దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2004 ఆగస్టు 30వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2004 జూలై 5 నుండి ఆగస్టు 30 మధ్య వారాల్లోని నియామకాల ద్వారా అందించబడ్డ సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి మీరు స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మన నిరీక్షణకుగల కారణాన్ని మనం ‘సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢ గౌరవంతో,” NW]’ ఎలా వివరించవచ్చు? (1 పేతు. 3:15) [be 192వ పేజీ, 2-4 పేరాలు]
2. నిశ్చయతతో మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం? (రోమా. 8:38, 39; 1 థెస్స. 1:5; 1 పేతు. 5:12) [be 194వ పేజీ]
3. మన నిశ్చయత ఎలా వెల్లడవుతుంది? [be 195వ పేజీ, 3వ పేరా-196వ పేజీ, 4వ పేరా]
4. ఔచిత్యం అంటే ఏమిటి, అది ఎందుకు ప్రాముఖ్యం, మనం ఔచిత్యంతోనే అయినా దృఢంగా ఎలా మాట్లాడగలం? (రోమా. 12:18) [be 197వ పేజీ]
5. ఔచిత్యంగల వ్యక్తి, మాట్లాడే ముందు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటాడు? (సామె. 25:11; యోహా. 16:12) [be 199వ పేజీ]
ఒకటవ నియామకం
6. మన సంభాషణలు, బైబిలు అధ్యయన అలవాట్లు మనం సత్యంలో ఎంతమేరకు అభివృద్ధి సాధించామనే విషయాన్ని ఎలా సూచించగలవు? [be 74వ పేజీ, 3వ పేరా-75వ పేజీ, 2వ పేరా]
7. ‘సమయమును పోనివ్వకుండా సద్వినియోగము చేసుకోవడం’ అంటే ఏమిటి, మనం దాన్ని ఎలా చేయవచ్చు? (ఎఫె. 5:16) [w02 11/15 23వ పేజీ]
8. దేవుని ఎదుట మానవులందరూ సమానమేనని లేఖనాలు ఎలా స్పష్టం చేస్తున్నాయి, ఆ విషయం మన పరిచర్యపై ఎలాంటి ప్రభావం చూపించాలి? [w02 1/1 5, 7 పేజీలు]
9. సృష్టికర్తకున్న యెహోవా అనే విశిష్టమైన నామము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? [w02 1/15 5వ పేజీ]
10. హేబెలు అర్పణను కయీను అర్పణకంటే ‘శ్రేష్ఠమైనదిగా’ చేసినదేమిటి, దీనినుండి మనం మన “స్తుతియాగము” విషయంలో ఏ పాఠం నేర్చుకోవచ్చు? (హెబ్రీ. 11:4; 13:15) [w02 1/15 21వ పేజీ, 6-8 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. మనం తప్పొప్పులను గురించి వక్రీకరించబడిన తలంపులకు దూరంగా ఉండడానికి లేవీయకాండము 18:3 ఎలా సహాయం చేస్తుంది? (ఎఫె. 4:17-19) [w02 2/1 29వ పేజీ]
12. వారముల పండుగ (పెంతెకొస్తు) సమయంలో ప్రధాన యాజకుడు “అల్లాడించు అర్పణముగా” అర్పించే “రెండు రొట్టెలు” ప్రవచనాత్మకంగా దేనిని వర్ణిస్తున్నాయి? (లేవీ. 23:15-17) [w98 3/1 13వ పేజీ, 21వ పేరా]
13. సంఖ్యాకాండము 5వ అధ్యాయములో పేర్కొనబడినట్లుగా ఒక స్త్రీ వ్యభిచారము చేస్తే, ఏ భావంలో ‘ఆమె నడుము పడిపోతుంది’? (సంఖ్యా. 5:27) [w84 4/15 29వ పేజీ]
14. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మిర్యాము, అహరోను ఆయనకు విరోధముగా ఎందుకు మాట్లాడారు? (సంఖ్యా. 12:1)
15. “యెహోవా యుద్ధముల గ్రంథము” అంటే ఏమిటి? (సంఖ్యా. 21:14)