స్తుతించండి

1, 2. జిల్లా సమావేశం మనకు ఎలాంటి అవకాశాన్ని ఇస్తోంది, మనం దానిని సాధించే మార్గాలు ఏమిటి?

1 ప్రతీ సంవత్సరం జరిగే మన జిల్లా సమావేశాలు యెహోవాను మహిమపరిచే గొప్ప అవకాశాన్ని మనకు ఇస్తున్నాయి. మన భావాలు దావీదు భావాల్లాగే ఉన్నాయి, ఆయన ఇలా పాడాడు: “అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను; బహు జనులలో నిన్ను నుతించెదను.” (కీర్త. 35:18) రాబోయే “దైవిక విధేయత” జిల్లా సమావేశంలో, ఐక్యతగల ప్రజలుగా మనం యెహోవాకు స్తుతి కలుగడానికి కారణమవుతామని ఎలా నిశ్చయించుకోవచ్చు?

2 అలా నిశ్చయించుకోవడానికి ఒక మార్గం, మన ప్రవర్తన. ఒక సమావేశపు వసతికి చెందిన యాజమాన్యం ఇలా అంది: “వసతి కోసం మా వద్దకు వచ్చే ఇతర మతాల వారికి, మేము మీ సమావేశాలను ఆధారంగా చేసుకొని, యెహోవాసాక్షులు లోపరహితమైన ఏర్పాట్లు చేస్తారు కాబట్టి వారు సమావేశాలను ఎలా ఏర్పాటు చేస్తారో చూడమని చెప్పాం.” మనం కనిపించే తీరు ద్వారా, మన సహకారం ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనలో ప్రతి ఒక్కరం దేవునికి న్యాయంగా చెందవలసిన అలాంటి అధిక స్తుతులకు కారణం అవుతాం.—1 పేతు. 2:12.

3, 4. సమావేశం జరుగుతున్నప్పుడు, ప్రతీ దినం సమావేశం ముగిసిన తర్వాత, మన వస్త్రధారణ క్రైస్తవ పరిచారకులకు తగినట్లు ఉండాలంటే మనకు అణకువ ఎలా సహాయం చేస్తుంది?

3 వ్యక్తిగతంగా కనబడే తీరు: మనం కనబడే తీరు యెహోవాను స్తుతించే విధంగా ఉండాలంటే మనలో అణకువ ఉండాలి. (1 తిమో. 2:9) పరిచర్య పాఠశాల పుస్తకంలోని 132వ పేజీ ఇలా చెబుతోంది: “అణకువగల వ్యక్తి, అనవసరంగా ఇతరులను కలతపెట్టకుండా తనవైపుకు అనవసరమైన శ్రద్ధను రాబట్టుకోకుండా ఉండేందుకు జాగ్రత్తపడతాడు.” చాలా దేశాల్లో అణకువ లేని వస్త్రధారణ సర్వసాధారణం అయింది. అయితే, యెహోవాకు తగిన విధంగా ప్రాతినిధ్యం వహించేందుకు మనం చేసే ప్రయత్నాలను ఆయన అమూల్యమైనవిగా పరిగణిస్తాడు. (అపొ. 15:14) సమావేశాన్ని క్రీడా మైదానంలో నిర్వహించినా లేక వినోదకార్యక్రమాలు జరిగే స్థలంలో నిర్వహించినా, సమావేశం జరిగే మూడు రోజులూ అది మనకు “మహాసమాజము” అవుతుంది. అందుకే మనం యెహోవా ముందు సమావేశం అవుతున్నప్పుడు మన వస్త్రధారణ, విశ్వంలో మహోన్నత వ్యక్తికి తగిన గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి.—1 దిన. 29:11.

4 ప్రతీ దినం సమావేశం ముగిసిన తర్వాత కూడా మనం కనబడే తీరు విషయంలో శ్రద్ధ వహించాలి. తీరిక వేళల్లో లేక రెస్టారెంటులో భోజనం చేస్తున్నప్పుడు, మనం మరింత సౌకర్యవంతంగా ఉండే వస్త్రాలను ధరించడానికి ఇష్టపడుతున్నప్పటికీ మనం కనబడే తీరు “దైవభక్తిగలవారమని చెప్పుకొ[నే]” వారికి తగిన విధంగా ఉండడం ప్రాముఖ్యం. (1 తిమో. 2:10) లోకంలో ప్రఖ్యాతి చెందినవే ఆమోదకరమైన దుస్తులు అని నిర్ణయించలేము. (1 యోహా. 2:16, 17) మన క్రైస్తవ ప్రచురణల్లో, వివిధ పరిస్థితుల్లో స్త్రీ పురుషులు అణకువతో, చక్కని వస్త్రధారణతో ఉన్నట్లు చూపించే చిత్రాలు ఉన్నాయి, ఈ విషయంలో అవి మనకు సహాయకరంగా ఉంటాయి. సమావేశం జరిగే నగరంలో ఉన్నప్పుడు బ్యాడ్జి కార్డును ధరించడం మనం అన్ని వేళల్లో క్రైస్తవ పరిచారకులమని గుర్తు చేస్తుంది.—2 కొరిం. 6:3, 4.

5, 6. యెహోవా ఆధ్యాత్మిక బల్లపట్ల మనం గౌరవాన్ని ఎలా చూపించవచ్చు?

5 యెహోవా ఆధ్యాత్మిక బల్లను గౌరవించండి: విశ్వ సర్వాధిపతియైన ప్రభువు మనకు విందును ఏర్పాటు చేశాడు. (యెష. 25:6; 1 కొరిం. 10:21) మనం యెహోవా ఆధ్యాత్మిక బల్ల దగ్గర హాజరుకావడాన్ని ఎంతో విలువైనదిగా ఎంచితే, సమావేశపు మూడు దినాలూ హాజరుకావడాన్ని మన లక్ష్యంగా చేసుకుంటాం. వసతి సౌకర్యాలకూ, ప్రయాణానికీ, ఉద్యోగాలకు సెలవు పెట్టడానికీ సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారా? సీట్ల కోసం వెదికేందుకు, మీ సహోదరులతో సహవసించేందుకు వారితో కలిసి ప్రారంభ సంగీతంలో, ప్రార్థనలో యెహోవాను స్తుతించేందుకు వీలుగా సమావేశ స్థలానికి త్వరగా చేరుకునేలా సిద్ధపడడానికి, ప్రయాణించడానికి సరిపోయేంత సమయాన్ని కేటాయించారా?—కీర్త. 147:1.

6 యెహోవా బల్లపట్ల మనకు గౌరవం ఉంటే కార్యక్రమం మీద శ్రద్ధగా అవధానం నిలపడానికి, ఇతరులతో అనవసరంగా మాట్లాడకుండా ఉండేందుకు, వసారాలో తినకుండా లేక మాట్లాడకుండా ఉండేందుకు ప్రేరణ పొందుతాం. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా ఇప్పుడు మనకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా అందిస్తున్నాడు. (మత్త. 24:45) మనమందరం కార్యక్రమంలో ఏ భాగాన్నీ కూడా తప్పిపోకుండా జాగ్రత్తపడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలతో కూర్చొని వారు పూర్తిగా ప్రయోజనం పొందడానికి సహాయం చేయాలి.—ద్వితీ. 31:12.

7. మధ్యాహ్న భోజనం విషయంలో ఏమి చేయాలని మనం కోరబడుతున్నాం, ఎందుకు?

7 మధ్యాహ్న విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్ళే బదులు, మధ్యాహ్న భోజనాన్ని మనతోపాటు తెచ్చుకోవాలని కోరబడుతున్నాము. గత సంవత్సరపు సమావేశంలో చాలామంది ప్రతినిధులు ఆ నిర్దేశాన్ని జాగ్రత్తగా అనుసరించడం ప్రశంసనీయమైన విషయం. ఈ సంవత్సరం కూడా ఆ నిర్దేశాన్ని అందరూ అనుసరిస్తే అది ఎంత ప్రశంసనీయంగా ఉంటుందో కదా! (హెబ్రీ. 13:17) ఆ ఏర్పాటు, మన సహోదరులతో ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆనందించేందుకు ఒక చక్కని అవకాశాన్ని ఇస్తుంది, యెహోవాను మహిమపరిచే ఐక్యత, సమాధానంతో కూడిన వాతావరణానికి దోహదపడుతుంది.—కీర్త. 133:1.

8, 9. యెహోవాను స్తుతించడానికి సమావేశం మనకు ఏ అదనపు అవకాశాన్ని ఇస్తోంది?

8 అనియత సాక్ష్యం ఇవ్వడం: సమావేశ స్థలానికి వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు మన పెదవులతో యెహోవాను స్తుతించడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. (హెబ్రీ. 13:15) మనం రెస్టారెంటులో భోజనం చేస్తున్నా లేక హోటల్‌ సిబ్బందితో మాట్లాడుతున్నా, సాక్ష్యం ఇచ్చేందుకుగల మార్గాల కోసం ప్రయత్నిద్దాం. సమావేశానికి హాజరుకావడంవల్ల మన మనస్సుల్లో, హృదయాల్లో ఆధ్యాత్మిక సంపదలు నిండుగా ఉంటాయి. ఆ మంచి విషయాలను మనం అనియతంగా కలిసేవారితో పంచుకుందాం.—1 పేతు. 3:15.

9 “సమాజములలో యెహోవాను” స్తుతించే ఆ అవకాశం కోసం మనం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తాం. (కీర్త. 26:12) “దైవిక విధేయత” జిల్లా సమావేశంలో మనం ఐక్యతతో యెహోవాను స్తుతించెదము గాక.

[5వ పేజీలోని బాక్సు]

జిల్లా సమావేశపు జ్ఞాపికలు

◼ కార్యక్రమ వేళలు: మూడు దినాలూ కార్యక్రమం ఉద. 9:30కు ప్రారంభమౌతుంది. ఉద. 8:00కి తలుపులు తెరుస్తారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు ప్రారంభ రాజ్య సంగీతం వినిపిస్తున్నప్పుడు ఛైర్మన్‌ ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి కూర్చుంటాడు. కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమయ్యే విధంగా ఆ సమయంలో మనమందరం మన సీట్లలో కూర్చోవాలి. కార్యక్రమం శుక్రవారం, శనివారం సా. 5:05కీ, ఆదివారం సా. 4:10కి ముగుస్తుంది.

◼ పార్కింగ్‌: మనకు పార్కింగ్‌ వసతులను నియంత్రించే అవకాశం దొరికిన అన్ని సమావేశ స్థలాల్లో, ఎలాంటి డబ్బూ వసూలు చేయకుండా ముందు వచ్చినవారికి ముందుగా ఖాళీ స్థలాలు లభ్యమౌతాయి. సమావేశపు బ్యాడ్జి కార్డులు పార్కింగ్‌ చేయడానికి గుర్తింపుగా పనిచేస్తాయి. సాధారణంగా పార్కింగ్‌కు కేటాయించే స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతీ కార్లో ఇద్దరు ముగ్గురే వచ్చే బదులు సాధ్యమైనంతవరకు కారు ఉన్న వేరే గుంపువారు కూడా ఒకే కార్లో రావడానికి ప్రయత్నించాలి.

◼ సీట్లు నిలుపుకోవడం: మీ యింట్లో మీతోపాటు ఉండే వారికి లేక మీ బైబిలు విద్యార్థులకు మాత్రమే సీట్లు నిలుపుకోవచ్చు.

◼ విరాళాలు: ఒక జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మన రాజ్య మందిరంలో లేక సమావేశంలో ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా మన కృతజ్ఞతను చూపించవచ్చు. మనం సమావేశం కోసం చెక్‌ రూపంలో ఇచ్చే విరాళాలు “Watch Tower” పేరున వ్రాయాలి.

◼ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళే బదులు భోజనాన్ని వెంట తెచ్చుకోండి. సీటు క్రింద పెట్టేందుకు వీలుగా ఉండే ఒక చిన్న కూలర్‌ను ఉపయోగించుకోవచ్చు. పెద్ద సైజులో ఉండే పిక్నిక్‌ కూలర్‌లు, గాజు పాత్రలు, మద్య పానీయాలు సమావేశ స్థలానికి తీసుకురావడానికి అనుమతి లేదు.

◼ రికార్డింగ్‌: సమావేశ స్థలానికి సంబంధించిన విద్యుత్తు కనెక్షన్‌కు లేక సౌండ్‌ సిస్టమ్‌కు ఎలాంటి రికార్డర్లనూ కనెక్ట్‌ చేయకూడదు, వాటిని ఇతరులకు ఆటంకం కలిగించని విధంగానే ఉపయోగించాలి.

◼ ఫోటోలు తీయడం: కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఫోటోలు తీస్తున్నప్పుడు ఫ్లాష్‌ను ఉపయోగించకూడదు.

◼ పేజర్లు, సెల్‌ఫోన్లు: ఇతరుల అవధానాన్ని మళ్ళించకుండా ఉండే విధంగా వీటిని సెట్‌ చేసుకోవాలి.

◼ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో వైద్య సంబంధమైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హత పొందిన ప్రథమ చికిత్సా సిబ్బంది పరిస్థితి గంభీరతను అంచనా వేసి సహాయపడేందుకు, ఆయన వెంటనే దానిని ప్రథమ చికిత్స డిపార్ట్‌మెంటు దృష్టికి తీసుకువస్తాడు.

◼ రెస్టారెంట్లు: చాలా ప్రాంతాల్లో లభ్యమవుతున్న సేవల ఆధారంగా టిప్స్‌ ఇవ్వడం పరిపాటి.

◼ హోటళ్ళు: (1) అవసరమయ్యే దాని కన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతి ఉన్న దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి. (2) మీరు మీ రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి హోటల్‌ వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే లగేజి కార్ట్‌ను తీసుకోండి. (4) వంట చేసే అనుమతి లేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు హౌస్‌కీపర్‌లకు టిప్స్‌ ఇవ్వండి. (6) అతిథులు హోటళ్ళో ఉన్నప్పుడు వారికి అందించే అల్పాహారం, కాఫీ లేక ఐస్‌ లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) హోటల్‌ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు ఆత్మ ఫలాలను ప్రదర్శించండి, ఆ ఫలాలను ప్రాముఖ్యంగా హోటల్‌ కౌంటర్‌ రద్దీగా ఉండే సమయాల్లో అంటే హోటల్లో దిగే సమయాల్లో, హోటల్లో నుండి వెళ్ళిపోయే సమయాల్లో ప్రదర్శించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి