పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట మే 15
“మానవులు భూమ్మీద చేసే పనులు దేవునిపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా అని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] మన చర్యలు దేవుని మనోభావాలను ఎలా ప్రభావితం చేయగలవో గమనించండి. [సామెతలు 27:11 చదవండి.] ఈ పత్రిక, దేవుని హృదయాన్ని సంతోషపరచిన ప్రజల ఉదాహరణలు కొన్నింటిని పరిశీలిస్తుంది, మనం కూడా అదేవిధంగా ఎలా చేయవచ్చో వివరిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“పిల్లలు కావాలని తల్లిదండ్రులిద్దరూ కోరుకున్నప్పటికీ, వారిని చూసుకునే పని మాత్రం సాధారణంగా తల్లిపైనే పడుతుంది. పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్ర ఏమిటని మీరు భావిస్తున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఇరువురు సంతోషంగా కలిసి ప్రయత్నిస్తే పిల్లల అవసరాలను ఎంత చక్కగా తీర్చవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”
కావలికోట జూన్ 1
“దేవుణ్ణి ఆరాధించడానికి, వ్యవస్థీకరించబడిన మతంలో భాగంగా ఉండాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తారు. మీరు ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] గత కాలాల్లో దేవుడు ప్రజలతో వ్యవహరించిన వృత్తాంతాన్ని ఈ పత్రిక పరిశీలిస్తుంది. దేవుణ్ణి సత్యంతో ఆరాధించడమంటే ఏమిటనే విషయం కూడా ఇందులో చర్చించబడింది.” యోహాను 4:24 చదవండి.
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“నేడు అనేకమంది తమ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి సరిపడా సమయం లేదని భావిస్తారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, తర్వాత 21వ పేజీలోని ఆర్టికల్ తెరవండి.] ఈ తేజరిల్లు! సంచిక, మనకు దొరికే సమయం నుండే సాధ్యమైనంత ప్రయోజనం పొందడానికి ఆచరణాత్మకమైన సలహాలను ఇస్తోంది.”