మలచుకోవడానికి అనువైన పద్ధతిని ఉపయోగించడానికి ప్రయత్నించండి
మనకు ప్రజలపట్ల నిజమైన ఆసక్తి ఉన్నట్లయితే, వారి అవసరతలను గుర్తించేందుకు ప్రయత్నించడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యం పూర్తిగా ఎలా పరిష్కరిస్తుందో వారికి చూపించడానికి మనం పురికొల్పబడతాము. (ఫిలి. 2:4) మన ప్రచురణల్లోని పరదైసు చిత్రాల గురించి వ్యాఖ్యానించమని ఇంటి యజమానిని ఆహ్వానించడం సమర్థవంతంగా ఉంటుందని, దానిని పరిస్థితులకు తగినట్లు మలచుకోవచ్చని చాలామంది ప్రచారకులు కనుగొన్నారు. అలాంటి కొన్ని చిత్రాల పేజీ నంబర్లు కుడివైపున్న పట్టికలో ఇవ్వబడ్డాయి. క్రింద ఇవ్వబడిన ఉపోద్ఘాతాలలో ఒకదానిని ఉపయోగించి మీరు కూడా అలా చేయవచ్చు:
◼ “ఇక్కడ చిత్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మానవులు అనుభవించడాన్ని మనమెప్పటికైనా చూస్తామంటారా?”
◼ “ఈ చిత్రంలో ఉన్నలాంటి లోకంలో మన పిల్లలు ఆనందంగా జీవించగలిగితే బాగుంటుందని మనమందరం కోరుకుంటాం. ఇలాంటి పరిస్థితులు రావాలంటే ఏమి చేయవలసిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు?”
◼ “దేవుని చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమ్మీద నెరవేరితే భూమి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో ఉదహరించబడింది. ఇందులో నేడున్న జీవితానికి భిన్నమైనది ఏమైనా గమనించారా?”
◼ “ఇక్కడ చిత్రంలో చూపించబడిన పరిస్థితుల్లో జీవించడానికి మీరు ఇష్టపడతారా? [ప్రతిస్పందించనివ్వండి.] మన జీవిత కాలంలో ఇది సంభవించగలదని మీరు భావిస్తున్నారా?”
ఆ వ్యక్తి ప్రతిస్పందనను శ్రద్ధగా వినండి, ఒకటి లేక రెండు అదనపు ప్రశ్నలు వేయడం ద్వారా ఆయన అభిప్రాయం తెలుసుకోండి. చిత్రంలోని పరిస్థితుల్లో జీవించడం తమకు ఇష్టం లేదని లేక అలాంటి పరిస్థితి సాధ్యమవుతుందని తాము అనుకోవడం లేదని ఎవరైనా ప్రతిస్పందించినట్లయితే, వారికి ఆసక్తి లేదని వెంటనే నిర్ధారణకు రాకండి. వారెందుకలా భావిస్తున్నారో యుక్తితో అడగండి. వారి వ్యాఖ్యానాలు, పరిష్కరించడానికి వీల్లేనట్లుగా కనిపించే మానవజాతి సమస్యల గురించి వారు ఎంతో చింతిస్తున్నారని వెల్లడి చేయవచ్చు.—యెహె. 9:4.
మీరు ఆ గృహస్థుని చింతలను గ్రహించిన తర్వాత, మీ ప్రతిపాదనను తదనుగుణంగా మలచుకోండి. రాజ్య సందేశంలో ఆయన అవసరతల గురించి సూటిగా చర్చించే అంశాన్ని నొక్కిచెప్పండి. ఆయనను కలతపరుస్తున్న అంశానికి సంబంధించిన ఒకటి లేక రెండు లేఖనాలను చూపించండి. (కుడివైపు పట్టికలోని సలహాలను చూడండి.) దేవుని వాక్యం ఏమి చెబుతుందో ఆయననే చూడనివ్వండి. ఆయన ఆసక్తి చూపించినట్లయితే, ప్రచురణను అందించి, మళ్ళీ కలుసుకొనేందుకు ఏర్పాటు చేసుకోండి. ఆయనను మళ్ళీ కలిసినప్పుడు మొదటి సంభాషణను ఆధారం చేసుకొని ఆయన ఆసక్తిని పెంచండి.
[6వ పేజీలోని బాక్సు]
పరదైసు చిత్రాల ఉదాహరణలు
సృష్టి (ఆంగ్లం) పుస్తకం: 237, 243, 251 పేజీలు
బోధకుడు (ఆంగ్లం) పుస్తకం: 251-4 పేజీలు
జ్ఞానము పుస్తకం: 4-5, 188-9 పేజీలు
దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్: 11, 13 పేజీలు
నిజమైన శాంతి (ఆంగ్లం) పుస్తకం: 98వ పేజీ
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం: 92-3 పేజీలు
[6వ పేజీలోని బాక్సు]
ప్రజలను కలతపరచే విషయాలు
అవినీతి, అన్యాయం
అనారోగ్యం, అంగవైకల్యం
అసమర్థమైన ప్రభుత్వం
ఆహార కొరత, కుపోషణ
గృహ, ఆర్థిక సమస్యలు
జంతువులను హింసించడం
నేరం, హింస
నైతిక విలువలు దిగజారిపోవడం
బీదరికం, అణచివేత
భూమిని నాశనం చేయడం
మరణం, దుఃఖం
మానసిక కృంగుదల
యుద్ధాలు, తీవ్రవాదం
వివక్ష, అసమానత్వం