ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టులో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్. ఇది లభ్యం కాకపోతే, నా బైబిలు కథల పుస్తకము లేదా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. దయచేసి ఆసక్తి కనబరచిన చోట, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేసి, గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే లక్ష్యంతో పునర్దర్శనాలు చేయండి. నవంబరులో: సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్. ఇది లభ్యం కాకపోతే, నా బైబిలు కథల పుస్తకము లేదా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు సెప్టెంబరు 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘపు అక్కౌంట్స్ ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసిన తరువాత దాని వివరాలు, తరువాతి అక్కౌంట్స్ రిపోర్టుతోపాటు సంఘానికి ప్రకటించాలి.
◼ ఆగస్టు నెలలో అన్ని సంఘాలకు కాంగ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్ట్ (S-AB-10) ఫారాలు రెండు కాపీలు పంపించబడతాయి. దీన్ని సంఘ ఆగస్టు నెల సేవా రిపోర్టు పూర్తి చేసిన తర్వాత పూరించాలి. ఇది ఖచ్చితంగా ఉండేందుకు దీన్ని నింపేటప్పుడు కార్యదర్శి మరియు సేవా పైవిచారణకర్త కలిసి పని చేయాలి. ఈ ఫారం వెనుక వైపు క్రమ పయినీర్ల గురించిన సమాచారం తెలిపేందుకు ఉపయోగించాలి. దయచేసి ఒరిజినల్ కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 10 లోపు పంపించండి. ఒక కాపీ మీ ఫైళ్ళ కోసం ఉంచుకోండి.
◼ స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ ఆగస్టు 31, 2004న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి. ప్రతినెల లిటరేచర్ కో-ఆర్డినేటర్ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్ ఇన్వెంటరీ (S-18) ఫారంలో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను పత్రికా సేవకుని(ల) నుండి పొందవచ్చు. ఈ ఇన్వెంటరీని కో-ఆర్డినేటింగ్ సంఘ కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనా కో-ఆర్డినేటింగ్ సంఘ పైవిచారణకర్తా ఇద్దరూ ఫారం మీద సంతకాలు చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్ సంఘానికి మూడు లిటరేచర్ ఇన్వెంటరీ (S-18) ఫారాలు పంపించబడతాయి. దయచేసి ఒరిజినల్ కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. మీ ఫైళ్ళ కోసం ఒక కాపీ ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్ షీట్‌గా ఉపయోగించుకోవచ్చు.
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?—బెంగాలీ
మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే—గుజరాతి, పంజాబి
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కలిగియున్నాడా?—మరాఠీ
జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?—మరాఠీ
ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా (ముస్లిమ్‌లకు)—తమిళం