సేవా కూటాల పట్టిక
ఏప్రిల్ 12తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను, ఏప్రిల్ 15 కావలికోటను ఎలా అందించాలో విడివిడిగా ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలో మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. రెండు ప్రదర్శనల్లోనూ ‘పనితొందరలో ఉన్నాను’ అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్నమైన రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలో 11-12 పేజీలు చూడండి.
15 నిమి: “యెహోవాకు మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవాటిని సమర్పించడం.”a 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, మనం మన పరిచర్యలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏయే విధాలుగా ప్రజలపట్ల మన ప్రేమను చూపించవచ్చో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.
20 నిమి: “‘దేవునితో నడవండి’ యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2004.” సంఘ కార్యదర్శి నిర్వహించాలి. 5వ పేరా చర్చిస్తున్నప్పుడు, ప్రేక్షకుల్లో చదవడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చినవారితో 4వ పేజీలోవున్న బాక్సులోని అంశాలన్నింటినీ చదివించండి. 5-8 పేరాలను చర్చిస్తున్నప్పుడు, సంఘం కోసం సమావేశ కో-ఆర్డినేటర్‌గా కార్యదర్శి పాత్రను నొక్కిచెప్పండి. సమావేశానికి హాజరు కావడానికి సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేసుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.
పాట 21 (191), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 19తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
17 నిమి: “యేసు మనస్సును అలవరచుకోండి.”b ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, సహాయ పయినీరు సేవ చేస్తున్నవారు ఆ సేవవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు చవిచూశారో తెలుపమని కోరండి.
20 నిమి: “రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగుతోంది.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 26తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు. ఏప్రిల్ క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. మే నెలలో ప్రతిపాదించే సాహిత్యాలను పేర్కొనండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను, మే 1 కావలికోటను ఎలా అందించాలో విడివిడిగా ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలో మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. ఒక ప్రదర్శనలో, సహోద్యోగికి లేదా తోటి విద్యార్థికి సాక్ష్యమివ్వడాన్ని ప్రదర్శించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
18 నిమి: “సాక్షికాని జీవిత భాగస్వామికి మనమెలా సహాయం చేయవచ్చు?”c తమ వివాహిత భాగస్వామి మంచి మాదిరి కారణంగా సత్యాన్ని అంగీకరించి యెహోవా సేవకులుగా మారిన ఒకరు లేక ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
మే 3తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు. వేసవి సెలవుల కోసం మామూలుగా ప్రణాళిక వేసుకొనే కార్యకలాపాల గురించి క్లుప్తంగా వ్యాఖ్యానించండి: సహాయ పయినీరు సేవ, ఇంటి పరిసరాలను శుభ్రంచేసుకోవడం, బహుశా ఏదైనా వినోద కాలక్షేపం. అరుదుగా సేవచేసిన క్షేత్రమేదైనా సంఘానికి ఉంటే, దాన్ని సమగ్రంగా పూర్తిచేయడానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలియజేయండి. ఇతర ప్రదేశాలకు వెళ్ళడంవల్ల గానీ లేదా వేసవి సెలవుల్లో మనం చేయాలనుకునే ఇతర కార్యకలాపాలవల్ల గానీ మన దినచర్య అంటే కుటుంబ అధ్యయనం, సంఘ కూటాలు, క్షేత్ర సేవ వంటివి నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండేందుకు ఖచ్చితమైన ప్రణాళిక చాలా అవసరం. (సామె. 21:5) ఊళ్ళో ఉన్నా లేకున్నా తమ క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని అందరికీ గుర్తుచేయండి.
20 నిమి: “యౌవనులారా—దేవుని వాక్యం చదవండి.”d ఒకరు లేదా ఇద్దరు యౌవనులను ముందుగానే ఏర్పాటు చేసుకొని, బైబిలు చదివేందుకు తాము వేసుకున్న కార్యక్రమం గురించి, దానివల్ల వారు పొందుతున్న ప్రయోజనం గురించి వ్యాఖ్యానించమనండి. బైబిలంతా చదవడాన్ని తమ లక్ష్యంగా పెట్టుకొమ్మని యౌవనులను ప్రోత్సహించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 10వ పేజీ, 4వ పేరాలోనున్న వ్యాఖ్యానాలను కూడా చేర్చండి.
15 నిమి: స్థానిక అనుభవాలు. ఈ క్రింద పేర్కొన్న రంగాల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో చేసిన ప్రత్యేక ప్రయత్నాల వల్ల పొందిన కొన్ని క్షేమాభివృద్ధికరమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను కోరండి: (1) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడానికి ఆసక్తిగల ఒక వ్యక్తికి సహాయం చేయడం, (2) సహాయ పయినీరుగా సేవ చేయడం, (3) నిష్క్రియుడిగా మారిన ఒక ప్రచారకుడిని సంఘంతో మళ్ళీ క్రియాశీలునిగా మారేందుకు ప్రోత్సహించడం, (4) ప్రకటనా పని ప్రారంభించడానికి ఒక కొత్త వ్యక్తికి సహాయం చేయడం, (5) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి ఆసక్తిని వృద్ధిచేయడం, లేదా (6) వేసవి సెలవుల్లో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం. వీటిలో కొన్ని వ్యాఖ్యానాలివ్వడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ఈ ప్రయత్నాలకు అందరినీ ప్రశంసించి, భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించమని ప్రోత్సహించండి.
పాట 19 (164), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.