సేవా కూటాల పట్టిక
ఫిబ్రవరి 14తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకోబడిన ప్రకటనలు. ఫిబ్రవరి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆ ప్రతిపాదనలను మీ స్థానిక క్షేత్రంలోని పరిస్థితులకు అనుకూలంగా ఎలా మలచుకోవచ్చో క్లుప్తంగా సమీక్షించండి.—జనవరి 2005 మన రాజ్య పరిచర్య, 8వ పేజీ చూడండి.
35 నిమి: “జ్ఞాపకార్థ ఆచరణ కాలం, పరిచర్యలో ఎక్కువగా భాగం వహించేందుకు అనువైన సమయం.”a సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. 6వ పేరా చర్చిస్తున్నప్పుడు అక్టోబరు-డిసెంబరు 2004 తేజరిల్లు!లోని 14-16 పేజీల్లో ఉన్న వ్యాఖ్యానాలను చేర్చండి. సహాయ పయినీరు సేవ చేస్తున్న వారి పేర్లను ప్రకటించండి. క్షేత్రసేవ కోసం ఏర్పాటు చేసిన అదనపు కూటాలను పేర్కొనండి. ఏ విధంగానైనా జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను విస్తృతపరచుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 21తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 6వ పేజీలోని, “మరింత సాక్ష్యం లభించేలా వారికి సహాయం చేయండి” బాక్సులో ఉన్న ముఖ్యాంశాలను సమీక్షించండి. అవసరమైనప్పుడు ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారాన్ని వెంటనే నింపమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “యెహోవా కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.”b జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సమయం, స్థలంతోపాటు ప్రసంగం ఇచ్చేవారి పేరు, సంబంధిత ఇతర వివరాల గురించి ప్రకటించండి. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, ఒక ప్రచారకుడు తన పత్రికా మార్గంలో ఉన్న వ్యక్తిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే క్లుప్త ప్రదర్శనను చేర్చండి. ముద్రిత జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రాలు ఇంకా ఇవ్వనట్లయితే, కూటం అయిన తర్వాత అవి లభ్యమయ్యేలా చేయాలి.
15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—6వ భాగం.”c నాలుగు నిమిషాల ప్రదర్శనను చేర్చండి, దీనిలో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే వారిలో కొందరు మాత్రమే రొట్టె, ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటారు అని ఒక బైబిలు విద్యార్థి అడుగుతాడు. అధ్యయన నిర్వాహకుడు ప్రశ్న అడిగినందుకు ఆయనను ప్రశంసించి, దానిని రాసుకొని, వారపు అధ్యయన సమాచారం పరిశీలించిన తర్వాత దానిని చర్చిద్దామని సూచిస్తాడు. అధ్యయనం ముగిసిన తర్వాత, అధ్యయన నిర్వాహకుడు తర్కించండి (ఆంగ్లం) పుస్తకంలోని 267-8 పేజీల్లో ఉన్న “రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి?” అనే ప్రశ్న క్రింద ఉన్న సమాచారం వైపు విద్యార్థి దృష్టిని మరల్చుతాడు. వారిద్దరూ కలిసి దానిని చదువుతారు, తాను అడిగిన ప్రశ్నకు స్పష్టమైన జవాబు చెప్పినందుకు విద్యార్థి కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు.
పాట 26 (212), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 28తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు. ఫిబ్రవరి క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించి, ఫిబ్రవరి 1 కావలికోటను లేక జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఇతర వాస్తవిక ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు. ఒక ప్రతిపాదన ముగింపులో మార్చి 8 తేజరిల్లు! (ఆంగ్లం)లో వెనుక పేజీని ఉపయోగించి ప్రచారకుడు గృహస్థుడిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నట్లు చూపించండి.
15 నిమి: బలహీనులపట్ల శ్రద్ధ చూపించండి. (అపొ. 20:35) ఒక నిమిషం కన్నా తక్కువగా ఉండే ఉపోద్ఘాతం తర్వాత జూలై 1, 2004, కావలికోట, 17-18 పేజీలు, 12-16 పేరాల మీద కావలికోట అధ్యయనం చేసే పద్ధతిలో ప్రశ్నా జవాబుల చర్చను నిర్వహించండి. సమర్థవంతంగా చదవగలిగే సహోదరునిచేత పేరాలను చదివించండి. ఈ సమాచారాన్ని రానున్న జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక ప్రసంగానికి సంబంధంగా ఎలా అన్వయించుకోవచ్చో అనే విషయం మీద ప్రత్యేక దృష్టి నిలపండి.
20 నిమి: వేరే భాష మాట్లాడేవారికి సహాయం చేసే విధానం. అన్ని దేశాల ప్రజలకు సువార్త పుస్తకంలోని ముందుమాట ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. కొత్తగా విడుదలైన ఈ చిన్న పుస్తకంలోని విశిష్ఠమైన విషయాలను నొక్కి చెప్పండి. మనకు రాని భాషను మాట్లాడే వారికి సహాయం చేయడానికి మనం తీసుకోగల మూడు చర్యలను చర్చించండి. జూలై 2003 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి. ఒక వ్యక్తి రాజ్య సందేశంపట్ల ఆసక్తి చూపించకపోయినా కూడా సాధారణంగా ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారం పూరించాలని పేర్కొనండి. కొత్తగా విడుదలైన ఈ చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో చూపించే ప్రదర్శనను చేర్చండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
మార్చి 7తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” అనే బాక్సులోని ముఖ్యాంశాలను సమీక్షించండి.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: “మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి.”d 3, 4 పేరాలను చర్చిస్తున్నప్పుడు సమాచారం స్థానికంగా ఎలా అన్వయిస్తుందో వివరించండి. వ్యాపార స్థలాల్లో, వీధి సాక్ష్యంలో, బహిరంగ ప్రదేశాల్లో, అనియత సాక్ష్యం ఇస్తున్నప్పుడు పత్రికలను అందించడంలో సమర్థులైన ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఈ పరిస్థితుల్లో వారు పత్రికలను ఎలా అందిస్తారో వారిని అడగండి. ఒక అనుభవానికి సంబంధించిన ఒక క్లుప్త ప్రదర్శనను ఏర్పాటు చేయండి లేదా ఆ ఘటనను పునర్నటింపజేయండి.
పాట 21 (192), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.