ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరిలో: పసుపుపచ్చగా మారే లేక రంగు వెలిసిపోయే పేపరుపై ముద్రించబడిన 192 పేజీ పుస్తకాలు ఏవైనా లేదా 1990కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా ప్రతిపాదించవచ్చు. అలాంటి పాత పుస్తకాలు స్టాకులేని సంఘాలు దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ ప్రచురణలేని సంఘాలు ప్రత్యామ్నాయంగా సృష్టి (ఆంగ్లం) లేదా ప్రకటన ముగింపు! పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించి గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి ప్రయత్నించండి. ఏప్రిల్, మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తుప్పుడు, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని ప్రతిపాదించడం మీద దృష్టి నిలపండి. ముఖ్యంగా జ్ఞానము పుస్తకం, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లను ఇప్పటికే అధ్యయనం చేసిన వారుంటే వారితో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.
◼ ఫిబ్రవరి నుండి మార్చి 6లోపు ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే కొత్త బహిరంగ ప్రసంగం “మూర్ఖమైన లోకంలో జ్ఞానయుక్తంగా వ్యవహరించండి.”
◼ ఈ సంవత్సరం మార్చి 24, గురువారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రసంగం ముందుగానే ప్రారంభమైనప్పటికీ జ్ఞాపకార్థ చిహ్నాలను మాత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు అందించకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందో స్థానికంగా అడిగి తెలుసుకోండి. ప్రతీ సంఘం సొంతగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం కోరదగినదే అయినా ఇది అన్ని సందర్భాల్లోను సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే హాలును ఒక సంఘం తర్వాత మరో సంఘం ఉపయోగించాలనుకుంటే, ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకుగాను కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాం. హాజరయ్యే వారిని తీసుకురావడం, తీసుకువెళ్ళడంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ వంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు శ్రేష్ఠమైనవో పెద్దల సభ నిర్ణయించాలి.
◼ దావీదు దేవునిపై విశ్వాసముంచాడు అనే వీడియోకు సంబంధించి సేవా కూటంలో జరగబోయే చర్చ గురించిన వివరాలు మార్చి మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడతాయి. ఈ వీడియో నోవహు దేవునితో నడిచాడు—దావీదు దేవునిపై విశ్వాసముంచాడు అనే పేరుగల డీవీడీలో మాత్రమే లభ్యమవుతోంది. మీరు ఆ డిస్క్‌లో ఉన్న ఎనిమిది భాషల్లోనుండి అంటే ఆంగ్లం, ఇటాలియన్, జపనీస్, జర్మన్, ఫ్రెంచి, పోర్చుగీస్ (బ్రెజీలియన్), రష్యన్, స్పానిష్ భాషల్లోనుండి ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ డీవీడీ భారతీయ భాషల్లో లభ్యమవడంలేదు. డీవీడీ కాపీల కోసం సంఘం ద్వారా తర్వాతి సాహిత్యపు రిక్వెస్ట్‌లో కోరవచ్చు.
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు—గుజరాతీ
ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను—గుజరాతీ
యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు—పంజాబీ
విడుదలకు నడుపు దైవికసత్య మార్గము—గుజరాతీ
సురక్షితమైన భవిష్యత్తును—నీవు ఎట్లు కనుగొందువు?—గుజరాతీ
◼ క్రొత్తగా లభ్యమవుతున్న వీసీడీలు:
విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం —ఆంగ్లం
శ్రమల్లో విశ్వసనీయత—సోవియట్ యూనియన్‌లోని యెహోవాసాక్షులు—ఆంగ్లం
బిలు—మానవజాతి అతి పురాతనమైన ఆధునిక గ్రంథము—ఆంగ్లం
బైబిలు—మీ జీవితంలో దాని శక్తి—ఆంగ్లం
మన కాలానికి హెచ్చరికా మాదిరులు—ఆంగ్లం
యెహోవా అధికారాన్ని గౌరవించండి—ఆంగ్లం
యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు—ఆంగ్లం